Horoscope Today: ఆ రాశి వారికి వ్యాపారాల్లో లాభాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope: మార్చి 28, 2025 నాటి 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ ఉన్నాయి. మేష రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతి, వృషభ రాశి వారికి ఆర్థిక పురోగతి, మిథున రాశి వారికి ఆదాయ వృద్ధికి అవకాశముంది. ఇతర రాశుల వారికి వృత్తి, ఆరోగ్యం, కుటుంబం, విద్య, ప్రేమ వ్యవహారాలపై జ్యోతిష్య ఫలాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి రాశికి సంబంధించిన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

దిన ఫలాలు (మార్చి 28, 2025): మేష రాశి వారు ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. వృషభ రాశి వారికి కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ జీవితం చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. మిథున రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. వృథా ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. ఆదాయం బాగా పెరగడంతో ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. రాజకీయంగా ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అనారోగ్యాల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. కొందరు మిత్రులు ఆర్థికంగా నష్టపరిచే అవకాశం ఉంది. విద్యార్థులు మంచి విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ జీవితం చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితం సంతృప్తి కరంగా పురోగమిస్తుంది. వ్యాపారాల్లో ఒకటి రెండు శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. అనేక విధాలుగా సంపాదన పెరుగుతుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, హ్యాపీగా సాగిపోతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమవుతుంది. ఆదాయం పెరుగుతుంది. వృథా ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అనారోగ్యం నుంచి కొద్దిగా కోలుకోవడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయటా మాట చెల్లుబాటు అవుతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాదా సీదాగా సాగిపోతాయి. రాబడి నిలకడగా ఉంటుంది. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఆరోగ్యానికి లోటుండదు. విదేశీ ఉద్యోగాలకు అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో దూర ప్రాంతాల నుంచి శుభ సమాచారం అందుకుంటారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. రాజకీయంగా పలుకుబడి పెరిగే సూచనలున్నాయి. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఈ రాశివారికి రోజంతా సంతృప్తికరంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా పని ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తాయి. ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరి ష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయానికి లోటుండదు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు తగ్గట్టుగా రాబడి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా, సంతృప్తికరంగా పూర్తవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఉద్యోగ జీవితంలో కొద్దిగా ఒడిదుడుకులు ఎదురు కావచ్చు. ఎవరితోనైనా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చాలావరకు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఒకటి రెండు సమస్యలు, వివాదాలు పరిష్కారం అవుతాయి. ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వ్యక్తి గత సమస్యలు బాగా తగ్గిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభ సమాచారం అందుతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
రోజంతా సంతృప్తికరంగా, అనుకూలంగా సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. కొందరు బంధు మిత్రులను ఆర్థికంగా ఆదుకోవడం కూడా జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిపాటి శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. లక్ష్యాలు, బాధ్యతలు కాస్తంత ఎక్కువగా ఉంటాయి. వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రోజులో ఎక్కువ భాగం అనుకూలంగానే గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యానికి లోటుండదు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.