Bigg Boss 4 : హౌస్‌లో డ్యాన్స్ టాస్క్ రచ్చ.. ఈ సారి అరియనాకు అభిజిత్ కు మధ్య గొడవ
బిగ్ బాస్ చివరిదశకు వచ్చేసింది మరోకొద్దీ రోజుల్లో సీజన్ 4 పూర్తవనుంది. అయితే ఈ చివరి రోజులు అరియనకు పెద్దగా కలిసి రావడం లేదు అనిపిస్తుంది.
బిగ్ బాస్ చివరిదశకు వచ్చేసింది మరోకొద్దీ రోజుల్లో సీజన్ 4 పూర్తవనుంది. అయితే ఈ చివరి రోజులు అరియనకు పెద్దగా కలిసి రావడం లేదు అనిపిస్తుంది. ఈ బోల్డ్ బ్యూటీ ఇప్పటివరకు గేమ్ బాగానే ఆడుతూ వస్తుంది కానీ ఈ వారంలో మాత్రం అందరితో లొల్లిపెట్టుకుంటూనే ఉంది. మోనాల్ కు అరియనకు మధ్య గొడవ జరిగింది. ఎప్పుడు చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటూ కలిసి పోయే సోహెల్ తో కూడా అరియానకు పెద్ద లొల్లే అయ్యింది. ఇక అఖిల్ సోహెల్ కు సపోర్ట్ చేస్తూ అరియనకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. హౌస్ లో అరియనా ప్రస్తుతం క్లోజ్ గా ఉంటుంది హారికా, అభిజిత్ తోనే
అయితే ఇప్పుడు అభిజిత్ తో కూడా ఈ అమ్మడు గొడవపెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. మరో తొమ్మిది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ అయిపోతూంది. ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు హౌస్ మేట్స్ కు ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందుకోసం రకరకాల టాస్క్ లు ఇస్తున్నారు. ఇందులో భాగంగా డాన్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. మ్యూజిక్ ప్లే చేస్తున్నంతసేపు ఇంటి సభ్యులంతా స్టేజ్ మీద డాన్స్ చేయాలి. అయితే మ్యూజిక్ ఆపినప్పుడు మాత్రం స్టేజ్ మీద నుంచి ఒకరు దిగిపోవాలని చెప్పాడు బిగ్ బాస్ . ఈ టాస్క్ లో ముందుగా హారిక, మోనాల్ దిగిపోయారని తెలుస్తుంది. మరో సారి మ్యూజిక్ ఆగిపోతే ఎవరో ఒకరు దిగాలని సూచించారు. మిగిలిన ముగ్గురిలో స్టేజ్ దిగేందుకు ఎవ్వరూ ఇష్టపడలేదు. దాంతో అరియనా నాకు పటిస్పెట్ చేయాలనీ ఉంది. నేను దిగాను అని చెప్పింది. దానికి అభిజిత్ ఎవరో ఒకరు దిగాలికదా అన్నాడు . దానికి అరియనా నేను సోహెల్ రెండు సార్లు దిగాం అని సంధానం ఇచ్చింది. దానికి హారిక అయితే మీ ఇద్దరు మాట్లాడుకొని డిసైడ్ అవ్వండి అంటూ సలహా ఇచ్ఛే ప్రయత్నం చేసింది. దాంతో సోహెల్ మధ్యలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటూ సీరియస్ అయ్యాడు. దాంతో అరియనా నా ఒపీనియన్ నేను చెప్పను అంది దాంతో అభిజిత్ ఇట్స్ ఓకే.. డన్ లెట్స్ గో అంటూ స్టేజీ దిగి వెళ్లిపోయాడు. దాంతో ఈసారి అభిజిత్ కు అరియనకు మధ్య దూరం పెరిగిందని అర్ధమవుతుందో. మరి ఇది రచ్చగా మారిందా లేక ఇద్దరు మళ్ళీ కలిసిపోయారా అన్నది చూడాలి.