Weekly Horoscope (18 – 24 June): వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడినా అనవసర ఖర్చులు ఖాయం.. 12 రాశుల వారికి వార ఫలాలు..

| Edited By: Basha Shek

Jun 18, 2023 | 6:22 AM

Weekly Horoscope(18-24 June): జ్యోతిష్య శాస్త్రం మేరకు ఈ వారం అంటే ఆదివారం (జూన్ 18వ తేదీ) నుంచి శనివారం (జూన్ 24) వరకు మీ రాశికి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆర్థిక, ఆరోగ్యపరంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది? కుటుంబంలో ఎవరికి సానుకూల వాతావరణం నెలకొంటుంది? ప్రేమ వ్యవహారాలు ఎవరికి సానుకూలంగా ఉంటాయి? 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

Weekly Horoscope (18 - 24 June): వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడినా అనవసర ఖర్చులు ఖాయం.. 12 రాశుల వారికి వార ఫలాలు..
Weekly Horoscope 18-24 June 2023
Image Credit source: TV9 Telugu
Follow us on

Weekly Horoscope(18-24 June): జ్యోతిష్య శాస్త్రం మేరకు ఈ వారం అంటే ఆదివారం (జూన్ 18వ తేదీ) నుంచి శనివారం (జూన్ 24) వరకు మీ రాశికి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆర్థిక, ఆరోగ్యపరంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది? కుటుంబంలో ఎవరికి సానుకూల వాతావరణం నెలకొంటుంది? ప్రేమ వ్యవహారాలు ఎవరికి సానుకూలంగా ఉంటాయి? 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ వారం ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా ప్రశాంతంగా గడిచిపోయే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చు విషయంలో కొద్దిగా ముందుచూపుతో వ్యవహరించడం మంచిది. స్నేహితులతో కలిసి విలాసాల మీద ఖర్చు చేసే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. ఉద్యోగం మారటానికి చేస్తున్న ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
  2. వృషభం (కృత్తిక, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో మార్పులు జరగడానికి అవకాశం ఉంది. పని భారం పెరగవచ్చు. ఇంటా బయటా కొద్దిగా శ్రమ ఒత్తిడి ఎక్కువ అయ్యే సూచనలు ఉన్నాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. వైద్య ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. డాక్టర్లు, లాయర్లకు ఒత్తిడి పెరుగుతుంది. అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొందరు స్నేహితులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగ వాతావరణం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగపరంగా ఆదాయం లేదా సంపాదన పెరిగే అవకాశం ఉంది. కుటుంబ పరంగా ఒకటి రెండు చిన్న చిన్న చికాకులు తలెత్తటం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ అనుకోని ఖర్చుల వల్ల అవస్థలు పడటం జరుగుతుంది. సంతానంలో ఒకరు ఉద్యోగపరంగా దూర ప్రాంతా నికి వెళ్లే సూచనలు ఉన్నాయి. జీవిత భాగ స్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఈ రాశి వారి మీద మధ్య మధ్య అష్టమ శని ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యమైన పనులు కూడా అనవసరంగా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఉద్యోగంలో సహచరుల బాధ్యత లను కూడా పంచుకోవాల్సి వస్తుంది. అధికారులు పెడ మొహంతో వ్యవహరించడం కూడా జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా కొనసాగుతుంది. కుటుంబ పరంగా ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో సంపాదన కొద్దిగా ఒడిదుడుకులకు లోనవుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఈ రాశి వారికి ప్రస్తుతం మూడు శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల అటు ఉద్యోగ జీవితం, ఇటు కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతాయని చెప్పవచ్చు. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారు అనేక విధాలుగా లబ్ధి పొందడం జరుగుతుంది. వారికి డిమాండ్ పెరుగుతుంది. ఒకటి రెండు శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా ఇతరుల నుంచి అందవలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆరోగ్యం చాలావరకు సహకరిస్తుంది.
  7. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఈ రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. కొన్ని ముఖ్యమైన పనులు వేగంగా పూర్తి అవుతాయి. మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. రెండు మూడు మార్గాలలో డబ్బు కలిసి వస్తుంది. ఇష్టపడిన వారితో పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించ వచ్చు. ముఖ్యమైన కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. అయితే, అధికారులతో అనుకోని ఇబ్బందులు తలెత్తవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.
  8. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆదాయం తిరిగి అవసరాలు తీరడంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా చాలావరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అధికారుల నుంచి ఆదరణ, అభినందనలు లభిస్తాయి. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. అయితే అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది.
  9. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఈ రాశి వారికి తరచూ ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ వారం బంధుమిత్రులతో కానీ ఇరుగుపొరుగుతో కానీ విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కొద్దిగా చూసీ చూడనట్టు అంటీ ముట్టనట్టు వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటించడం జరుగుతుంది. ఉద్యోగంలో అదనపు భారం మీద పడే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు యధావిధిగా సాగిపోతాయి.
  10. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): అదనపు ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యో గాలపరంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. వ్యాపారులకు లాభాల శాతం పెరగవచ్చు. ఉద్యోగం మారటానికి సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ పరంగా శుభవార్తలు వినడం జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు కొత్త నిర్ణయాలు ఆశించిన స్థాయిలో మంచి ఫలితాలను ఇస్తాయి. పిల్లలలో ఒకరు చక్కని పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది.
  11. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ రాశి వారికి దూరప్రాంతం నుంచి ఒక శుభవార్త అందుతుంది. అది కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఉద్యోగ జీవితం చాలా వరకు ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లలకు సంబంధించిన ఒకటి రెండు సమస్యలను పరి ష్కరించడం జరుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు మంచి గుర్తింపు పొందుతారు. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
  12. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు, చేర్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో పని భారం పెరుగుతుంది. కొద్దిగా డబ్బు నష్టం జరిగే అవకాశం ఉన్నందువల్ల ఎవరినైనా త్వరపడి నమ్మటం మంచిది కాదు. వృత్తి వ్యాపారాల వారికి ఇది చాలావరకు అనుకూలమైన సమయం. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్లడం మంచిది.
  13. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ రాశి వారికి ప్రస్తుతం అనుకూల కాలం నడుస్తోంది. మంచి నిర్ణయాలు తీసుకోవడం, ప్రయత్నాలు సాగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. స్నేహితులలో ఒకరిద్దరికి ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.

నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..