Astrology: వచ్చిన జీతం వచ్చినట్లు ఖర్చవుతోందా.? రాశుల ఆధారంగా ఈ పరిహారాలు మంచి ఫలితాలు ఇస్తాయి.

ఎవరు అవునన్నా.. కాదన్నా ప్రతీ మనిషి డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తుంటారు. తమ అభిరుచులను, ఇష్టాలకు అనుగుణంగా వృత్తి చేస్తూనే ప్రస్తుత, భవిష్యత్‌ అవసరాల కోసం డబ్బును కూడబెడుతుంటారు. ఈ క్రమంలోనే నెలవారీ జీతాన్ని ఆచితూచి ఖర్చు చేస్తూ ఎంతో కొంత డబ్బును మిగిలిస్తూ..

Astrology: వచ్చిన జీతం వచ్చినట్లు ఖర్చవుతోందా.? రాశుల ఆధారంగా ఈ పరిహారాలు మంచి ఫలితాలు ఇస్తాయి.
Astrology Tips
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 19, 2023 | 8:38 AM

ఎవరు అవునన్నా.. కాదన్నా ప్రతీ మనిషి డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తుంటారు. తమ అభిరుచులను, ఇష్టాలకు అనుగుణంగా వృత్తి చేస్తూనే ప్రస్తుత, భవిష్యత్‌ అవసరాల కోసం డబ్బును కూడబెడుతుంటారు. ఈ క్రమంలోనే నెలవారీ జీతాన్ని ఆచితూచి ఖర్చు చేస్తూ ఎంతో కొంత డబ్బును మిగిలిస్తూ పొదుపు చేసుకుంటారు. అయితే ఈ పొదుపు విషయంలో అందరూ సక్సెస్‌ అవుతారా.? అంటే కచ్చితంగా అవునని చెప్పలేము. కొంతమందికి వచ్చిన జీతం వచ్చినట్లు ఖర్చవుతుంది. నెలఖారుకు ఒక్క రూపాయి కూడా మిగలదు. అయితే చేతికి వచ్చిన డబ్బు నిలవకపోవడంపై గ్రహాల స్థితి గతులు కూడా ప్రభావం చూపుతాయని జ్యోత్యిష్య నిపుణులు చెబుతున్నారు. ఖర్చులు మిగిలి, డబ్బు పొదుపు కావాలంటే రాశుల ఆధారంగా కొన్ని పరిహారాలు చేయాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ పరిహారాలు ఏంటంటే..

* మేషం, సింహం, ధనుస్సు రాశుల వారు మీ జీతంలో కొంత భాగాన్ని విరాళంగా ఇవ్వండి. అవసరమైన వారికి ఆహార పదార్థాలను దానం చేయండి. ఈ వస్తువులను దానం చేయడం వల్ల ఒత్తిడితో పాటు ఆఫీసులో ఎదురయ్యే సమస్యలను నుంచి బయటపడొచ్చు.

* వృషభం, కన్య, మకర రాశి వారు తమ ఆదాయంలో కొంత భాగాన్ని దాతృత్వానికి ఇవ్వాలి. ఈ మూడు రాశుల వారు కూడా ప్రతి శనివారం శని దేవుడికి నూనె సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఖర్చులను తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

* మిథున, తుల, కుంభ రాశి వారు తమ జీతంలో కొంత భాగాన్ని పేదల ఆరోగ్యం కోసం ఖర్చు చేయాలి. వీలైతే, ఆసుపత్రికి విరాళం ఇవ్వండి. ఇలా చేయడం వల్ల పదోన్నతలు పొందడంతో పాటు, ఉద్యోగాల్లో ఆటంకాలు తొలగిపోతాయి.

* కర్కాటకం, వృశ్చికం, మీన రాశి వారు జీతం అందిన తర్వాత పేదలకు దుస్తులు లేదా, పాద రక్షలు దానం చేయాలి. ముఖ్యంగా వృద్ధులకు ఇలాంటి సహాయం అందించాలి. ఇలాంటి వాటి వల్ల జీవిత కాలం పెరగడంతో పాటు ఆర్థికంగా బలోపేతం అవుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..