హుజురాబాద్ వార్.. 2023 ఎలక్షన్స్‌కు ఫౌండేషనా? టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..
Big News Big Debate: హుజూరాబాద్ ఉప ఎన్నికకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. షెడ్యూల్‌తో పాటే నాయకుల మాటల్లో తీవ్రతా పెరిగింది. అధికారపార్టీ డబ్బు..
హుజూరాబాద్ ఉప ఎన్నికకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. షెడ్యూల్‌తో పాటే నాయకుల మాటల్లో తీవ్రతా పెరిగింది. అధికారపార్టీ డబ్బు ప్రలోభాలకు తెరతీసిందని ఆరోపించారు BJP నాయకులు. ఈటల మాటలు చూస్తుంటే దొంగే… దొంగా దొంగా అరచినట్టుగా ఉందంటోంది గులాబీ పార్టీ. ఆత్మగౌరవ పోరాటమని బీజేపీ అంటే.. డెవలప్‌మెంట్ నమూనా అంటోంది TRS. అయోమయానికి కేరాఫ్ అయిన కాంగ్రెస్‌లో ఇంకా అభ్యర్ధిపైనే క్లారిటీ రాలేదు. ఇక వాళ్ల ఎజెండా ఏంటన్నది కేడర్‌లోనూ గందరగోళమే.
హుజూరాబాద్ పొలిటికల్ లీగ్‌కు సర్వం సిద్ధమవుతోంది. బైపోల్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 30 బ్యాలెట్ వార్‌కు డేట్ ఫిక్స్ అయింది. ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలనే మార్చివేస్తోంది. గత కొద్ది నెలలుగా క్షేత్రస్థాయిలో TRS, BJP పెద్ద యుద్ధమే చేస్తున్నాయి. అభ్యర్ధులను ముందే ప్రకటించిన పార్టీలు నియోజకవర్గంలో మోహరించాయి. పోటాపోటిగా సమావేశాలు సామాజిక సమీకరణాలపై ఫోకస్ పెట్టాయి. అయితే కాంగ్రెస్ మాత్రం ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. అభ్యర్ధినీ ప్రకటించలేదు.
ఈటల రాజేందర్ ఇప్పటికే పాదయాత్ర చేయగా.. సీనియర్లకు బాధ్యతలు అప్పగించారు. అటు వలసలతో ఇతర పార్టీ నేతలకు గాలం వేసిన అధికార పార్టీ ముగ్గురు మంత్రులను రంగంలోకి దింపింది. MLAలకు బాధ్యతలను అప్పగించింది. ప్రతి ఓటరును కలిసి ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని అమలు చేస్తున్న పథకాలను వివరిస్తున్నారు అధికార పార్టీ నేతలు. అధికార పార్టీ ఓటర్లను భయపెడుతుందని.. బెదిరించి గ్రామస్థాయి కుటుంబాలకు కండువాలు కప్పుతున్నారని ఆరోపించారు ఈటల రాజేందర్. దావత్‌ల పేరుతో గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోందని కోట్లాది రూపాయిలు వెదజల్లుతున్నారని ఆరోపించారు BJP నేతలు. అయినా నియోజకవర్గ ప్రజలు ఆత్మగౌరవంతో తన వెంటే ఉంటారంటున్నారు ఈటల.
నమ్మకానికి TRS సింబల్ అయితే… అమ్మకానికి BJP బ్రాండ్ అంటున్నాయి గులాబీ దళాలు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని, అమలు చేస్తున్న పథకాలను చూసి ఓటేయడానికి జనాలు రెడీగా ఉన్నారని.. అభ్యర్ధి మాకు మరో అదనపు బలమంటున్నారు అధికార పార్టీ MLAలు. అటు బీజేపీ.. ఇటు టీఆర్ఎస్ పోటీపోటీగా ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తుంటే.. కాంగ్రెస్ జాడ ఎక్కడా కనిపించడం లేదు. ఇంతవరకూ అభ్యర్ధినే ప్రకటించలేదు. 14 మంది పోటీకి సిద్ధంగా ఉన్నారంటున్న పీసీసీ ప్రచారంలోనూ కాస్త స్లోగానే ఉంది. హుజూరాబాద్ ఎన్నిక అన్ని పార్టీల ఇజ్జత్‌కీ సవాల్‌గా మారాయి. మరి బైపోల్‌లో ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందా. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఫౌండేషనుగా భావిస్తాయా.?
(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)