Bigg Boss 4 : అరేయ్ మామా అభిజీత్ బిగ్ బాస్ ట్రోఫీ తీసుకొని రా.. మస్త్ దావత్ చేసుకుందాం.. : యంగ్ హీరో
బిగ్ బాస్ సీజన్ 4లో యంగ్ హీరో అభిజీత్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి అతడి గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. మొదటినుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంటున్న అభిజీత్ కు బయట మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
బిగ్ బాస్ సీజన్ 4లో యంగ్ హీరో అభిజీత్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి అతడి గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. మొదటినుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంటున్న అభిజీత్ కు బయట మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అతడు విన్ అవ్వలని అభిజీత్ ఫ్యాన్స్ భారీగా ఓట్లు వేస్తున్నారు. ఇక అభిజీత్ బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని కొంతమంది సెలబ్రేటీలు కూడా కోరుకుంటున్నారు. తాజాగా యాంగ్ హీరో సుధాకర్ కోమాకుల అభిజీత్ బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని ఒక వీడియోను పంపాడు. అభిజీత్, సుధాకర్ కలిసి ‘లైఫ్ ఈస్ బ్యూటీఫుల్’ సినిమాలో నటించారు. అప్పటినుంచి ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు.
గతంలో కూడా అభిజీత్ బిగ్ బాస్ హౌస్ కు వెళ్ళినప్పుడు సుధాకర్ ఓ వీడియోను పంపాడు. ఆయా వీడియోలో అభిజీత్ ను పొగిడాడు . అతడు ఎంత స్ట్రాంగ్ పర్సనో చెప్పాడు సుధాకర్. తాజాగా మరో వీడియోను పంపాడు. సుధాకర్ మాట్లాడుతూ.. నా క్లోజ్ ఫ్రెండ్ అభిజీత్. ఇప్పుడు టైటిల్ విన్నర్ అయ్యే కంటెస్టెంట్స్ లలో ముందు వరుసలో ఉన్నాడు. రెండు నెలల క్రితం అభి కోసం ఒక వీడియో చేసినప్పుడు పాజిటివ్ కామెంట్స్ తో పాటు కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే అప్పటికి ఇప్పటికి జనాల్లో అభిజీత్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. నిజానికి అభిజిత్ విన్నర్ అవ్వడానికి అతి ముఖ్యమైన కంటెస్టెంట్స్ అనిపిస్తోంది. నాకు ముందు నుంచే అభి తెలుసు. అతను చాలా మంచివాడు . అతను బిగ్ బాస్ లో సర్ ప్రైజ్ అయ్యే రేంజ్ లో పర్ఫామెన్స్ ఇచ్చాడు.
అభిజీత్ బయట ఎలా ఉన్నాడో బిగ్ బాస్ హౌజ్ లో కూడా అలానే ఉన్నాడు. అందుకే అందరికి అంత బాగా నచ్చేశాడు. ఎన్నిసార్లు నామినేషన్స్ లోకి వెళ్లినా కూడా ఆడియెన్స్ ఓట్లు వేసి గెలిపించారు. మొదట్లో ఫిజికల్ టాస్క్ లో కొన్ని నొప్పుల వలన అంత బాగా పెర్ఫామెన్స్ చేయని అభి రోబో టాస్క్ లో మాత్రం చాలా బాగా ఆడాడు. అక్కడి నుంచే అభిజీత్ కు మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి అభి గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. ఇక ఏ పరిస్థితులలో అయినా అభిజీత్ చాలా బ్యాలెన్స్ గా ఉన్నాడు. సరదా ఉన్నప్పుడు సరదాగానే ఉన్నాడు. టాస్క్ల విషయంలో ఫ్రెండ్స్ ను కూడా పక్కన పెట్టాడు. అందుకే అంతమంది అభిమానులను సొంతం అభిజీత్ కు ఓట్లు వేసి గెలిపించండి అని సుధాకర్ వీడియో ద్వారా తెలిపాడు. ఇక వీడియో చివర్లో తెలంగాణ యాసలో డైలాగ్ చెప్పాడు. ” అరేయ్ మామా అభిజిత్ బిగ్ బాస్ ట్రోఫీ తీసుకొని రా.. బీ ఫేస్ మొత్తం ఎదురుచూస్తోంది. ఎంజాయ్ చేద్దాం. మస్త్ దావత్ చేసుకుందాం. అమెరికా నుంచి వచ్చిన రా బై నీ కోసం. తప్పకుండా బిగ్ బాస్ విన్నర్ కావాలి చెబుతున్నా చూడు..” అంటూ లైఫ్ ఈస్ బ్యూటీఫుల్ మూవీ క్యారెక్టర్ తో అభిజీత్ కు మద్దతు తెలిపాడు సుధాకర్.