సీన్ రివర్స్.. బిగ్ బాస్‌ను శాసిస్తున్న ఆ హీరో ఆర్మీ.. టైటిల్ గెలిచేది అతడేనా?
తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ప్రేక్షకులకు బాగా గుర్తిండిపోతుంది. దానికీ రీజన్ లేకపోలేదు. సాధారణ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన కౌశల్ మందా.. అనూహ్య రీతిలో టైటిల్ విజేతగా నిలిచాడు. షో మూడో వారం ముగిసిన దగ్గర నుంచి ఆయన ఆర్మీ.. షో అంతటిని శాసించింది. ఎవరెవరు కౌశల్‌కు విరుద్ధంగా ఉన్నారో వారిని ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు. సరిగ్గా ఇదే సీన్ రీసెంట్‌గా మొదలైన హిందీ బిగ్ బాస్‌లో పునరావృతం అవుతున్నట్లు అనిపిస్తోంది. […]
తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ప్రేక్షకులకు బాగా గుర్తిండిపోతుంది. దానికీ రీజన్ లేకపోలేదు. సాధారణ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన కౌశల్ మందా.. అనూహ్య రీతిలో టైటిల్ విజేతగా నిలిచాడు. షో మూడో వారం ముగిసిన దగ్గర నుంచి ఆయన ఆర్మీ.. షో అంతటిని శాసించింది. ఎవరెవరు కౌశల్‌కు విరుద్ధంగా ఉన్నారో వారిని ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు. సరిగ్గా ఇదే సీన్ రీసెంట్‌గా మొదలైన హిందీ బిగ్ బాస్‌లో పునరావృతం అవుతున్నట్లు అనిపిస్తోంది.
సిద్ధార్థ్ శుక్లా.. బుల్లితెరలో పలు సీరియల్స్ నటించి నార్త్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించాడు. అతడు నటించిన కొన్ని సీరియల్స్ తెలుగులో కూడా డబ్ కావడం జరిగింది. ఈ సీజన్‌కు అతడే ప్రధాన ఆకర్షణ. తన మాజీ లవర్‌తో హౌస్‌లోకి వచ్చిన సిద్ధార్థ్ మొదటి నుంచి దూకుడుతనంతో బిగ్ బాస్ ఇచ్చిన ఫిజికల్ టాస్కుల్లో గెలుస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం మూడో వారం పూర్తవ్వగా.. ఇంటి నుంచి దల్జీత్ కౌర్, కొయినా మిత్రా, అబూ మాలిక్‌లు ఎలిమినేట్ అయ్యారు. ఇదంతా ఒక పక్కన పెడితే.. సిద్ధార్థ్ మాత్రం హౌస్‌లోనూ, బయట అద్భుతంగా దూసుకుపోతున్నాడు.
హౌస్‌లో అతనికి చాలామంది శత్రువులుగా మారినా.. బయట మాత్రం ఆర్మీ రూపంలో ఎంతోమంది అభిమానులు అతన్ని సేవ్ చేస్తున్నారు. సరిగ్గా తెలుగు బిగ్ బాస్ రెండో సీజన్ మాదిరిగా ఈ హిందీ బిగ్ బాస్ తయారయ్యింది. అంతేకాక సల్మాన్ ఖాన్ పలుసార్లు కంటెస్టెంట్లు చెత్త పెర్ఫార్మన్స్‌లు ఇస్తున్నారని స్టేజిపైనే కోపగించుకోవడం జరిగింది. మరోవైపు నిన్నటి ఎపిసోడ్‌లో వాళ్ళ తీరు నచ్చక షో మధ్యలోనే వదిలి వెళ్లిపోవడం కూడా జరిగింది. ఏది ఏమైనా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు కూడా సిద్ధార్థ్ శుక్లా అద్భుత పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడని.. అందువల్ల ఖచ్చితంగా టైటిల్ గెలుస్తాడని చెప్పడం గమనార్హం.