Weekly Horoscope 23 29 July
Weekly Horoscope: భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు విశ్వసిస్తారు. గ్రహాలు, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని ఒకరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందని లెక్కిస్తారు జ్యోతిష్య పండితులు. మరి 12 రాశుల వారికి జులై 23 (ఆదివారం) నుంచి జులై 29 (శనివారం) వరకు వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో మీ నిర్ణయాలు, మీ ఆలోచనలు కార్యరూపంలో పెట్టి సత్ఫలి తాలు సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగంలో మార్పులకు, ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆదాయపరంగా దాదాపు ప్రతి ప్రయత్నం అనుకూలిస్తుంది. జీవిత భాగస్వామికి కూడా వృత్తి, ఉద్యోగాల పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్న కారణంగా ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేసినా సఫలం అవుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు పెంచడానికి, కొత్త వ్యాపారాలు చేపట్టడానికి అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఇతర దేశాల్లో ఉంటున్న పిల్లలు ఇంటికి రావడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించడం అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆదాయ ప్రయత్నాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఆర్థిక స్థిరత్వం కోసం కృషి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ప్రయోజనాలు ఇస్తాయి. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆశించిన ప్రోత్సాహకాలను అందుకుంటారు. వ్యాపారాలలో లాభాలకు ఢోకా ఉండదు. అనుకోని ఖర్చులతో కాస్తంత ఇబ్బంది పడతారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రయత్నాలకు అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి తన వృత్తి, ఉద్యోగాలలో ఆదరణ లభిస్తుంది.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఇంటా బయటా విపరీతమైన ఒత్తిడి ఉన్నప్పటికీ, ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి మీ ప్రయత్నాలు చాలావరకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. కొత్త బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. మీ మాట చెల్లుబాటు అవుతుంది. నష్టం కలిగించే వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక సంబంధమైన బాధ్యతలను ఎవరికీ అప్పగించవద్దు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఈ వారం కొన్ని విదేశీ వ్యవహారాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. విదేశాల్లో ఉద్యోగాలు, చదువులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపా రాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. చిన్న ప్రయత్నంతో మంచి ప్రయోజనా లను పొందుతారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అయితే, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఉద్యోగం మారడానికి ప్రయత్నించేందుకు ఇది మంచి సమయం. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి, ఉద్యోగాలకు సంబంధించినంత వరకూ సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. స్వయం ఉపాధి, వ్యాపారాలు లాభాల పంట పండిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, విందులు, వినోదాలు, విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. రాదని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలు అవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఆదాయ సంబంధమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు. ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు, కార్యకలాపాలు పూర్తవుతాయి. పిల్లల కారణంగా కుటుంబంలో చికాకులు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. వృత్తి జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు పరవాలేదనిపిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభి స్తుంది. ఆస్తి వివాదాల విషయంలో శుభవార్త వినడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వారం రోజుల పాటు జీవితం ఆశించిన విధంగా ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలలో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల మీద విరివిగా ఖర్చు చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి వీలుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాల మీద ఆధారపడడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభ సాటిగా ముందుకు వెడతాయి. ఉద్యోగ జీవితంలో పనిభారం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆశించిన ప్రతిఫలం అందే అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటు ఉండదు. అయితే, ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన కార్యకలాపాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, వ్యాపారాలకు సంబంధించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొత్త ప్రయ త్నాలకు, కార్యక్రమాలకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవ హరించే పక్షంలో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. కుటుంబ జీవితం ప్రశాం తంగా సాగిపోతుంది. వ్యక్తిగతంగా ఒకటి రెండు చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం అవసరం.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ తెలివితేటలు, శక్తిసామర్థ్యాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. శుభ కార్యాలు, దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలు నిల కడగా ముందుకు సాగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. బంధుమిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించగలరు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.