AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honeymoon Astrology: అనుకూలంగా శుక్రుడి సంచారం.. ప్రేమ యాత్రలకు వెళ్లేందుకు వారికి ఇదే కరెక్ట్ టైమ్.. !

శుక్ర గ్రహం ఉచ్ఛ, స్వక్షేత్ర, మిత్ర క్షేత్రాలలో సంచరిస్తున్నప్పుడు తప్పకుండా శృంగార భావనలను, సుఖ సంతోషాలను పెంపొందించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తన స్వక్షేత్రమైన తులా రాశిలో సంచరిస్తున్న శుక్రుడిని మేష రాశి నుంచి గురువు కూడా వీక్షిస్తున్నందువల్ల శుక్ర గ్రహం కొన్ని రాశుల వారి మీద సుఖ సంతోషాల కుంభ వృష్టి కురిపించే అవకాశం ఉంది.శుక్రుడు తులా రాశిలో ఈ నెలాఖరు వరకే ఉంటున్నప్పటికీ దీని ప్రభావం మాత్రం ఫిబ్రవరి 15 వరకూ కొనసాగే అవకాశం ఉంది.

Honeymoon Astrology: అనుకూలంగా శుక్రుడి సంచారం.. ప్రేమ యాత్రలకు వెళ్లేందుకు వారికి ఇదే కరెక్ట్ టైమ్.. !
Honeymoon Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Dec 10, 2023 | 6:11 PM

Share

శుక్ర గ్రహం ఉచ్ఛ, స్వక్షేత్ర, మిత్ర క్షేత్రాలలో సంచరిస్తున్నప్పుడు తప్పకుండా శృంగార భావనలను, సుఖ సంతోషాలను పెంపొందించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తన స్వక్షేత్రమైన తులా రాశిలో సంచరిస్తున్న శుక్రుడిని మేష రాశి నుంచి గురువు కూడా వీక్షిస్తున్నందువల్ల శుక్ర గ్రహం కొన్ని రాశుల వారి మీద సుఖ సంతోషాల కుంభ వృష్టి కురిపించే అవకాశం ఉంది. శుక్రుడు అనుగ్రహించే రాశులు మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు. శుక్ర గ్రహం ఈ విధంగా అనుకూల సంచారం చేస్తున్నప్పుడు కొత్త దంపతులు ప్రేమ యాత్రలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. శుక్రుడు తులా రాశిలో ఈ నెలాఖరు వరకే ఉంటున్నప్పటికీ దీని ప్రభావం మాత్రం ఫిబ్రవరి 15 వరకూ కొనసాగే అవకాశం ఉంది. కొత్త దంపతులు ఈ సమయంలో ప్రేమ యాత్రలకు ప్లాన్ చేసుకునే వారికి ఇది హ్యాపీగా, సాఫీగా సాగిపోతుందనడంలో సందేహం లేదు.

  1. మేషం: ఈ రాశిలో ఉన్న గురువు సప్తమంలో సంచరిస్తున్న శుక్రుడిని వీక్షిస్తున్నందువల్ల ఇవి ప్రేమ యాత్రలకు, అంటే హనీమూన్ కు, చాలా మంచి రోజులని, అనుకూలమైన రోజులని చెప్పాలి. గరిష్ఠ స్థాయిలో వీరు సుఖ సంతోషాలు అనుభవిస్తారు. సాధారణంగా ఈ రాశివారు ప్రేమ యాత్ర లకు ప్రకృతి సౌందర్యానికి సంబంధించిన ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ ప్రేమ యాత్ర ల మీద భారీగా ఖర్చయ్యే అవకాశం ఉంటుంది కానీ సుఖ సంతోషాలకు మాత్రం కొదువ ఉండదు.
  2. మిథునం: ఈ రాశివారికి పంచమ స్థానంలో శుక్ర గ్రహ సంచారం వల్ల ప్రేమ భావనలు, శృంగార భావనలు అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. వీరు కొండ ప్రాంతాలను, హిల్ స్టేషన్లను తమ ప్రేమ యాత్ర లకు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ప్రేమ యాత్ర సందర్భంగా తమ జీవిత భాగస్వామికి విలువైన వస్తువులు కానుకలుగా ఇచ్చే అవకాశం ఉంది. వీరు అతి త్వరలో ఈ శృంగార యాత్రకు వెళ్లడం జరుగుతుంది. అంతేకాక, వీరు ఒకటికి రెండు సార్లు ప్రేమ యాత్ర చేసే అవకాశం కూడా ఉంది.
  3. కర్కాటకం: ఈ రాశివారికి నాలుగవ స్థానంలో శుక్ర సంచారం జరుగుతుండడం, దాన్ని దశమ స్థానం నుంచి మరో శుభ గ్రహమైన గురువు వీక్షించడం వల్ల ఒకటి రెండు నెలల పాటు వీరు అనేక పర్యా యాలు శృంగార యాత్రలు చేసే అవకాశం ఉంది. సాధారణంగా ఈ రాశివారు జల ప్రాంతాలను, జలపాత ప్రాంతాలను తమ హనీమూన్ కు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఎంత ఖర్చు పెట్ట డానికైనా సిద్ధపడడంతో పాటు, సతీమణికి విలువైన కానుకలు బహూకరించడం కూడా జరుగుతుంది.
  4. కన్య: ఈ రాశికి ద్వితీయ స్థానంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల వీరు ఈ నెలాఖరులోగానీ, జనవరి మొదటి వారంలో గానీ హనీమూన్ యాత్ర చేసే అవకాశం ఉంది. ఈ రాశికి చెందినవారు సాధార ణంగా కొండ ప్రాంతాలను, ఎత్తయిన ప్రాంతాలను తమ యాత్రకు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. దూర ప్రాంతాలు కాకుండా తమకు అత్యంత సమీపంలో ఉన్న ప్రాంతానికి వీరు ప్రేయ యాత్ర చేసే సూచనలు కూడా ఉన్నాయి. ఆహార, విహారాల మీద బాగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది.
  5. తుల: ఈ రాశిలో ఉన్న రాశ్యధిపతి శుక్రుడిని సప్తమ స్థానం నుంచి గురువు కూడా వీక్షిస్తున్నందువల్ల వీరు అనేక పర్యాయాలు సతీమణితో ప్రేమ యాత్ర చేసే అవకాశం ఉంది. మొదటగా ఈ నెల 29 లోపు హనీమూన్ సాగించడం జరుగుతుంది. ప్రేమ యాత్ర సందర్భంగా ఆహారం, దుస్తుల మీద ఎక్కువగా ఖర్చు పెట్టడంతోపాటు సతీమణికి విలువైన వస్తువులు, ఆభరణాలు కానుకలుగా అందజేయడం జరుగుతుంది. జలపాతాలు, లోయ ప్రాంతాలకు హనీమూన్ వెళ్లే అవకాశం ఉంది.
  6. ధనుస్సు: ఈ రాశివారికి లాభ స్థానంలో, అంటే సుఖ సంతోషాలకు సంబంధించిన స్థానంలో సంచారం చేస్తున్నశుక్రుడు తప్పకుండా హనీమూన్ యోగం కలిగిస్తాడు. ఈ సమయంలో ఈ రాశివారికి శృంగార సంబంధమైన ఆలోచనలు కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రెండు మూడు సార్లు ప్రేమ యాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఈ రాశివారు తీర ప్రాంతాలను, అటవీ ప్రాంతా లను హనీమూన్ కు ఎంపిక చేసుకుని, అక్కడ గరిష్ఠ స్థాయిలో హ్యాపీగా గడపడం జరుగుతుంది.