AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4 : అనూహ్యంగా ఎలిమినేట్ అయిన అవినాష్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన నాగార్జున

నాగార్జున హోస్టుగా జరుగుతున్న బిగ్ బాస్4 మొదట్లో చప్పగా సాగిన చివరకు వచ్చేసరికి రసవత్తరంగా మారింది. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు ఇంటిసభ్యులు ఉన్నారు.

Bigg Boss 4 : అనూహ్యంగా ఎలిమినేట్ అయిన అవినాష్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన నాగార్జున
Rajeev Rayala
|

Updated on: Dec 11, 2020 | 4:05 PM

Share

నాగార్జున హోస్టుగా జరుగుతున్న బిగ్ బాస్4 మొదట్లో చప్పగా సాగిన చివరకు వచ్చేసరికి రసవత్తరంగా మారింది. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు ఇంటిసభ్యులు ఉన్నారు. ఈ ఆరుగురిలో ఎవరు విజేత అవుతారని ఆంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హౌస్ లోకి వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చి అందరిని తన కామెడీతో ఆకట్టుకున్నాడు ముక్కు అవినాష్. తనదైన మార్క్ కామెడీతో హౌస్ లో నవ్వులు పూయించిన అవినాష్ గేమ్ కూడా బాగా ఆడాడు. ముఖ్యంగా టాస్క్ లు సమయంలో అవినాష్ చాలా కష్టపడ్డాడు. కానీ చివరకు వచ్చేసరికి సింపథీ గేమ్ ఆడి అనూహ్యంగా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు.

టాస్కుల్లో బాగా ఆడిన అవినాష్ నామినేషన్ వస్తే మాత్రం తట్టుకునేవాడు కాదు. నామినేషన్ లో ఉన్నాడని తెలిస్తే ఎలిమినేట్ అవ్వకుండా బయట పడేందుకు రకరకాల ప్రయత్నాలు చేసేవాడు. ప్రతిసారి సింపథీ గేమ్ ఆడుతూ ప్రేక్షకులకు విసుగు తెప్పించేవాడు. గతవారం ఊహించని విధంగా అవినాష్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. మోనాల్ అవినాష్ ను కాలితో తన్నడం అది పెద్ద రచ్చ అవ్వడం మనకు తెలిసిందే. ఈ సీన్ తర్వాత అవినాష్ కు సింపథీ వర్కౌట్ అయ్యి ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటాడేమో అనుకుంటే అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. బిగ్ బాస్ నుంచి వెళ్లిపోయేటప్పుడు కూడా స్టేజ్ పై నవ్వులు పూయించాడు అవినాష్. బయటకు వచ్చిన తర్వాత వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో  బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అవినాష్ కు ఓ స్పెషల్ గిఫ్ట్ పంపించాడు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఒక సందర్భంలో నాగార్జున వేసుకున్న షర్ట్ బాగుందని అవినాష్ అన్నాడు. దాంతో అదిగుర్తుపెట్టుకొని మరీ నాగార్జున ఆ షర్ట్ ను అవినాష్ ఇంటికి పంపించాడు. నాగ్ పంపిన స్పెషల్ గిఫ్ట్ తో అవినాష్ పట్టలేని ఆనందంలో తేలిపోతున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాద్వారా తెలిపాడు.  అంతేకాకుండా ఆషర్ట్ వేసుకొని దిగిన ఫోటోను కూడా షేర్ చేసాడు అవినాష్.

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!