ఫస్ట్ ఎలిమినేషన్: డేంజర్ జోన్‌లో ఉన్నది వాళ్ళేనా..?
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ‘బిగ్ బాస్’ సీజన్ 3 మొదలై వారం రోజులు అవుతోంది. కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే.. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటూ.. వాగ్వాదాలు, గొడవలకు దిగుతున్నారు. అలాగే ‘బిగ్ బాస్’ ఇచ్చే టాస్క్‌లు కూడా ఇంటి సభ్యులు గొడవ పడేలానే ఉన్నాయి. ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో పునర్నవి, రాహుల్, హేమ, వితిక, జాఫర్, హిమజలు ఉన్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా మొదటి వారం ఎలిమినేషన్ […]
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ‘బిగ్ బాస్’ సీజన్ 3 మొదలై వారం రోజులు అవుతోంది. కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే.. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటూ.. వాగ్వాదాలు, గొడవలకు దిగుతున్నారు. అలాగే ‘బిగ్ బాస్’ ఇచ్చే టాస్క్‌లు కూడా ఇంటి సభ్యులు గొడవ పడేలానే ఉన్నాయి. ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో పునర్నవి, రాహుల్, హేమ, వితిక, జాఫర్, హిమజలు ఉన్న సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉండగా మొదటి వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఎవరు హౌస్ నుంచి విడిచి వెళ్లనున్నారో ఆదివారం తేలనుంది. అటు సోషల్ మీడియాలో పలు అనధికారిక సైట్లలో ఓట్ల శాతం గమనిస్తే.. మొదట మూడు రోజుల్లో జాఫర్ చివరిలో ఉండగా.. అనూహ్యంగా చివరి రెండు రోజుల్లో హేమ తక్కువ ఓట్ల శాతంతో ఉండడం గమనార్హం.
మరోవైపు ‘బిగ్ బాస్’ హేమాను మోనిటర్ చేసిన దగ్గర నుంచి.. ఆమె ప్రవర్తన పట్ల కొంతమంది ఇంటి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా హేమకు, రాహుల్‌కు మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. దీని బట్టి చూస్తుంటే.. ఈ వారం హేమ, జాఫర్ డేంజర్ జోన్‌లో ఉన్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనా మొదటి వారం ఎండింగ్ ఊహాతీతంగా ఉండడం మాత్రం ఖాయం. అందరి దృష్టి కూడా ఆదివారం హోస్ట్ నాగార్జున చేసే ప్రకటనపైనే ఉంది.