బిగ్ బాస్ ‘ఫిట్టింగ్’.. వరుణ్, వితికలు ‘ఫైటింగ్’

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్టెంట్ల మధ్య ఆట రోజుకో ట్విస్ట్‌తో ప్రేక్షకులకు కనువిందును ఇస్తోంది. రోజులు గడిచే కొద్దీ ఇంటి సభ్యుల ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటపడటంతో గేమ్ మరింత రక్తి కడుతోంది. ఐదు వారాలు గడిచి.. ఆరోవారంలోకి అడుగుపెట్టిన ఈ షోలో ఎవరు ఆట బాగా ఆడుతున్నారు.? ఎవరు ఆడట్లేదనేది.. ఆడియన్స్‌కు ఓ క్లారిటీ వస్తోంది. అందుకేనేమో ప్రతివారం నామినేషన్స్ ఆసక్తిగా సాగుతున్నాయి. ఆనవాయితీ ప్రకారం సోమవారం ఎలిమినేషన్స్‌కు నామినేషన్ జరగ్గా.. ఆరుగురు సభ్యులు […]

బిగ్ బాస్ 'ఫిట్టింగ్'.. వరుణ్, వితికలు 'ఫైటింగ్'
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 28, 2019 | 6:04 AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్టెంట్ల మధ్య ఆట రోజుకో ట్విస్ట్‌తో ప్రేక్షకులకు కనువిందును ఇస్తోంది. రోజులు గడిచే కొద్దీ ఇంటి సభ్యుల ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటపడటంతో గేమ్ మరింత రక్తి కడుతోంది. ఐదు వారాలు గడిచి.. ఆరోవారంలోకి అడుగుపెట్టిన ఈ షోలో ఎవరు ఆట బాగా ఆడుతున్నారు.? ఎవరు ఆడట్లేదనేది.. ఆడియన్స్‌కు ఓ క్లారిటీ వస్తోంది. అందుకేనేమో ప్రతివారం నామినేషన్స్ ఆసక్తిగా సాగుతున్నాయి. ఆనవాయితీ ప్రకారం సోమవారం ఎలిమినేషన్స్‌కు నామినేషన్ జరగ్గా.. ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. రాహుల్ సిప్లిగంజ్, హిమజ, పునర్నవి, రవికృష్ణ, మహేష్ విట్టా, వరుణ్ సందేశ్‌లు ఉన్నారు.

ఇది ఇలా ఉండగా లేటెస్ట్‌గా స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమోపై నెటిజన్లలో విపరీతంగా చర్చ జరుగుతోంది. ప్రోమో ప్రకారం హౌస్‌లోని ఏకైక భార్యాభర్తలు వరుణ్ సందేశ్, వితిక షేరు మధ్య ఏదో గొడవ జరిగినట్లు అనిపిస్తోంది. వితిక బిహేవియర్‌.. వరుణ్‌కు నచ్చలేదని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రోమో ఎండ్‌లో వితికపై కోపంతో కాఫీ‌ని కూడా డోర్ మీదకు వెదజల్లుతాడు. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పచ్చని సంసారంలో నిప్పులు పోసాడంటూ బిగ్ బాస్‌ను ఓ పక్క నుంచి తిడుతుంటే.. ఇదేదో సీక్రెట్ టాస్క్ అయి ఉంటుందని మరొకొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండింట్లో ఏమై ఉంటుందో తెలియాలంటే కొద్దిగంటలు వేచి చూడాలి.