Bigg Boss 4 Telugu: అఖిల్‌ని సీక్రెట్‌ రూమ్‌కి పంపిన బిగ్‌బాస్‌.. అభిజిత్‌కి తెలిసిపోయిందా..!

కంటెస్టెంట్‌లకు బిగ్‌బాస్‌ ఓ ఆఫర్‌ని ఇచ్చారు. ఫినాలేకి వెళ్లాలనుకుంటే ఏ సభ్యుడు తమకు అడ్డుపడతాడని భావిస్తే అతడిని ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంతో ఎంపిక చేసి బిగ్‌బాస్‌కి తెలపాలని అన్నాడు

Bigg Boss 4 Telugu: అఖిల్‌ని సీక్రెట్‌ రూమ్‌కి పంపిన బిగ్‌బాస్‌.. అభిజిత్‌కి తెలిసిపోయిందా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 12, 2020 | 9:32 PM

Bigg Boss 4 Akhil: కంటెస్టెంట్‌లకు బిగ్‌బాస్‌ ఓ ఆఫర్‌ని ఇచ్చారు. ఫినాలేకి వెళ్లాలనుకుంటే ఏ సభ్యుడు తమకు అడ్డుపడతాడని భావిస్తే అతడిని ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంతో ఎంపిక చేసి బిగ్‌బాస్‌కి తెలపాలని అన్నాడు. దీంతో హౌజ్‌లోకి వారి మధ్య అసలు రచ్చ మొదలైంది. ఎవరు స్ట్రాంగ్ అన్నదానిపై తర్జనభర్జనలు పడ్డారు.

ఈ క్రమంలో సొహైల్‌, మెహబూబ్ పేరు.. అరియానా, అఖిల్ పేరు.. అవినాష్, అరియానా పేరు.. మోనాల్, అఖిల్‌ పేరు.. మెహబూబ్, అరియానా పేరు చెప్పారు. మిగిలిన అభిజిత్‌, లాస్య, అఖిల్‌లు మాకు మేము తోపు అని వారి పేర్లు చెప్పుకున్నారు. ఇక హారిక.. నేను స్ట్రాంగ్ అయినప్పటికీ నా పేను చెప్పును. మెజారిటీ సభ్యులు ఎవరి పేరు అనుకుంటే వారికి సపోర్ట్ చేస్తా అని చెప్పుకొచ్చింది. ఇక ఎవరి పేర్లు వారు చెప్పినందుకు సభ్యుల మధ్య మళ్లీ చర్చ జరిగింది.

మొత్తానికి ఎక్కువ మంది అఖిల్ పేరు చెప్పడంతో అతడిని పంపాలని నిర్ణయానికి వచ్చారు. దీంతో అఖిల్‌ని మెయిన్ డోర్ నుంచి బయటకు రావాలని ఆదేశించారు. షాక్‌లో ఉండిపోయిన అఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను స్ట్రాంగ్ అని చెప్పి బయటకు పంపుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రేక్షకుల ఓట్లు పడలేదు. అందువల్లే బయటకు వెళ్తున్నా అంటే బాగా ఫీల్ అయ్యే వాడినేమో. కానీ నేను స్ట్రాంగ్ అని బయటకు పంపించడం ఏంటో నాకు అర్థం కావడం లేదు అంటూ వాపోయాడు. ఆ తరువాత సీక్రెట్‌ రూమ్‌కి వెళ్లాడు. ఇక సీక్రెట్ రూమ్‌కి వెళ్లిన తరువాత అఖిల్‌.. థాంక్యూ బిగ్ బాస్, ఇక్కడ నుంచి ఎవరు ఎలా ఆట ఆడుతున్నారో అన్నీ తెలుస్తాయి.. అసలు ఆట ఇప్పుడు మొదలవుతుంది అని చెప్పాడు.

కాగా అఖిల్‌ని బయటకు పంపినట్లు అభి మాత్రం నమ్మనట్లుగా ఉన్నాడు. ఇందులో ఏదో తేడా ఉందని అభి భావిస్తున్నాడు. అందుకే అఖిల్‌ని పంపే సమయంలో కాస్త దూరంగానే ఉన్నాడు. కాగా గతంలో ముమైత్, రాహుల్‌ని కూడా ఇలానే సీక్రెట్ రూమ్‌లో పెట్టిన విషయం తెలిసిందే.