AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకు అసలు టైటిల్ గెలిచే అర్హతే లేదు: మహేష్ విట్టా

ఆది నుంచి వివాదాలతో మొదలైన బిగ్‌బాస్3 హౌస్‌లో.. ఇప్పటికీ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. శనివారం జరిగిన ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ 3 హోస్ట్ నాగార్జున సాక్షిగా.. వివాదం రాజుకుంది. నాగార్జున ఎదురుగానే.. శ్రీముఖి-మహేష్‌ల మధ్య వివాదం తారా స్థాయికి వెళ్లింది. బిగ్‌బాస్ 3 ప్రైజ్ మనీ రూ.50 లక్షలు వస్తే ఏం చేస్తారు..? ఎవరు మనీకి అర్హులు.. కాదో చెప్పాలని.. నాగార్జున 8 మంది ఇంటి సభ్యులకు చెప్పారు. దీంతో.. ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెప్పుకొచ్చారు. ప్రైజ్‌ […]

నాకు అసలు టైటిల్ గెలిచే అర్హతే లేదు: మహేష్ విట్టా
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 13, 2019 | 3:46 PM

Share

ఆది నుంచి వివాదాలతో మొదలైన బిగ్‌బాస్3 హౌస్‌లో.. ఇప్పటికీ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. శనివారం జరిగిన ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ 3 హోస్ట్ నాగార్జున సాక్షిగా.. వివాదం రాజుకుంది. నాగార్జున ఎదురుగానే.. శ్రీముఖి-మహేష్‌ల మధ్య వివాదం తారా స్థాయికి వెళ్లింది.

బిగ్‌బాస్ 3 ప్రైజ్ మనీ రూ.50 లక్షలు వస్తే ఏం చేస్తారు..? ఎవరు మనీకి అర్హులు.. కాదో చెప్పాలని.. నాగార్జున 8 మంది ఇంటి సభ్యులకు చెప్పారు. దీంతో.. ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెప్పుకొచ్చారు. ప్రైజ్‌ మనీతో కొందరు ఇల్లు కట్టుకుంటామని చెబితే.. మరికొందరు బిజినెస్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకూ బాగానే వున్నా.. ఆ తరువాత ప్రశ్నకు అసలు రచ్చ మొదలైంది.

ప్రైజ్ మని గెలుచుకునే అర్హత బాబా మాస్టర్‌కు లేదని వితికా-వరుణ్‌లు చెప్పగా.. వరుణ్ రిచ్ కాబట్టి వారికి ప్రైజ్ మనీ అవసరం లేదని.. రాహుల్, బాబా మాస్టర్ చెప్పారు. అటు అలీ, శివజ్యోతి, శ్రీముఖిలు మహేష్‌కి ప్రైజ్‌ మనీ తీసుకునే అర్హత లేదని చెప్పారు. దీంతో.. సీరియస్‌ అయిన మహేష్.. శ్రీముఖి ప్రతీదీ గేమ్‌లానే ఆడుతుందని, ఆమె ఆట తనకు నచ్చదని చెప్పేశాడు. దీంతో.. పాత విషయాలన్నీ తీసుకురావడంతో.. ఇద్దరి మధ్యా గొడవ చోటుచేసుకుంది. ఈ సందర్భంలో.. మహేష్.. నాకు అసలు టైటిల్ గెలిచే అర్హతే లేదని అన్నాడు. నాగార్జున ముందే.. ఇద్దరూ గొడవపడ్డారు.

అయితే.. నన్ను కావాలనే ఇంటి నుంచి పంపాలని మహేష్ అనుకుంటున్నాడని.. స్టోరీని రాయడంలో అతని తరువాతనే ఎవరైనా అని శ్రీముఖీ పైర్ అయ్యింది. నన్ను గేమ్ ఆడటానికి పంపించారని.. నేను గేమ్ మాత్రమే ఆడుతున్నానని.. నా ఆటను ఫేక్‌ అనడానికి అతనెవరని శ్రీముఖి గుస్సా అయ్యింది. కాగా.. ఈ వారం ఎలామినేషన్‌లో వరుణ్, రాహుల్, మహేష్‌లు ఉన్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేషన్ కాబోతున్నారో తెలియాలి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్