Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు.. టీఆర్ఎస్ విసిరిన సవాల్‌కు రాహుల్‌ సిద్ధమేనా?

Big News Big Debate: తెలంగాణ రాజకీయాలకు డ్రగ్స్‌ మరకలు అంటుతున్నాయి. అంటే నేతలు మత్తులో మునిగారని కాదు.. ఈ మత్తుపదార్థాలను కూడా తమ రాజకీయాలకు..

Big News Big Debate: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు.. టీఆర్ఎస్ విసిరిన సవాల్‌కు రాహుల్‌ సిద్ధమేనా?
Big News Big Debate
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Sep 23, 2021 | 5:14 PM

తెలంగాణ రాజకీయాలకు డ్రగ్స్‌ మరకలు అంటుతున్నాయి. అంటే నేతలు మత్తులో మునిగారని కాదు.. ఈ మత్తుపదార్థాలను కూడా తమ రాజకీయాలకు వాడుకుంటున్నారన్నదే ఇక్కడ అర్థం. TRS నేతలు డ్రగ్స్‌కు బ్రాండ్‌ అంబాసిడార్లంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తే… బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం వాళ్లే అంటూ కాంగ్రెస్‌పై రివర్స్‌ ఎటాక్‌ చేస్తోంది TRS. అంతేకాదు మంత్రి కేటీఆర్‌ పరువు నష్టం దావా కూడా వేశారు. అందరికంటే ముందే వైట్‌ చాలెంజ్‌ స్వీకరించిన బండి సంజయ్‌ చివరకు TRS-కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అంటున్నారు.

సవాళ్లు… ప్రతిసవాళ్లు…. ట్వీట్ల యుద్ధం. మాటలతో కయ్యం మొదలైంది. రేవంత్‌ ఇంటివద్ద ఉద్రిక్తతలు. వైట్‌ ఛాలెంజ్ దుమారం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. సవాళ్లు, ప్రతిసవాళ్లు. పరువు నష్టం దావా కేసులతో తెలంగాణ పాలిటిక్స్‌ రచ్చరచ్చగా మారాయి. మంత్రి KTR కొండా విశ్వేశ్వరరెడ్డికి వైట్‌ చాలెంజ్‌ విసరడం ద్వారా రేవంత్‌ రెడ్డి రచ్చకు ఆజ్యం పోశారు. టెస్టుకు సిద్దమంటూ సోమవారం గన్‌పార్క్‌ వద్ద మాటలయుద్ధం ప్రకటించారు. రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆయన నివాసం వద్ద TRS కేడర్‌ చేసిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. అటు అమరవీరుల స్థూపం వద్దకు రేవంత్‌ రావడం వల్ల అపవిత్రం అయిందంటూ కేడర్‌ అభిషేకాలు చేశారు. ట్వీట్‌ ద్వారానే సమాధానం ఇచ్చిన మినిస్టర్‌ KTR… ఏమాత్రం సంబంధం లేని వివాదంలోకి లాగి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారని పరువునష్టం దావా వేశారు. ఇక మీదట ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉత్తర్వులు ఙవ్వాలని పిటిషన్‌ వేశారు. దీనిపై తీర్పు అక్టోబర్‌20కు వాయిదా వేసింది. అటు ఈ కేసులో రేవంత్‌ రెడ్డికి నోటీసులు ఇచ్చింది కోర్టు.

అటు రాహుల్‌ వస్తే AIIMSలో టెస్టుకు రెడీ అంటూ ప్రతిసవాల్‌ చేస్తోంది టీఆర్ఎస్. రాహుల్‌ గాంధీకి డ్రగ్స్‌ అలవాటు ఉందని గతంలో ఆరోపణలు వచ్చాయంటోంది TRS. కొండా విశ్వేశ్వరరరెడ్డి వైట్‌ చాలెంజ్ స్వీకరించిన బీజేపీ ఛీప్‌ బండి సంజయ్‌ ఇదంతా TRS-కాంగ్రెస్ డ్రామాగా కొట్టిపారేస్తున్నారు. గ్రీన్, వైట్, బ్లాక్, ఆరెంజ్ ఏ ఛాలెంజ్ అయినా తాను ఓకే అంటున్నారు బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్ర ముగిసిన తర్వాత ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని సంజయ్ రిప్లై ఇచ్చారు. వైట్‌ చాలెంజ్‌ హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రి నుంచి ఢిల్లీ AIIMSకు చేరుతుందా? విధానాలు, సిద్దాంతాలు కాదని కొత్త కొత్త ఎజెండాలు భుజానికెత్తుకున్న పార్టీలకు బూస్ట్‌ ఇస్తాయా.?

(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)

ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్‌ డిబేట్‌ జరిగింది… పూర్తి సమాచారం  కోసం కింద వీడియో చూడండి.

Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!