Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 29, 2025): మేష రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అన్ని వ్యవహారాలూ అనుకూలంగా సాగిపోతాయి. వృషభ రాశి వారు ఉద్యోగంలో సమర్థత, నైపుణ్యాలు బాగా వెలుగులోకి వస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. మిథున రాశి వారు అంచనాలకు మించిన ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది.కొద్దిగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 29 April 2025
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 29, 2025 | 5:01 AM

దిన ఫలాలు (ఏప్రిల్ 29, 2025): మేష రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అన్ని వ్యవహారాలూ అనుకూలంగా సాగిపోతాయి. వృషభ రాశి వారు ఉద్యోగంలో సమర్థత, నైపుణ్యాలు బాగా వెలుగులోకి వస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. మిథున రాశి వారు అంచనాలకు మించిన ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది.కొద్దిగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అన్ని వ్యవహారాలూ అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొంత వరకు బయటపడతారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో సమర్థత, నైపుణ్యాలు బాగా వెలుగులోకి వస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. పిల్లలు చదువుల్లో బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందే అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

అంచనాలకు మించిన ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం ప్రారంభించినా తప్పకుండా సఫలమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, ప్రమోషన్ల విషయంలో శుభవార్తలు వింటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కొద్దిగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగాల్లో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు క్రమంగా లాభాల బాటపడతాయి. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. బంధువుల నుంచి శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు అనుకూలంగా సాగిపోతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ జీవి తం ఉత్సాహంగా సాగిపోతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో అధికారులతో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి, ఆర్థిక వివాదాల నుంచి కొద్దిగా బయటపడతారు. అనారోగ్య సమస్యల నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. ఆకస్మిక ధన వ్యయ సూచనలున్నాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి, అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు శుభవార్తలు లేదా ఆశించిన సమాచారం అందడానికి అవకాశం ఉంది. కుటుంబ సమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో సామాన్య లాభాలు అందుకుంటారు. సోదరులతో వివాదాలు సమసిపోతాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ సానుకూలపడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. ఆదాయానికి ఏ మాత్రం లోటుండదు. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినా తగిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో కొత్త మార్పులు చేపడ తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా ప్రాధాన్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థాయిలో ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రోజంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. పలువురికి మీ సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడతాయి. కుటుంబపరంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. అయితే, ధన వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగులకు అధికార యోగం పడుతుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఒకటి రెండు మార్గాల్లో ధన లాభాలు కలుగుతాయి. ఆర్థిక అవసరాలు చాలావరకు తీరిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలను చాలా వరకు పరిష్కరించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలన్నీ సానుకూలపడతాయి. మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఆర్థిక పరి స్థితికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మెరుగైన అవకాశాలు అందుతాయి. వ్యక్తిగత సమస్యల్ని జాగ్రత్తగా పరిష్కరించుకుంటారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాలు కొద్ది మార్పులతో పురోగమిస్తాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. నిరుద్యో గులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి.

అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు
అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే -పవన్‌
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే -పవన్‌
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది