హోటల్‌లా మారిన బిగ్ బాస్ హౌస్.. కంటెస్టెంట్ల ఎమోషన్స్‌‌తో ఆటలు!

హోటల్‌లా మారిన బిగ్ బాస్ హౌస్.. కంటెస్టెంట్ల ఎమోషన్స్‌‌తో ఆటలు!

బిగ్ బాస్‌లో 13వ వారం ఎలిమినేషన్స్ ప్రక్రియ యుద్ధం మాదిరిగా జరిగిందని చెప్పవచ్చు. ఇందులో యాంకర్ శివజ్యోతి తప్పు లేకపోయినా.. ఆమె చేసిన పని వల్ల ఇంటి సభ్యులు అందరూ కూడా నామినేషన్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. అంటే ఒక్కసారిగా కంటెస్టెంట్లు గ్రూపులుగా విడిపోయి ఈ మ్యాటర్ గురించి చర్చలు జరిపారు. తాను తప్పేమి అనలేదంటూ శివజ్యోతి కన్నీరు పెట్టుకోగా.. తనకు వార్నింగ్ ఇచ్చిందంటూ వరుణ్ ఆమెపై మండిపడ్డాడు. అటు రాహుల్.. శివజ్యోతి, అలీతో కలిసిపోయి వితిక-వరుణ్‌ల […]

Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Oct 16, 2019 | 3:54 PM

బిగ్ బాస్‌లో 13వ వారం ఎలిమినేషన్స్ ప్రక్రియ యుద్ధం మాదిరిగా జరిగిందని చెప్పవచ్చు. ఇందులో యాంకర్ శివజ్యోతి తప్పు లేకపోయినా.. ఆమె చేసిన పని వల్ల ఇంటి సభ్యులు అందరూ కూడా నామినేషన్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. అంటే ఒక్కసారిగా కంటెస్టెంట్లు గ్రూపులుగా విడిపోయి ఈ మ్యాటర్ గురించి చర్చలు జరిపారు. తాను తప్పేమి అనలేదంటూ శివజ్యోతి కన్నీరు పెట్టుకోగా.. తనకు వార్నింగ్ ఇచ్చిందంటూ వరుణ్ ఆమెపై మండిపడ్డాడు. అటు రాహుల్.. శివజ్యోతి, అలీతో కలిసిపోయి వితిక-వరుణ్‌ల మనస్తత్వాల గురించి వివరించగా.. బాబా భాస్కర్ దగ్గర భార్యాభర్తలిద్దరూ శివజ్యోతి అన్న మాటలు చెప్పుకొని వాళ్ళ బాధను వివరించారు.

ఇదంతా ఒక ఎత్తయితే.. రాహుల్-శ్రీముఖిల గొడవ మరో ఎత్తు.  ఎవరు ఎందులో గొప్పా అనే విషయం చర్చించుకోవాలని బిగ్ బాస్ సూచించగా… ఇద్దరూ కూడా ఒకరంటే.. ఒకరంటూ పాజిటివ్‌లు గురించి మాట్లాడుకోవడం అటుంచి.. తిట్టుకుంటూ గొడవకు దిగారు. రాహుల్ ఒక అడుగు ముందుకేసి శ్రీముఖిని ‘గయ్యాల గంపా’ అంటూ పెద్ద గొంతెసుకొని పడిపోతావు అని అన్నాడు. దీనితో ఆ గొడవ కాస్తా తారాస్థాయికి చేరింది. అయితే నామినేషన్ ప్రక్రియ అనంతరం రాహుల్ శ్రీముఖితో మాట్లాడడానికి వస్తే.. నువ్వు లైఫ్‌లో నాతో ఎప్పుడూ మాట్లాడకు.. నేను నీతో మాట్లాడను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వగా.. నాకు కూడా నీతో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు అని రాహుల్ సింపుల్‌గా మ్యాటర్ క్లోజ్ చేశాడు. ఇలా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ఉండగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు హోటల్ టాస్క్ ఇచ్చాడు.

మునపటి సీజన్ మాదిరిగానే కంటెస్టెంట్లు తమ కుటుంబ సభ్యులను కలిసే విధంగా బిగ్ బాస్ ఈ టాస్క్‌ను రూపొందించాడు. ఫ్రీజ్, స్లీప్, మూవ్, ఫార్వర్డ్ ఇలా బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇంటి సభ్యులు నడుచుకోవాలి. ఈ టాస్క్‌లో వ‌రుణ్ సందేశ్ హోట‌ల్ మేనేజ‌ర్‌గా ఉండ‌గా, షెఫ్‌లుగా బాబా భాస్క‌ర్, శ్రీముఖి, వితికాలు ఉన్నారు. ఇక హౌజ్ కీపింగ్ బాధ్య‌త‌ల‌ని శివ‌జ్యోతి,అలీ, రాహుల్ నిర్వ‌రిస్తారు. ఒక‌ప్పుడు టాప్ స్టార్ రేటింగ్ లో ఉన్న ఈ హోట‌ల్ కాల‌క్రేమ‌ణా కింది స్థాయికి ప‌డిపోయింది. ఆ హోట‌ల్‌కి పూర్వ వైభ‌వం తీసుకొస్తే ఇంట్లోకి గెస్ట్‌లు వ‌స్తార‌ని బిగ్ బాస్ స్ప‌ష్టం చేశాడు.

టాస్క్‌లో భాగంగా అందరూ డ్రిల్ చేస్తుండగా.. ఒక్కొక్కరి కుటుంబ సభ్యులూ హౌస్‌లో అడుగుపెట్టారు. మొదటగా వితిక చెల్లి రితిక ఇంట్లోకి ప్రవేశించింది. డ్రిల్ కొనసాగిస్తున్న కంటెస్టెంట్లను బిగ్ బాస్ రిలీజ్ చేయడంతో అందరూ కూడా రితికతో సరదాగా గడిపారు. ఇక వెళ్లేముందు రితిక హోటల్‌కు వన్ స్టార్ రేటింగ్ ఇచ్చింది. చివర్లో అలీ రెజా భార్య మసుమ హౌస్‌లోకి అడుగు పెట్టగా.. వచ్చీ రాగానే శివజ్యోతికి ముద్దుపెట్టి.. భర్త అలీని ఒళ్ళో పాడుకోపెట్టుని కన్నీటి పర్యంతమైంది. మరోవైపు ఇవాళ్టి ఎపిసోడ్‌లో శివజ్యోతి భర్త గంగూలీతో పాటు మిగతా హౌస్‌మేట్స్ సభ్యులు కూడా బిగ్ బాస్ హోటల్‌లోకి అడుగుపెట్టనున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu