Horoscope Today: ఆ రాశి వారికి ఆదాయానికి లోటుండదు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (May 10, 2025): మేష రాశి వారికి ఆర్థిక విషయాలన్నీ సజావుగా సాగిపోయే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆదాయం వృద్ధి చెందే అవకాశముంది. అలాగే మిథున రాశి వారికి అనేక విధాలుగా ఆదాయం పెరిగి పట్టిందల్లా బంగారం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

దిన ఫలాలు (మే 10, 2025): మేష రాశి వారికి ఆర్థిక విషయాలన్నీ సజావుగా సాగిపోతాయి. ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృషభ రాశి వారికి ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, చిన్నూపాటి వ్యాపారాల్లో మదుపు చేసే అవకాశం ఉంది. మిథున రాశి వారికి అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆర్థిక విషయాలన్నీ సజావుగా సాగిపోతాయి. ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కొద్దిపాటి మార్పుల కారణంగా వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ, రాబడి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. షేర్ల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, చిన్నూపాటి వ్యాపారాల్లో మదుపు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగానే ఉంటుంది. అయితే, ఆదాయపరంగా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటేమీ ఉండకపోవచ్చు. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఒకరిద్దరు బంధుమిత్రుల్ని ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రావలసిన డబ్బు చేతికి అందడంతో పాటు, షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ముఖ్యమైన అవసరాలు తీరడంతో పాటు, ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాలు చాలావరకు లాభదాయకంగా సాగి పోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ప్రస్తుతానికి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఖర్చుల్ని తగ్గించుకుని మదుపు చేయడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దడంలో తల్లి తండ్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం కావచ్చు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఆదాయానికి తగ్గట్టుగా అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిగా రాబడి వృద్ధి చెందుతుంది. ధన పరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయ మార్గాల మీద శ్రద్ధ పెడతారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. అధికారులకు మీ సలహాలు, సూచనలు బాగా ఉపకరిస్తాయి. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రోజంతా ప్రశాంతంగా, హ్యాపీగా గడిచిపోతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగంలో కొద్దిగా ఓర్పు, సహనాలు అవసరమవుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగంలో అధికారులు మీ సమర్థతను గుర్తించి ప్రత్యేక బాధ్యతల్ని అప్పగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు పొందుతారు. ఆస్తి వివాదం ఒకటి కొద్దిగా ఇబ్బంది కలి గిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాబడి పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ఆర్థికపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం శ్రేయస్కరం. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా పూర్తవుతాయి. కొందరు మిత్రులకు, బంధువులకు సహాయం చేయడం జరుగుతుంది. ఆరోగ్యానికి కూడా ఢోకా ఉండదు. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆదాయానికి లోటుండదు. ఏదో ఒక మార్గంలో ఆదాయం అందుతూనే ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం యథావిధిగా సాగిపోతుంది. నిరుద్యోగులకు శుభ వార్తలు అందే అవకాశం ఉంది. కుటుంబంలో కొద్దిగా అపార్థాలు తలెత్తుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తి గత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. పిల్లలు పురోగతి సాధిస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా ఉంటాయి. ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. గతంలో మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది. ఇష్టమైన మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగ బాధ్యతలల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండవద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో హోదాలు, జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొద్దిగా ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు, హామీలు ఉండవద్దు. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి పెట్టడం మంచిది. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.