బిగ్ బాస్: అలీ రెజా రీ-ఎంట్రీ కన్ఫర్మ్?
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ప్రేక్షకులకు అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అలీ రెజా హౌస్‌లో రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. షో నిర్వాహకులు అలీ రెజా కంటే ముందు పలువురు సెలెబ్రిటీస్‌తో సంప్రదింపులు చేయగా.. ఎవరూ కూడా రావడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఈ వారం చివర్లో వైల్డ్ కార్డు ద్వారా అలీ రెజా హౌస్‌లో వస్తాడని సమాచారం. అయితే దీనిపై […]

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ప్రేక్షకులకు అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అలీ రెజా హౌస్‌లో రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. షో నిర్వాహకులు అలీ రెజా కంటే ముందు పలువురు సెలెబ్రిటీస్‌తో సంప్రదింపులు చేయగా.. ఎవరూ కూడా రావడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఈ వారం చివర్లో వైల్డ్ కార్డు ద్వారా అలీ రెజా హౌస్‌లో వస్తాడని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కిందటి సీజన్‌లో నూతన్ నాయుడు, శ్యామల మాదిరిగానే అలీ రెజా ఎంట్రీ ఉంటుందట. అలీ రెజా ఎలిమినేట్ అయిన దగ్గర నుంచి సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అతన్ని తిరిగి హౌస్‌లోకి తీసుకురావాలని కోరుతున్నారు. #BringBackAliReza అనే హ్యాష్‌ట్యాగ్ అప్పట్లో వైరల్‌గా మారింది. అంతేకాకుండా అతడి ఎగ్జిట్ అయినప్పుడు హౌస్‌మేట్స్ చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారని చెప్పవచ్చు.
ఇటీవల రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ షోకు ఎంత క్రేజ్ తెచ్చిపెట్టిందో అలాగే అలీ రెజా రీ-ఎంట్రీ కూడా షో టీఆర్పీ రేటింగ్స్‌లో ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా అలీ ఎంట్రీ.. శివజ్యోతి, శ్రీముఖిలపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. చూద్దాం మరి ఏమి జరుగుతుందో.?