Zodiac Signs: శుభ గ్రహాల సానుకూలత.. ఈ రాశుల వారు కొత్త ప్రయత్నాలతో సఫలం..!
సాధారణంగా గ్రహ సంచారంలో గ్రహాలు ఉచ్ఛపట్టినా, మిత్ర క్షేత్రాల్లో సంచారం చేస్తున్నా అవి జాతకులకు మార్గదర్శనం చేస్తున్నాయని, ఎటు వెడితే లాభం ఉంటుందో చెబుతున్నాయని అర్థం. ప్రస్తుతం శుక్ర, రవులు ఉచ్ఛ స్థితిలో ఉన్నాయి. శనీశ్వరుడు స్వక్షేత్రంలో, గురువు మిత్ర క్షేత్రంలో సంచారం చేస్తున్నారు.
సాధారణంగా గ్రహ సంచారంలో గ్రహాలు ఉచ్ఛపట్టినా, మిత్ర క్షేత్రాల్లో సంచారం చేస్తున్నా అవి జాతకులకు మార్గదర్శనం చేస్తున్నాయని, ఎటు వెడితే లాభం ఉంటుందో చెబుతున్నాయని అర్థం. ప్రస్తుతం శుక్ర, రవులు ఉచ్ఛ స్థితిలో ఉన్నాయి. శనీశ్వరుడు స్వక్షేత్రంలో, గురువు మిత్ర క్షేత్రంలో సంచారం చేస్తున్నారు. ఈ గ్రహాల అనుకూల స్థితిగతులను బట్టి కొన్ని రాశులకు మార్గ దర్శనం లభించే అవకాశముంది. ముఖ్యంగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, ధనూ రాశివారికి ఈ గ్రహాల వల్ల కొత్త మార్గం ఏర్పడడం జరుగుతుంది. ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, ఏ విషయంలో లబ్ధి పొందబోతున్నారన్నది తెలుస్తుంది.
- మేషం: ఈ రాశివారికి ప్రస్తుతం లాభ స్థానంలో శని, రాశ్యధిపతి కుజుడు, మొదటి స్థానంలో ఉచ్ఛ రవి ఉండడం వంటి కారణాల వల్ల ఉద్యోగ మూలకంగానే పురోగతికి, అభివృద్ధికి, పేరు ప్రఖ్యాతులకు, ఆదాయ వృద్ధికి అవకాశముంటుంది. ఉద్యోగం మారడానికి ఇది అనుకూలమైన సమయం. నిరు ద్యోగులు స్వదేశంలోని కంపెనీలతో పాటు, విదేశీ కంపెనీలకు కూడా దరఖాస్తులు చేసుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటు మార్పులు చేపట్టడం వల్ల లాభాలు పెరగడం జరుగుతుంది.
- వృషభం: ఈ రాశివారికి రాశ్యధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉచ్ఛపట్టి ఉండడం వల్ల ఆదాయ మార్గాలను పెంచుకోవడం మీదా, అవసరమైతే మీ శ్రమను ఎక్కువ చేయడం మీదా దృష్టి పెట్టడం మంచిది. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రతిభా పాటవాలకు, నైపుణ్యాలకు మరింతగా పదును పెట్టడం వల్ల ఆర్థిక పురోగతి సాధ్యమవుతుంది. ఆస్తి వివాదాలను పరిష్కరించుకోవడానికి ఇదే సరైన సమయం. ఖర్చులను తగ్గించుకోవడం అవసరం.
- మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో గురువు, ఉచ్ఛ రవి యుతి చెందడం, దశమ స్థానంలో శుక్రుడు ఉచ్ఛ పట్టి ఉండడం వల్ల, ప్రభుత్వ ఉద్యోగాలకు గట్టి ప్రయత్నం చేయడం మంచిది. రాజకీయాల్లో చేరాలనుకుంటున్నవారికి కూడా ఇది చాలా అనుకూల సమయం. ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షలకు సిద్ధం కావడం మంచిది. వీటికి కొద్ది సమయం కేటాయించినా అధిక ఫలం పొందుతారు. ఉద్యో గంలో ప్రతిభా పాటవాలు, కొత్త నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది.
- కర్కాటకం: ఈ రాశివారికి దశమ స్థానంలో రవి, గురువులు, భాగ్య స్థానంలో శుక్రుడు బాగా అనుకూలంగా ఉండడం వల్ల, వృత్తి, ఉద్యోగాల మీద బాగా దృష్టి కేంద్రీకరించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వీటి మీద మరింత శ్రద్ధ పెట్టడం వల్ల పదోన్నతులకు, గుర్తింపునకు, తద్వారా ఆర్థిక లాభానికి అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో, ధైర్య సాహసాలతో, చొరవతో క్రియాశీలంగా వ్యవహ రించాల్సిన అవసరం ఉంది. ఎంతగా శ్రద్ధ పెంచితే జీవితంలో అంతగా స్థిరపడే అవకాశం ఉంది.
- సింహం: ఈ రాశినాథుడైన రవి భాగ్య స్థానంలో ఉచ్ఛపట్టడం, సప్తమ స్థానంలో శనీశ్వరుడు స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశికి చెందిన నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నం చేయడం మంచిది. ఉన్నత స్థాయి పోటీ పరీక్షలకు, ఇంటర్వ్యూలకు సిద్ధం కావడం వల్ల ప్రయో జనం ఉంటుంది. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవారు రాజకీయాల వైపు మళ్లడం ఉత్తమం. నిరుద్యోగులు విదేశీ అవకాశాలకు ప్రయత్నించడం వల్ల ఆశించిన ఫలితాలు పొందే అవకాశముంది.
- ధనుస్సు: ఈ రాశివారికి తృతీయ స్థానంలో శనీశ్వరుడి స్వక్షేత్ర సంచారం, నాలుగవ స్థానంలో శుక్రుడి ఉచ్ఛ స్థితి, పంచమంలో రాశ్యధిపతి గురువుతో ఉచ్ఛ రవి యుతి వగైరాల వల్ల రాజకీయపరంగా లేదా వాణిజ్యపరంగా ప్రయత్నాలు చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. విదేశీ అవకాశాలు తేలికగా అంది వస్తాయి. ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు, లావాదేవీలు కూడా బాగా అనుకూలిస్తాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. కొద్ది ప్రయత్నంతో ఏదైనా సాధిస్తారు.