Big News Big Debate: ‘దళితబంధు’.. పేదరికాన్ని రూపుమాపి.. దేశానికి దారి చూపుతుందా..?
దళిత బంధు చారిత్రక అవసరమంటున్న తెలంగాణ CM కేసీఆర్ హుజూరాబాదులో పథకాన్ని ప్రారంభించారు. ఏ ప్రభుత్వాలు.. మరే నాయకులు....
దళిత బంధు చారిత్రక అవసరమంటున్న తెలంగాణ CM కేసీఆర్ హుజూరాబాదులో పథకాన్ని ప్రారంభించారు. ఏ ప్రభుత్వాలు.. మరే నాయకులు కూడా అట్టడుగున ఉన్న నిరుపేదలను పట్టించుకోలేదని తెలంగాణ నిర్ణయం దేశానికి దిక్సూచి కావాలంటున్నారు. కానీ దళితులే కాదు.. బీసీల్లోనూ నిరుపేదలున్నారు వారికి పథకాలు ఎందుకివ్వరంటూ ప్రశ్నిస్తోంది కాషాయ పార్టీ. అటు కాంగ్రెస్ కూడా రాష్ట్రమంతా అమలుచేయాలని.. లేదంటే ఇదంతా వట్టి ఎన్నికల బంధేనని ఆరోపిస్తోంది.
హుజూరాబాద్‌లో దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్.ఇది ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా.. మహొద్యమంలా చేస్తామన్నారు CM. దళితులు అంటే దరిద్రుడు కాదని.. కోటీశ్వరుడు అని నిరూపించుకోవడమే తమ లక్ష్యమన్నారు. రాజకీయం అంటే ఇతర పార్టీలకు ఒక గేమ్ TRSకు మాత్రం ఇదొక టాస్క్..సామాజిక లక్ష్యాలను చేరుకునే మార్గం అన్నారు KCR. అలా పుట్టుకొచ్చిన పథకాలే రైతు బంధు, దళిత బంధు అన్నారు. తమ ఈ కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో అగ్గిరాజుకునేలా చేస్తుందని జోస్యం చెప్పారు CM KCR. దేశంలోని దళిత జాతి మేల్కొంటుందన్నారు.
విపక్షాల స్వరం మారిందా?
అటు పథకం అమలుపై రాజకీయంగా రచ్చ మొదలైంది. ఇప్పటికే తెలంగాణ అంతట అమలుచేయడంతో పాటు.. ఇంటికి 50 లక్షలు ఇవ్వాలంటున్నారు BJP చీఫ్ బండి సంజయ్. BC బంధు కూడా అమలు చేయాలంటున్నారు కమలనాథులు. అటు హుజూరాబాద్‌లో ఎన్నికల కోసమే పథకం మొదలు పెట్టారని.. అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాల్సిందేనంటూ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.ఎన్ని బంధులు పెట్టినా.. దళితులు కాంగ్రెస్‌కే బంధువులన్నారు హస్తం నేతలు. పూర్తిగా ఎన్నికల పథకమేనని.. దండొరాతో ఎండగడతామంటున్నారు హస్తం నేతలు. ప్రతి కుటుంబానికి 30లక్షలు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.
అధికారపార్టీ కౌంటర్…
తెలంగాణకు 50లక్షలు ఇచ్చే బడ్జెట్ లేదని.. ఉన్నంతలో దళిత కుటుంబానికి 10లక్షలు ఇస్తున్నామని కేంద్రం మరో 40లక్షలు ఇస్తే మోదీ ఫొటొలకు పాలాభిషేకం కూడా చేస్తామని కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్‌రావు. మొత్తానికి కేసీఆర్ మానసపుత్రిక… ఘనంగా ప్రారంభించారు. 20వ శతాబ్ధంలో అంబేద్కర్ దళితులకు సామాజిక న్యాయం కల్పించి వెనకబాటు నుంచి విముక్తి కల్పించే ప్రయత్నం చేస్తే.. 21వ శతాబ్ధంలో ఆర్ధికంగా దళితులను KCR సాధికారత వైపు నడిపిస్తున్నారంటూ ట్వీట్ చేశారు మంత్రి KTR. మరి నిజంగానే ఇది దళితుల ఆర్ధికాభివద్ధికి దోహదపడుతుందా.. లేక రాజకీయ చట్రంలో నలుగుతుందా.?
ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్ డిబేట్ జరిగింది… వీడియో కోసం కింద లింక్ క్లిక్ చేయండి.