నన్ను పంపించేయండి బిగ్ బాస్.. పుణ్యముంటుంది: అరియానా

నన్ను పంపించేయండి బిగ్ బాస్.. పుణ్యముంటుంది: అరియానా

గత కొద్దిరోజులుగా ఈమెపై నెగటివిటీ మొదలైంది. హ్యుమానిటీ లేకుండా ప్రవర్తిస్తోందని ఇంటి సభ్యులందరూ అరియానాను గట్టిగానే టార్గెట్ చేశారు. 

Ravi Kiran

|

Nov 10, 2020 | 12:43 PM

Bigg Boss Telugu 4: బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్‌గా.. ప్రతీ టాస్క్‌లోనూ చురుకుగా పాల్గొంటూ అరియానా గ్లోరీ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తోంది. అటు గ్లామర్‌తో కూడా ఫ్యాన్స్‌ను మాయ చేస్తోందని చెప్పాలి. మొదటి వారం పెద్దగా స్క్రీన్ ప్రెజన్స్ లేకపోయినా.. రెండో వారం నుంచి ఇప్పటిదాకా ప్రతి టాస్క్‌లోనూ 100 శాతం ఎఫ్ర్ట్స్ పెడుతోంది. ఇక అవినాష్‌తో కలిసి ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇదంతా పక్కన పెడితే గత కొద్దిరోజులుగా ఈమెపై నెగటివిటీ మొదలైంది. హ్యుమానిటీ లేకుండా ప్రవర్తిస్తోందని ఇంటి సభ్యులందరూ అరియానాను గట్టిగానే టార్గెట్ చేశారు.

ఇక తాజాగా జరిగిన పదో వారం ఎలిమినేషన్ నామినేషన్స్‌లో కూడా మెజారిటీ కంటెస్టెంట్లు అరియానాను నామినేట్ చేయడం జరిగింది. కెప్టెన్‌గా హౌస్‌లో కఠినమైన రూల్స్ పెట్టిందని కొందరు.. టాస్కుల్లో హద్దు మీరుతోందని మరికొందరు రీజన్స్ చెప్పుకొచ్చారు. అందరూ కలిసి ఆమెను టార్గెట్ చేయడం.. అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ కావడంతో అరియానా ఒక్కసారిగా బోరున విలపించింది.

”నేను ఆల్రెడీ ఒంటరిగా ఉన్నాను. నన్ను ఎందుకు ఇంకా ఒంటరిని చేస్తున్నారు. నిజంగా నాకుండాలనిపించట్లేదు. నన్ను కూడా పంపించేయండి పుణ్యం ఉంటుంది, నేను స్ట్రాంగ్ కాదు. నాకు వీళ్ళెవరూ నచ్చట్లేదు. నాలో స్పోర్టివ్ స్పిరిట్, ఇండిపెండెంట్ థింకింగ్ రెండూ అయిపోయాయి, నేను ఇంటికెళ్ళిపోతా. నాకు ఇక్కడ నిజంగా ఉండాలని లేదు” అంటూ అరియానా బిగ్ బాస్ కెమెరా ముందు బోరున విలపిస్తూ ఏడ్చింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu