Big News Big Debate: ఏపీలో జరిగింది ఎలక్షనా.. సెలక్షనా.. ఫలితాలపై పార్టీల మధ్య మాటల యుద్ధం..
Big News Big Debate: పరిషత్ ఎన్నికల ఫలితాలపై పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎలక్షన్ కాదు ఇది సెలక్షన్ అని విపక్ష TDP ఆరోపిస్తే.. నామినేషన్లు వేసిన తర్వాత ఓటమి భయంతో పలాయనం చిత్తగించిన నాయకులు అవాకులు..
పరిషత్ ఎన్నికల ఫలితాలపై పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎలక్షన్ కాదు ఇది సెలక్షన్ అని విపక్ష TDP ఆరోపిస్తే.. నామినేషన్లు వేసిన తర్వాత ఓటమి భయంతో పలాయనం చిత్తగించిన నాయకులు అవాకులు మానుకోవాలంటూ కౌంటరిచ్చింది అధికార YCP. ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని BJP నాయకులు అంటే.. ఎక్కడ సీట్లు వచ్చాయో చెబుతారా అంటూ నిలదీస్తోంది అధికారపార్టీ. ఇంతకీ ఈ ప్రజాతీర్పు దేనికి సంకేతం. గతంలో జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టారు జనం. తాజాగా పరిషత్ ఫైట్‌లోనూ అధికార పార్టీ జైత్రయాత్ర కొనసాగింది. ఏపీలో ఎలక్షన్ కాదు. సెలక్షన్ అంటోంది టీడీపీ. నామినేషన్ల కూడా వేయకుండా అడ్డుకోవడం.. ప్రచారానికి సమయం లేకుండా చేయడం ద్వారా ఎక్కడ లేని విధంగా ఎన్నికలు జరిపించి గెలిపించుకున్నారంటోంది టీడీపీ. సంక్షేమ పథకాల లబ్దిదార్లను ఓట్ల కోసం YCP నేతలు భయపెట్టారని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి. అందుకే పరిషత్ ఎన్నికలను TDP బాయ్ కాట్ చేసిందని.. రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు వెంటనే నిర్వహిస్తే తమ బలమేంటో చూపిస్తామని సవాల్ చేశారు గోరంట్ల. అధికారపార్టీకి ధీటుగా బరిలో నిలిచామన్నారు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారనడానికి ఈఎన్నికల ఫలితాలే నిదర్శనమని ట్వీట్ చేశారు. అంపశయ్యపై ఉన్న TDP పోటీ చేయకుండానే చేతులెత్తేస్తే అధికార వైసీపీని BJP తట్టుకుని బరిలో నిలిచి జనాలకు భరోసా ఇచ్చిందన్నారు సోము వీర్రాజు.
వందశాతం జిల్లా పరిషత్‌లు కైవసం చేసుకోవడమంటే జగన్ సంక్షేమ పాలనకు జనం పట్టం కట్టడమే అంటోంది YCP. సొంత నియోజకవరంగంలో కూడా చంద్రబాబును ఓడించి విపక్షమే లేకుండా చేశారంటోంది. వరుసగా జరిగిన అన్ని ఎన్నికల్లో వైసీపీకి 80శాతానికి పైగా విజయాలు కట్టబెడుతున్నా.. విపక్షాలకు బుద్దిరావడం లేదంటోంది. తమ ఓటమిని జీర్ణించుకోలేని.. అంగీకరించలేని పరిస్థితుల్లో విపక్షం ఉందన్నారు ఏపీ సీఎం జగన్. ప్రజలకు మంచి జరగకుండా ప్రతిపక్షం అడ్డుకుంటోందన్నారు. గడిచిన రెండేళ్లుగా ఫలితాలు అధికార పార్టీకే అనుకూలంగా వచ్చాయి.
పరిషత్ ఫైట్ 2021.. ZPTC ఫలితాలు..
మొత్తం 641 వైసీపీ -616 టీడీపీ -07 జనసేన-బీజేపీ-02 ఇతరులు- 01
MPTC ఫలితాలు..
మొత్తం 9,590 వైసీపీ -8200 టీడీపీ -923 జనసేన- బీజేపీ- 207 ఇతరులు – 233
పరిషత్ ఫైట్ 2014.. ZPTC ఫలితాలు.. మొత్తం 653 వైసీపీ – 275 టీడీపీ – 373 బీజేపీ-సేన- 00 ఇతరులు -02
MPTC ఫలితాలు..
మొత్తం – 10,081 వైసీపీ – 4,199 టీడీపీ – 5216 బీజేపీ సేన- 13 ఇతరులు- 653
కార్పొరేషన్లు / మున్సిపాలిటీల్లో ఫలితాలు 2021
మొత్తం 87,
వైసీపీ – 86,
టీడీపీ -01,
బీజేపీ-సేన -00,
ఇతరులు -00
-2014- మొత్తం 99,
వైసీపీ – 20,
టీడీపీ -76,
బీజేపీ-సేన -00,
ఇతరులు -03
పంచాయితీ ఫలితాలు చూస్తే… 2021 రిజల్ట్..
మొత్తం 13092,
వైసీపీ – 10,536,
టీడీపీ – 2100,
జనసేన-బీజేపీ – 256,
ఇతరులు – 200
2013 రిజల్ట్..
మొత్తం 12,671,
వైసీపీ-3389,
టీడీపీ-4238,
కాంగ్రెస్-3388,
బీజేపీ,
ఇతరులు- 1656
సాధారణ ఎన్నికలు వస్తే తేల్చుకుందామని టీడీపీ సవాల్ చేస్తే… రాష్ట్రంలో టీడీపీయే లేదు. మేమే ప్రత్యామ్నాయం అంటోంది బీజేపీ. ఆ రెండు పార్టీలు దివాళా తీయడానికి సిద్దంగా ఉన్నయంటోంది అధికార పార్టీ. మరి నిజంగానే పరిషత్ ఫలితాలు విపక్షాలైన TDP, BJP, జనసేన పార్టీల భవిష్యత్తును నిర్దేశిస్తున్నాయా?
ఇవి కూడా చదవండి: Andhra Pradesh: పేదల ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు… ఆ రోజు నుంచే పనులు