Bigg Boss 4: సొహైల్‌ని ఇమిటేట్ చేసిన బిగ్‌బాస్.. కథ వేరే లెవల్లో ఉంది బిగ్‌బాస్ అన్న సొహైల్
శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో భాగంగా కుటుంబ సభ్యులకు బిగ్‌బాస్ ఓ టాస్క్‌ని ఇచ్చారు. ఒక రోజంతా నవ్వకుండా ఉండాలని సూచించారు
Bigg Boss Sohel: శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో భాగంగా కుటుంబ సభ్యులకు బిగ్‌బాస్ ఓ టాస్క్‌ని ఇచ్చారు. ఒక రోజంతా నవ్వకుండా ఉండాలని సూచించారు. ఈ క్రమంలో ఒక్కో ఇంటి సభ్యుడు మిగిలిన వాళ్లని నవ్వించే ప్రయత్నం చేశారు. అందరిలో అవినాష్ తన జోకులతో నవ్వించాడు. మరోవైపు బిగ్‌బాస్ కూడా హౌజ్‌మేట్స్‌పై జోకుల దాడి చేశాడు. (Bigg Boss 4: స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన బిగ్‌బాస్.. ఎమోషనల్ అయిన లాస్య)
సొహైల్‌ని పిలిచి.. ఏందీ పంచాయితీ.. కథెట్లుంది అంటూ అతడిని ఇమిటేట్ చేశాడు. దీంతో సొహైల్ నవ్వు ఆపుకోలేకపోయాడు. కథ వేరే లెవల్‌లో ఉన్నది బిగ్‌బాస్ అని అన్నాడు. బిగ్‌బాస్ మీ నోట నా మాటలు వచ్చాయి. అదే చాలు అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక అవినాష్‌తో.. ”అవినాష్ నీ తెలుగు చాలా బావుంటుంది. తెలుగులో నవ్వు” అన్నాడు. ఇక బిగ్‌బాస్ పంచ్‌లకు నవ్వట్లేదు, నవ్వట్లేదు అంటూనే అవినాష్ నవ్వేశాడు. (Bigg Boss 4: అవినాష్ పులిహోరా.. నీకు పడిపోతాలే అవినాష్ అన్న అరియానా)