బిగ్ బాస్: టాస్క్‌లో లొల్లి.. ఆ నటుడ్ని హౌస్ నుంచి అర్ధాంతరంగా గెంటేశారు?

హిందీ బిగ్ బాస్‌లో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. కంటెస్టెంట్లు గ్రూపులుగా విడిపోయి.. ప్రతి టాస్క్‌కు వాగ్వాదానికి దిగుతున్నారు. కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌ను ఓ యుద్దభూమి మాదిరిగా మార్చేశారు. అటు బిగ్ బాస్.. ఇటు సల్మాన్ ఖాన్ ఇద్దరూ కూడా కంటెస్టెంట్ల దురుసు ప్రవర్తన రీత్యా పలు మార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా పట్టించుకోవట్లేదు. ఇదిలా ఉండగా నటుడు సిద్ధార్థ్ శుక్లా.. కెప్టెన్సీ టాస్క్‌లో మహీరా శర్మతో దురుసుగా ప్రవర్తించడం వల్ల అతడు ఎలిమినేషన్‌కు గురయ్యే అవకాశాలు […]

బిగ్ బాస్: టాస్క్‌లో లొల్లి.. ఆ నటుడ్ని హౌస్ నుంచి అర్ధాంతరంగా గెంటేశారు?
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 06, 2019 | 8:08 PM

హిందీ బిగ్ బాస్‌లో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. కంటెస్టెంట్లు గ్రూపులుగా విడిపోయి.. ప్రతి టాస్క్‌కు వాగ్వాదానికి దిగుతున్నారు. కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌ను ఓ యుద్దభూమి మాదిరిగా మార్చేశారు. అటు బిగ్ బాస్.. ఇటు సల్మాన్ ఖాన్ ఇద్దరూ కూడా కంటెస్టెంట్ల దురుసు ప్రవర్తన రీత్యా పలు మార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా పట్టించుకోవట్లేదు.

ఇదిలా ఉండగా నటుడు సిద్ధార్థ్ శుక్లా.. కెప్టెన్సీ టాస్క్‌లో మహీరా శర్మతో దురుసుగా ప్రవర్తించడం వల్ల అతడు ఎలిమినేషన్‌కు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ తాజాగా విడుదలైన ప్రోమోలో సిద్ధార్థ్‌ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోవాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. అయితే ఇన్‌సైడ్ టాక్ ప్రకారం సిద్ధార్థ్.. ఎలిమినేషన్ కాకుండా రెండు వారాలు ఎలిమినేషన్స్‌కు సెల్ఫ్ నామినేటెడ్ అయ్యాడని తెలుస్తోంది.

అయితే సిద్ధార్థ్ ఎలిమినేషన్ న్యూస్ మాత్రం అప్పటికే జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయింది. ఫ్యాన్స్ అందరూ కూడా ట్విట్టర్ వేదికగా అతని సైడ్ నిలుస్తూ సపోర్ట్ పలికారు. #WeSupportSidShukla, #WESTANDBYYOUSIDSHUKLA and #SidharthShukla అనే హ్యాష్ టాగ్స్ ఇండియా వైడ్ ట్రెండింగ్ అయ్యాయి.