AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raja Yoga: కర్కాటక రవితో ఆ రాశుల వారికి రాజయోగం.. వారికి ఆకస్మిక ధన లాభాలు పక్కా..!

ఈ నెల 16 నుంచి రవి గ్రహం తనకు అత్యంత అనుకూలమైన కర్కాటక రాశిలో సంచారం ప్రారంభించడం జరుగుతోంది. ఆగస్టు 16 వరకు ఇదే రాశిలో కొనసాగబోతున్న రవి వల్ల కొన్ని రాశుల వారికి రాజయోగాలు, విపరీత రాజయోగాలు పట్టే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉన్నవారు ఒక వెలుగు వెలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారి కలలు సాకారం అవుతాయి.

Raja Yoga: కర్కాటక రవితో ఆ రాశుల వారికి రాజయోగం.. వారికి ఆకస్మిక ధన లాభాలు పక్కా..!
Raja Yoga
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 11, 2024 | 6:50 PM

Share

ఈ నెల 16 నుంచి రవి గ్రహం తనకు అత్యంత అనుకూలమైన కర్కాటక రాశిలో సంచారం ప్రారంభించడం జరుగుతోంది. ఆగస్టు 16 వరకు ఇదే రాశిలో కొనసాగబోతున్న రవి వల్ల కొన్ని రాశుల వారికి రాజయోగాలు, విపరీత రాజయోగాలు పట్టే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉన్నవారు ఒక వెలుగు వెలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారి కలలు సాకారం అవుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు లభిస్తాయి. ఆదాయపరంగా తప్పకుండా స్థిరత్వం లభిస్తుంది. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తులా రాశుల వారు రవి రాశి మార్పు వల్ల అత్యధికంగా రాజయోగాలు అనుభవించడం జరుగుతుంది.

  1. మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రవి సంచారం వల్ల ఉద్యోగంలో ఆకస్మిక పదవీ యోగానికి, ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకుంటున్నవారి కలలు సాకారం అవుతాయి. రాజకీయంగా ప్రాధాన్యం పెరుగుతుంది. విదేశీ యానానికి అవకాశాలు మెరుగుపడతాయి. తండ్రి వైపు నుంచి సంపద లభించే అవకాశం ఉంది.
  2. వృషభం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో రవి సంచారం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. మనసులోని కోరికల్లో అత్యధిక భాగం నెరవేరుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అయి, విలువైన ఆస్తి సంక్రమిస్తుంది. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలే కాకుండా, పెళ్లి ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.
  3. మిథునం: ఈ రాశికి ధన స్థానంలో రవి సంచారం వల్ల ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. ప్రభుత్వమూలక ధన లాభం, గౌరవమర్యాదలు లభిస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అను కూలంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అప్రయ త్నంగా పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు చోటు చేసుకుంటాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆశించిన శుభవార్తలు వింటారు.
  4. కర్కాటకం: ఈ రాశికి అత్యంత శుభుడైన రవి ఇదే రాశిలో ప్రవేశించడం వల్ల తప్పకుండా రాజయోగం పడు తుంది. దాదాపు ప్రతి పనీ, ప్రతి ప్రయత్నం సునాయాసంగా నెరవేరుతాయి. ఎక్కడికి వెళ్లినా, ఎవరిని కలిసినా గౌరవ మర్యాదలు లభిస్తాయి. ప్రభుత్వపరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. అనేక మార్గాలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులు బాగా వృద్ధిలోకి వస్తారు.
  5. కన్య: ఈ రాశికి లాభ స్థానంలో రవి సంచారం వల్ల ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. పట్టిం దల్లా బంగారం అవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో, రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో పాటు పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని అవ కాశాలు అంది వస్తాయి. ఉద్యోగులకు కూడా డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  6. తుల: ఈ రాశికి దశమ స్థానంలో రవి ప్రవేశం వల్ల ఈ రాశివారికి దిగ్బల యోగం పట్టింది. ఉద్యోగ విష యాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. రాజకీయ ప్రముఖులతో లేదా ఉన్నతాధికారులతో పరి చయాలు ఏర్పడతాయి. సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది. ఉద్యో గంలో తప్పకుండా ఉన్నత స్థానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థిరత్వం లభి స్తుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు సైతం అంది వస్తాయి. విదేశీయానానికి అవకాశం ఉంది.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్