ఈ టాలీవుడ్ హీరోయిన్ నిజంగానే ‘లక్కీ’.. వరుస ఫ్లాపులొచ్చినా తగ్గని ఆఫర్లు
29 December 2024
Basha Shek
సాధారణంగా హీరో హీరోయిన్లకు వరుసగా ఫ్లాప్స్ వస్తే సినిమా ఆఫర్స్ తగ్గిపోతాయి. అయితే స్టార్ హీరోలకు కాస్త మినహాయింపు ఉంటుంది.
హీరోయిన్ల పరిస్థితి మాత్రం చాలా వేరుగా ఉంటుంది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ రెండు, మూడు ఫ్లాప్ వస్తే పక్కన పెట్టేస్తుంటారు.
కానీ మీనాక్షి చౌదరికి మాత్రం వరుస ఫ్లాపులు వచ్చినా జెట్ స్పీడ్ లో దూసుకెళుతోంది. వరుసగా అవకాశాలు అందుకుంటోంది.
ఈ ఏడాది ఏకంగా ఆరు చిత్రాల్లో నటించింది మీనాక్షి. అయితే వాటిల్లో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మాత్రమే సూపర్ హిట్ గా నిలిచింది.
ఆ తర్వాత వచ్చిన వరుణ్ తేజ్ తో కలిసి నటించిన మట్కా, విశ్వక్ సేన్ వమెకానిక్ రాకీ చిత్రాలు ఆడియెన్స్ ను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి.
కానీ ఈ లక్కీ హీరోయిన్ కు మాత్రం అవకాశాలు తగ్గడం లేదు. నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ చిత్రంలో మీనాక్షి హీరోయిన్‌గా ఎంపికైంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నిర్మిస్తున్నఈ క్రేజీ సినిమాలో మొదట హీరోయిన్ గా డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీలను అనుకున్నారట.
అయితే ఇప్పుడు ఆ హీరోయిన్ ప్లేస్ మీనాక్షి చౌదరికి దక్కింది. దీంతో పాటు మరో రెండు, మూడు సినిమాల్లోనూ నటిస్తోందీ ఈ లక్కీ హీరోయిన్.
ఇక్కడ క్లిక్ చేయండి..