SIM Card New Rule: షాకింగ్‌ న్యూస్‌.. ఈ వ్యక్తులు 3 సంవత్సరాల పాటు సిమ్ కార్డ్ పొందలేరు.. !

SIM Card New Rule: ప్రస్తుతం సిమ్‌ కార్డు రూల్స్‌ మారిపోయాయి. కొత్త నిబంధనలు అందుబాటులోకి వస్తున్నాయి. సిమ్‌ కార్డు తీసుకున్న వారు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పొరపాట్ల కారణంగా కేసులతో పాటు మూడేళ్ల వరకు సిమ్‌ కార్డు పొందలేరు. మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కీలక చర్యలు చేపడుతోంది..

SIM Card New Rule: షాకింగ్‌ న్యూస్‌.. ఈ వ్యక్తులు 3 సంవత్సరాల పాటు సిమ్ కార్డ్ పొందలేరు.. !
Follow us
Subhash Goud

|

Updated on: Dec 29, 2024 | 2:22 PM

దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాల మధ్య ప్రభుత్వం కీలక అడుగు వేయబోతోంది. ఇతరుల పేరుతో సిమ్ కార్డులు కొనుగోలు చేసినా, మోసపూరిత సందేశాలు పంపిన వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సైబర్ సెక్యూరిటీకి ముప్పు వాటిల్లేలా బ్లాక్ లిస్టులో పెట్టనున్నారు. అంతే కాదు, అలాంటి వ్యక్తులు కొత్త కనెక్షన్ తీసుకోకుండా 3 సంవత్సరాల పాటు నిషేధించబడ. సైబర్ నేరాలను అరికట్టడంలో ఇదొక పెద్ద ముందడుగు అనే చెప్పాలి.

చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం:

సిఎన్‌బిసి-ఆవాజ్ నివేదిక ప్రకారం.. ప్రభుత్వ టెలికాం విభాగం బ్లాక్‌లిస్ట్ చేయడం ప్రారంభించింది. ఇతరుల పేరుతో సిమ్ కార్డులను కొనుగోలు చేసిన లేదా మోసపూరిత సందేశాలు పంపే వ్యక్తుల పేర్లు ఈ జాబితాలో ఉంటాయి. ఈ బ్లాక్ లిస్ట్‌లో పేర్లు ఉన్న వారి ప్రస్తుత సిమ్ కార్డ్‌లు బ్లాక్ చేయబడతాయి. వారు 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు కొత్త సిమ్ కార్డ్‌ని కొనుగోలు చేయలేరు.

బ్లాక్‌లిస్ట్‌లో పేరు పెట్టే ముందు సంబంధిత వ్యక్తికి ప్రభుత్వం నోటీసు జారీ చేసి స్పందన కోరుతుంది. వారు స్పందించడానికి 7 రోజుల సమయం ఉంటుంది. అదే సమయంలో విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఏ వ్యక్తినైనా బ్లాక్ లిస్ట్‌లో చేర్చవచ్చు.

సైబర్ నేరాల నియంత్రణకు నిరంతరం చర్యలు

సైబర్ నేరాల నియంత్రణకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. కొన్ని రోజుల క్రితం, సైబర్ నేరాలను అరికట్టేందుకు అవగాహన కల్పించేందుకు కాలర్-ట్యూన్‌లను అమలు చేయాలని టెలికాం కంపెనీలకు ఆదేశాలు అందాయి. ఈ ప్రచారం 3 నెలల పాటు కొనసాగుతుంది. ఇది కాకుండా సైబర్ నేరాలను నియంత్రించే ప్రయత్నంలో నవంబర్ 15, 2024 వరకు 6.69 లక్షల సిమ్ కార్డులు, 1,32,000 IMEI నంబర్‌లను ‘బ్లాక్’ చేసినట్లు ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది.

ఇది కూడా చదవండి: iPhone: ఐఫోన్ 16పై బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.38 వేల వరకు తగ్గింపు!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..