Big News Big Debate: ముప్పు ముంగిట భారత్‌ ఉందా?.. ఆఫ్గన్‌లో పరిణామాలపై ఎందుకంత కలవరం?

ఆఫ్గనిస్తాన్‌లో ఊహించిదంతా జరిగింది. నాటో దళాలు వైదొలిగితే తలెత్తే పరిణామాలపై ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమైన భయాందోళనలే నిజమయ్యాయి. ఉగ్రమూలాలున్న తాలిబన్ల వశమైంది ఆ దేశం.

Big News Big Debate: ముప్పు ముంగిట భారత్‌ ఉందా?..  ఆఫ్గన్‌లో పరిణామాలపై ఎందుకంత కలవరం?
Tv9 Big News Big Debate On
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 17, 2021 | 9:05 PM

Big News Big Debate: ఆఫ్గనిస్తాన్‌లో ఊహించిదంతా జరిగింది. నాటో దళాలు వైదొలిగితే తలెత్తే పరిణామాలపై ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమైన భయాందోళనలే నిజమయ్యాయి. ఉగ్రమూలాలున్న తాలిబన్ల వశమైంది ఆ దేశం. కొత్త పాలన ఆదేశానికి పరిమితం అయితే నష్టం లేదు. కానీ ప్రపంచానికే ముప్పుగా మారుతుందనే భయాందోళనలున్నాయి. మరీ ముఖ్యంగా మన దేశానికి అత్యంత ప్రమాదకర ఘంటికలు మోగిస్తున్నాయి. సద్దుమణుగుతున్న సరిహద్దుల్లో మళ్లీ ఉగ్రవాదులు పంజా విసిరే ప్రమాదం ఉందంటున్నారు విదేశాంగ నిపుణులు. వాస్తవానికి మనం ఆఫ్గన్‌ పునఃనిర్మాణానికి సాయం అందించాం. వేల కోట్లు వెచ్చించి మరీ ప్రాజెక్టులు, ఆసుపత్రులు కట్టించి ఇచ్చాం. కానీ మనసే లేని తాలిబన్లకు ఇవేమీ కనిపించే ఛాన్స్‌ లేదు. పాకిస్తాన్‌కు అండగా ఉంటే మన పరిస్థితి ఏంటి.?

యావత్ ప్రపంచం అనుకున్నంత పని అయిపోయింది. తుపాకీ గొట్టానికి అప్ఘానిస్థాన్ తలొగ్గింది. దేశాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆటవిక పాలనకు కేరాఫ్‌ అయిన తాలిబన్ల చేతిలోకి ఆప్ఘాన్ దేశం వెళ్లడంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఆ దేశ పౌరులే కాదు.. ప్రపంచమంతా కూడా గజాగజా వణికిపోతోంది. అక్కడి పరిణామాలు భారత్‌కే అత్యంత ప్రమాదమన్న అభిప్రాయం బలపడుతోంది. తాలిబన్లతో అమెరికా, ఐరోపా యూనియన్ దేశాలకు తీవ్రవాద ముప్పు తప్పదు. అదే సమయంలో మన దేశ సరిహద్దుల్లో కూడా ఇంకా అత్యంత క్లిష్ట పరిస్థితులు వస్తాయమని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

ఇండియా పొలిటికల్‌ కామెంట్స్‌… తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తిస్తామని అందరికంటే ముందే ప్రకటించడం ద్వారా పాకిస్తాన్‌ తన కుట్రలకు మార్గం సుగమం చేసుకుంటోంది. బలూచిస్తాన్‌లో తాలిబన్ల సాయంతో అక్కడ ఉద్యమాన్ని అణిచివేసి తన బలగాలను కశ్మీర్‌ సరిహద్దుల్లో మోహరించి అస్థిర పరిచే కుట్రలకు పాల్పడవచ్చని అంటున్నారు. అంతేకాదు. ఒకప్పుడు అల్‌ ఖైదా, లష్కర్‌ ఏ తోయిబా వంటి తీవ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇచ్చిందే తాలిబన్లు. ఇప్పటికే ఉగ్రవాద సంస్థలు ఆఫ్గన్‌లో తమ రిక్రూట్‌మెంట్లు యధేచ్చగా సాగిస్తున్నాయని… భారత్‌పై ఎగదోసే ప్రమాదం ఉందని అంటున్నారు అసదుద్దీన్‌. గతంలో పట్టుబడిన తీవ్రవాదుల్లో తాలిబన్లు ఉన్న విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. తాలిబన్‌ వ్యతిరేక శక్తులకు అండగా ఉన్న భారత్‌ వారి లక్ష్యం మనమే అవుతామని.. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని MP సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయం.

