AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్: టైటిల్ రేసులో ఉన్నది ‘ఆ ఒక్కడే’..

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ విజయవంతంగా 90 రోజులు పూర్తి చేసుకుంది. ‘బిగ్ బాస్ హోటల్ టాస్క్‌’ను కంటెస్టెంట్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడంతో ఒక్కో కంటెస్టెంట్‌కి 200 చెప్పున ఏడుగురుకి 14 వందల పాయింట్స్ ఇచ్చారు బిగ్ బాస్. కానీ డ్రిల్స్  విషయంలో నియమాలను పాటించని కారణంగా లగ్జరీ బడ్జెట్‌లో కోత విధించాడు బిగ్ బాస్. ఇదిలా ఉంటే షో చివరి దశకు చేరుకునే సరికి ఫైనల్ విజేతగా ఎవరు నిలుస్తారనే దానిపై ప్రేక్షకుల్లో […]

బిగ్ బాస్: టైటిల్ రేసులో ఉన్నది 'ఆ ఒక్కడే'..
Ravi Kiran
|

Updated on: Oct 19, 2019 | 5:18 PM

Share

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ విజయవంతంగా 90 రోజులు పూర్తి చేసుకుంది. ‘బిగ్ బాస్ హోటల్ టాస్క్‌’ను కంటెస్టెంట్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడంతో ఒక్కో కంటెస్టెంట్‌కి 200 చెప్పున ఏడుగురుకి 14 వందల పాయింట్స్ ఇచ్చారు బిగ్ బాస్. కానీ డ్రిల్స్  విషయంలో నియమాలను పాటించని కారణంగా లగ్జరీ బడ్జెట్‌లో కోత విధించాడు బిగ్ బాస్. ఇదిలా ఉంటే షో చివరి దశకు చేరుకునే సరికి ఫైనల్ విజేతగా ఎవరు నిలుస్తారనే దానిపై ప్రేక్షకుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, శ్రీముఖి, అలీ రెజా, రాహుల్ సిప్లిగంజ్‌లు ఫైనల్ లిస్ట్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇక వీరందరూ కూడా టాస్కుల్లో విపరీతంగా కష్టపడుతూ.. టైటిల్‌ రేస్‌‌‌‌లో ముందుకు సాగుతున్నారు. కొందరు వరుణ్ సందేశ్ విజేతగా నిలుస్తాడని అంటుంటే.. మరికొందరు శ్రీముఖి అని.. ఇంకొందరు రాహుల్ సిప్లిగంజ్ అని చెబుతున్నారు.

అయితే వీరందరిలో కంటే బాబా భాస్కర్‌కే గెలిచే ఛాన్స్‌లు ఎక్కువ ఉన్నాయని ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది. ‘రేలంగి మావయ్య’గా బిగ్ బాస్ హౌస్‌లో పేరు తెచ్చుకున్న బాబా మాస్టర్.. ఇప్పటివరకు ఎవరితోనూ గొడవ పడలేదు. అంతేకాక ప్రతి కంటెస్టెంట్‌తో కూడా స్నేహపూర్వకంగా మెలుగుతూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. అటు ఈ వారం భార్యను కాపాడే ప్రయత్నంలో వరుణ్ సందేశ్ తనకున్న ఇమేజ్‌ను తగ్గించుకోవడం జరిగింది. ఇది కూడా బాబా మాస్టర్‌కు ప్లస్ అయింది.

మరోవైపు బిగ్ బాస్‌ను ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది. మొదటి సీజన్‌ను ఒకసారి పరిశీలిస్తే.. షో చివరి దశకు చేరుకునే టప్పటికీ హరితేజకు ఎక్కువ మార్కులు పడ్డాయి. ఆమెకు టైటిల్ రావడం ఖాయమని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా శివబాలాజీ విజేతగా నిలిచాడు. ఇక అతడు టైటిల్ గెలవడంలో పవన్ ఫ్యాన్స్ హస్తం ఉందని వార్తలు వచ్చాయి కూడా. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది.

వరుణ్ సందేశ్ విజేతగా నిలుస్తాడని వార్తలు వస్తున్నా.. బాబా భాస్కర్ టైటిల్ గెలవడం ఫిక్స్ అని చాలామంది నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అతడు తమిళియన్ అన్న విషయం తప్పితే.. హౌస్‌లో పొరపాట్లు చేసిన దాఖలాలు లేవని వారు అంటున్నారు.

Follow Us
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..