Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ugadi 2025 Astrology: ఉగాది తర్వాత అనుకున్నది సాధించేది ఈ రాశులవారే!

Achieve Goals Astrology: ఉగాది తర్వాత ప్రారంభమయ్యే తెలుగు సంవత్సరంలో కొన్ని రాశుల వారు తమ లక్ష్యాలను సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. ఆదాయ వృద్ధి, ఉద్యోగ ప్రమోషన్, విదేశీ అవకాశాలు వంటి అంశాల్లో ఈ రాశుల వారు విజయం సాధిస్తారు. ప్రతి రాశికి సంబంధించిన లక్ష్యాలు, వాటిని సాధించడానికి అవసరమైన లక్షణాలు ఇక్కడ వివరించడం జరిగింది.

Ugadi 2025 Astrology: ఉగాది తర్వాత అనుకున్నది సాధించేది ఈ రాశులవారే!
Ugadi 2025 Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 25, 2025 | 8:25 PM

Telugu Astrology: అనుకున్నది సాధించడంలో కొన్ని రాశుల వారు ముందు వరుసలో ఉంటారు. ఉగాది తర్వాత ప్రారంభమయ్యే కొత్త సంవత్సరంలో కొన్ని రాశులవారు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని, కొత్త నిర్ణయాలు తీసుకుని వాటిని గట్టి పట్టుదలతో సాధించుకుంటారు. మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశుల వారు ‘విశ్వావసు’లో తప్పకుండా కొన్ని లక్ష్యాలను పూర్తి చేయడం జరిగే అవకాశం ఉంది. ఆదాయం, అధికారం, పదోన్నతి, విదేశీ ఉద్యోగాలు, వృత్తి, వ్యాపారాలు తదితర అంశాల్లో ఈ రాశులవారు ఏ విధంగా విజయాలు సాధించబోయేది ఇక్కడ పరిశీలిద్దాం.

  1. మేషం: అనుకున్నది సాధించాలనే పట్టుదల, నాయకత్వ లక్షణాలు, అందరినీ కలుపుకునిపోయే తత్వం ఎక్కువగా ఉండే ఈ రాశివారిలో అధికారం చెలాయించాలనే కోరిక, ఉన్నత పదవులు చేపట్టాలనే ఆశయం వృద్ధి చెందుతాయి. ఎటువంటి సవాలునైనా ఎదుర్కోవడానికి ఈ రాశివారు సర్వకాల సర్వావస్థలా సిద్ధంగా ఉంటారు. ఈ రాశివారికి రాశ్యధిపతి కుజుడు బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల విశ్వావసులో తమ లక్ష్యాలను గట్టి పట్టుదలతో, కొద్ది ప్రయత్నంతో సాధించుకోగలుగుతారు.
  2. వృషభం: ఈ రాశివారికి ఆదాయాన్ని పెంచుకోవడం, కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకు రావడమే ప్రధాన లక్ష్యాలుగా మారుతాయి. ఒక ప్రణాళిక ప్రకారం ఆదాయాన్ని కూడగట్టుకోవడం, ఖర్చు చేయడంలో దిట్టలైనందువల్ల కొద్ది ప్రయత్నంతో తప్పకుండా తమ లక్ష్యాలను సాధించుకోగలుగుతారు. పైకి కనిపించని మొండి పట్టుదలతో వీరు రహస్యంగా ఆదాయంలో ఎక్కువ భాగాన్ని మదుపు చేయడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే అవకాశముంది.
  3. సింహం: ఈ రాశివారికి నాయకత్వ లక్షణాలతో పాటు మొండి పట్టుదల చాలా ఎక్కువ. తమ లక్ష్యాలను అందుకోవడానికి ఎంతటి శ్రమకైనా ఒడిగడతారు. ఉద్యోగంలో అధికారం చేపట్టడం మీదా, వీలైతే ఒక సంస్థకు సర్వాధికారి కావడం మీదా, దర్జాగా బతకడం మీదా వీరు ఈ ఏడాది దృష్టి పెడతారు. ఈ రాశివారు ఒక వ్యూహకర్త కూడా అయినందువల్ల వీటిని సాధించుకోవడానికి ఏ అవకాశాన్నీ వదిలిపెట్టే అవకాశం ఉండదు. ఏడాదిలో పూర్తి కావాల్సిన పనుల్ని ఆరు నెలల్లోనే పూర్తి చేస్తారు.
  4. తుల: ఈ రాశివారు విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని, బంధుమిత్రుల కన్నా ఎక్కువగా సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకునే అవకాశం ఉంది. ఒకసారి నిర్ణయం తీసుకున్న పక్షంలో దాన్నిమార్చుకునే అలవాటు లేకపోవడం, ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించడం, సహజ ఆకర్షణ శక్తి కలిగి ఉండడం వల్ల వీరు తమ లక్ష్యాల దిశగా దూసుకుపోయే అవకాశం ఉంది. ఓటమిని అంగీకరించే అలవాటు లేని ఈ రాశివారు ‘విశ్వావసు’ సంవత్సరంలో తమ లక్ష్యాలను తప్పకుండా సాధించుకుంటారు.
  5. ధనుస్సు: ఈ రాశివారిలో ఏదో ఒక యాంబిషన్ ఉంటుంది. తమ మనసులోని కోరికను సాధించుకునే వరకూ వీరు నిద్రపోరు. నాయకత్వ లక్షణాలతో పాటు, అందరినీ కలుపుకునిపోయే తత్వం కలిగిన ఈ రాశివారు కొత్త సంవత్సరంలో ఆదాయ వృద్ది మీదా, ఆధునిక సౌకర్యాలను అనుభవిం చడం మీదా, విదేశీ సంపాదన మీదా దృష్టి పెట్టే అవకాశం ఉంది. వీరు తమకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. ఈ ఏడాది వీరు లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది.
  6. మకరం: పట్టుదలకు, జాగ్రత్తకు, పొదుపునకు మారుపేరైన ఈ రాశివారు ఆదాయాన్ని పెంచుకోవడం మీదా, కుటుంబానికి భద్రత కల్పించడం మీదా ఈ ఏడాది ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఎంతటి శ్రమకైనా, రిస్కుకైనా వెనుకాడని ఈ రాశివారు ఎక్కువ సమయాన్ని ఆదాయాన్ని పెంచుకోవడం మీద వెచ్చించే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి కోసం మరింత మంచి ఉద్యోగంలోకి మారడం జరుగుతుంది. ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద ఎక్కువగా మదుపు చేసే అవకాశం ఉంది.