ఎంతసాయం చేసినా…. మొత్తం 3బిలియన్‌ డాలర్ల సాయం 34 ప్రాంతాల్లో 400 ప్రాజెక్టులు 42 మెగావాట్లు విద్యుత్‌, సల్మా జలాశయం ఆఫ్గన్ రిస్టోరేషన్‌ కోసం త్రైపాక్షిక ఒప్పందాలు పార్లమెంట్‌కు 90 మిలియన్‌ డాలర్లు గిఫ్ట్‌గా 600 బస్‌లు వేలల్లో ఇండియన్‌ కాంట్రాక్లర్లు మున్సిపాలిటీలకు 105 వాహనాలు 285 ఆర్మీ వాహనాలు పేండమిక్‌లో 75వేల టన్నుల గోధుములు అగాఖాన్‌ హరిటేజ్‌ ప్రాజెక్టుకు 1మిలియన్‌ డాలర్లు అంత సాయం చేసినా ఉపయోగం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి. భారత్‌ అనుసరించే వ్యూహం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. తాలిబన్లు ఇండియా పట్ల సానుకూలంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నా… నమ్మదగినవి కాదు. గతంలో ఎన్నో అనుభవాలున్నాయి. అక్కడే తీవ్రవాద ముఠాలకు అడ్డాలున్నాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ పరిథిలో మనకు ఆఫ్గన్‌కు సరిహద్దు కూడా ఉంది. ఇది ప్రమాదసంకేతమే. ఆల్‌ఖైదా, లష్కరో తోయిబా వంటి సంస్థలను కాదని.. ఇండియాకు మద్దతు ఇస్తుందని అనుకోలేం. అలా ఇచ్చిన నమ్మే పరిస్థితి ఉండదు.

ఇప్పుడు మనముందున్న సవాళ్లు… 1. తాలిబన్ల పాలన అంటేనే ఉగ్రవాదులకు అడ్డా.. ఇది భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? 2. ఇస్లామిక్‌ టెర్రిరిజం వల్ల అత్యధికంగా నష్టపోతున్న ఇండియాకు ఇదో ప్రమాద సంకేతమా? 3. తాలిబన్‌ పాలన అంతమైన తర్వాత పునఃనిర్మాణంలో కీలకభూమిక పోషించిన భారత్‌ను తాలిబన్లు గుర్తిస్తారా? 4. అమెరికాకు అత్యంత సన్నిహిత దేశంగా.. పాకిస్తాన్‌కు శత్రుదేశంగా ఉన్న భారత్‌ పట్ల తాలిబన్లు సానుకూలంగా ఉంటారా? 5. 1990లలోనే భారత్‌ పట్ల ఉగ్రవాద దాడులను ఎగదోసిన తాలిబన్లు ఇప్పుడు కూడా పాక్‌తో కలిసి అదే విధానం అవలంభిస్తారా? 6. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కుదుటపడుతున్న కశ్మీరంలో మళ్లీ మొజాహిదిన్‌ తీవ్రవాదం రెచ్చిపోయే ఛాన్స్‌ ఉందా? 7. చైనా, బంగ్లా సరిహద్దుల్లో కూడా ప్రమాదఘంటికలు మోగుతున్నట్టేనా? 8. బలూచిస్తాన్‌ ఉద్యమంపై తాలిబన్ల సాయం తీసుకుని.. అక్కడి బలగాలను కశ్మీర్‌ సరిహద్దుల్లో మోహరించి కవ్వింపులకు పాక్‌ పాల్పడుతుంది? 9. ఇటీవల తాలిబన్‌ ప్రభుత్వాన్ని గుర్తించబోమన్న దోహా 9 పాయింట్‌ ఫార్ములాపై భారత్‌ సంతకం ఎలాంటి ప్రభావం చూపుతుంది? 10. తాలిబన్‌ ప్రభుత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా దేశాలన్న గుర్తించక తప్పని పరిస్థితి ఉందా? 11. 2000లో యుద్ధాలు చేసినట్టు ఇప్పుడు కూడా తాలిబన్ల అంతం పేరుతో అమెరికా సహా అగ్రదేశాలు యుద్ధానికి సిద్దపడతాయా?

20 ఏళ్లుగా అమెరికా సహా పలు దేశాలకు చెందిన సైనికులు అక్కడి ఆర్మీకి శిక్షణ ఇచ్చినా కూడా తాలిబన్లను నియంత్రించలేకపోయారు. చివరకు దేశాన్ని ఉగ్రవాదుల చేతుల్లో పెట్టారు. ఫలితంగా ప్రపంచ దేశాలు ముప్పు ముంగిట నిలబడ్డాయి. ఈ పరిస్థితిలో భారత్‌ తీసుకునే విధానం ఎలా ఉంటుందన్నది చూడాలి.

ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్‌ డిబేట్‌ జరిగింది… పూర్తి సమాచారం  కోసం కింద వీడియో చూడండి.

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్