ఆరు మూడయ్యింది.. ఈ ముగ్గురిలో ఆ ఒక్కరెవరు.?
‘బిగ్ బాస్’ షో రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా దూసుకుపోతోంది. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈ రియాలిటీ షో హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో విజయవంతంగా ఐదు వారాలు పూర్తి చేసుకోగా.. ఆరోవారం చివరి దశకు చేరుకుంది. ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఐదు వారాలకు గానూ ఐదుగురు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటికి వచ్చారు. నటి హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి, రోహిణి, అషు రెడ్డిలు ఎలిమినేట్ కాగా.. ఆరోవారం ఎలిమినేషన్స్‌లో రాహుల్, హిమజ, పునర్నవి, మహేష్ […]
‘బిగ్ బాస్’ షో రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా దూసుకుపోతోంది. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈ రియాలిటీ షో హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో విజయవంతంగా ఐదు వారాలు పూర్తి చేసుకోగా.. ఆరోవారం చివరి దశకు చేరుకుంది. ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఐదు వారాలకు గానూ ఐదుగురు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటికి వచ్చారు.
నటి హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి, రోహిణి, అషు రెడ్డిలు ఎలిమినేట్ కాగా.. ఆరోవారం ఎలిమినేషన్స్‌లో రాహుల్, హిమజ, పునర్నవి, మహేష్ విట్టా, వరుణ్ సందేశ్, రవికృష్ణ నామినేట్ కావడం జరిగింది. అయితే బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌ను వరుణ్, రవికృష్ణ, రాహుల్ సిప్లిగంజ్‌లు విజయవంతంగా పూర్తి చేయడంతో వారికి ఇమ్యూనిటీ ఇచ్చి.. ఎలిమినేషన్ నుంచి తప్పించాడు బిగ్ బాస్. ఇక మిగిలినది పునర్నవి, హిమజ, మహేష్ విట్టాలు కావడంతో ఈ వారం ఎలిమిలేషన్ ఎవరవుతారనే దానిపై ఆసక్తి నెలకొంది.