Lucky Astrology: ఆ రాశుల వారి మనసులో కోరికలు తీరే సమయం ఇదే..! ఇందులో మీ రాశి ఉందా..
మనఃకారకుడైన చంద్రుడు ఈ నెల 22 వరకు ఉచ్ఛ, మిత్ర, స్వక్షేత్రాల్లో సంచరిస్తున్నందువల్ల శుభ ఫలితాలిస్తాడు. 17, 18 తేదీల్లో వృషభంలో ఉచ్ఛ పట్టడం, 19, 20 తేదీల్లో మిత్ర క్షేత్రమైన మిథునంలో ప్రవేశించడం, ఆ తర్వాత 21, 22 తేదీల్లో స్వక్షేత్రమైన కర్కాటకంలో సంచరించడం వల్ల ఆరు రాశుల వారికి అనూహ్యంగా శుభ ఫలితాలను, శుభ యోగాలను కలగజేస్తాడు.

మనఃకారకుడైన చంద్రుడు ఈ నెల 22 వరకు ఉచ్ఛ, మిత్ర, స్వక్షేత్రాల్లో సంచరిస్తున్నందువల్ల శుభ ఫలితాలిస్తాడు. 17, 18 తేదీల్లో వృషభంలో ఉచ్ఛ పట్టడం, 19, 20 తేదీల్లో మిత్ర క్షేత్రమైన మిథునంలో ప్రవేశించడం, ఆ తర్వాత 21, 22 తేదీల్లో స్వక్షేత్రమైన కర్కాటకంలో సంచరించడం వల్ల ఆరు రాశుల వారికి అనూహ్యంగా శుభ ఫలితాలను, శుభ యోగాలను కలగజేస్తాడు. ముఖ్యంగా ఆ ఆరు రోజుల్లో కోరుకునే కోరికలు నెరవేరుతాయి. అప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. అందువల్ల సానుకూల దృక్పథంతో, అంటే ఎంత వీలైతే అంత పాజిటివ్ గా వ్యవహరించడం మంచిది. ఒప్పందాలకు, ప్రయత్నాలకు ఇది చాలా అనుకూలమైన సమయం. ఈ మూడు రాశుల్లో చంద్రుడు సంచారం చేయడం వల్ల మేషం, వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా, నివాసం పరంగా మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి.
- మేషం: ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగ సంబంధమైన కోరికలు, ఆశలు, ఆశయాలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సత్ఫలితాలనిస్తుంది. ధన స్థానంలో ఉచ్ఛ పడుతు న్నందు వల్ల ఆర్థిక ప్రయత్నాలన్నీ నెరవేరి, ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. మాటకు విలువ పెరు గుతుంది. గృహ, వాహన సౌకర్యాల కోసం చేసే ప్రయత్నాలు తప్పకుండా సాకారం అవుతాయి. మాతృ సౌఖ్యం లభిస్తుంది. తల్లి నుంచి సంపద సమకూరుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి.
- వృషభం: ఈ రాశిలో చంద్రుడు ఉచ్ఛపడుతున్నందువల్ల, ఆ తర్వాత ధన స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధన యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి, ఉద్యోగంలో జీత భత్యాలు పెరగడం జరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు పరిష్కారం లభిస్తుంది. తీర్థయాత్రలు లేదా విహార యాత్రలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక స్థితిగతులకు సంబంధించి మనసులోని కోరికలు ఒకటి రెండు తప్పకుండా నెరవేరుతాయి.
- కర్కాటకం: ఈ రాశికి అధిపతి అయిన చంద్రుడు 17న ఉచ్ఛ పట్టిన దగ్గర నుంచి స్వక్షేత్రమైన కర్కాటకంలో ప్రవేశించే వరకూ ఈ రాశివారి జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవితంలో అతి వేగంగా సానుకూల మార్పులు సంభవిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. వ్యక్తిగత సమస్యల నుంచి ఊరట లభిస్తుంది.
- కన్య: ఈ రాశివారికి చంద్రుడు ఈ ఆరు రోజుల కాలంలో భాగ్య స్థానం నుంచి లాభ స్థానం వరకు సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారి ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. మనసులో ఏది కోరుకుంటే అది సాకారం అవుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా సత్ఫలితాలని స్తాయి. నిరుద్యోగులకు స్వదేశం నుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అనేక మార్గాల్లో సంపద పెరిగే సూచనలున్నాయి.
- తుల: ఈ రాశికి దశమాధిపతి అయిన చంద్రుడు ఉచ్ఛపట్టడం, ఆ తర్వాత భాగ్య, దశమ స్థానాల్లో సంచారం చేయడం వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా ఉన్నత స్థాయి వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగ స్థిరత్వంతో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా లభిస్తుంది. అనేక విధాలుగా సంపద కలిసి వస్తుంది. వారసత్వ సంపదకు కూడా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ సంబంధమైన ఆశలు, ఆర్థిక సంబంధ మైన కోరికలు నెరవేరడం జరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.
- మకరం: ఈ రాశికి పంచమ స్థానం నుంచి సప్తమ స్థానం వరకు చంద్ర సంచారం జరుగుతున్నందువల్ల, ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా శుభవార్తలు వింటారు. పదోన్నతులకు, జీతభత్యాలు పెరగడానికి అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. కుటుంబపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కడం, వైవాహిక జీవితంలో అనుబంధం వృద్ధి చెందడం వంటివి జరిగే అవకాశం ఉంది.



