Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి వారు బయటపడతారు..12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20, 2024 వరకు): శుభ గ్రహాలు ఎక్కువ భాగం మేష రాశికి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ వారమంతా అనుకూలంగా, ఆశాజనకంగా సాగిపోతుంది. వృషభ రాశి వారు ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. మిథున రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి, అప్రయత్న ధన లాభానికి అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి వారు బయటపడతారు..12 రాశుల వారికి వారఫలాలు
Weekly Horoscope 14 April 20 April 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 14, 2024 | 5:01 AM

వార ఫలాలు (ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20, 2024 వరకు): శుభ గ్రహాలు ఎక్కువ భాగం మేష రాశికి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ వారమంతా అనుకూలంగా, ఆశాజనకంగా సాగిపోతుంది. వృషభ రాశి వారు ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. మిథున రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి, అప్రయత్న ధన లాభానికి అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

శుభ గ్రహాలలో ఎక్కువ భాగం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా అనుకూలంగా, ఆశాజనకంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. జీవితంలో ఒకటి రెండు ముఖ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. వృత్తి జీవితం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేసి కొత్త పుంతులు తొక్కిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాల్లో ఎక్కడా తొందరపాటుతనంతో వ్యవహరించవద్దు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే సమస్యలు, ఒత్తిళ్ల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఈ రాశివారికి కెరీర్ పరంగా, ఆదాయపరంగా సమయం బాగా కలిసి వస్తుంది. ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు ప్రయత్నించడం మంచిది. కొద్ది శ్రమతో ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. వ్యయ ప్రయాసలున్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను, పెండింగు పనులను పూర్తి చేయగలు గుతారు. కొందరు బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందజేస్తారు. సామాజికంగా పలుకు బడి పెరుగుతుంది. మాటకు విలువ ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవలసిన అవసరం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగు తుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

లాభ స్థానంలో గురువు, ఉచ్ఛ రవి ఉన్నందువల్ల ఏ విధంగా చూసినా ప్రాభవం పెరుగుతుంది. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి, అప్రయత్న ధన లాభానికి అవకాశముంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ వల్ల అధికారులు అత్యధికంగా ప్రయోజనం పొందుతారు. నిరుద్యోగుల సమస్య చాలావరకు పరిష్కారం అవుతుంది. ఉద్యోగులు ఉద్యోగం మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకటి రెండు వ్యక్తిగత, కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఆదాయ పరిస్థితి మెరుగ్గా ఉన్నందువల్ల విలాస జీవితం మీద ఎక్కువగా ఖర్చు పెట్టే సూచనలున్నాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

అష్టమ శని ప్రభావం కొద్దిగా ఉన్నప్పటికీ, భాగ్య స్థానంలో ఉచ్ఛ శుక్రుడు, దశమ స్థానంలో ఉచ్ఛ రవి ఉన్నందువల్ల వారమంతా చాలావరకు సానుకూలంగానే గడిచిపోతుంది. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశముంది. వృత్తి జీవితం ఆదాయపరంగా ఊపందుకుం టుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగులు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవ కాశముంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఉద్యోగపరమైన ఏ ప్రయత్నమైనా నెరవేరుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శించడం, ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకోవడం జరుగుతుంది. విహార యాత్రలకు కూడా అవకాశముంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

రాశ్యధిపతి రవి భాగ్య స్థానంలో ఉచ్ఛపట్టడం, దానితో గురువు కలిసి ఉండడం వల్ల తప్పకుండా మహా భాగ్య యోగం కలుగుతుంది. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఊహించని విధంగా గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభాల పరంగా ముందుకు దూసుకుపోతాయి. వృత్తి, వ్యాపారాలను విస్తరించుకునే సూచన లున్నాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. రాజకీయంగా ప్రాధాన్యం పెరుగుతుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా జీవితం ఒక కీలకమైన మలుపు తిరుగుతుంది. అనుకోకుండా కొన్ని వివాదాలు, సమస్యలు పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామికి కూడా అదృష్ట యోగం పట్టే సూచనలున్నాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

సప్తమ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టి ఉండడం, ఆరవ స్థానంలో శని సంచారం ఈ రాశివారికి యోగ దాయకంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవ కాశం కూడా ఉంది. ఆస్తి వివాదం, కోర్టు సమస్య సానుకూలంగా పరిష్కారం కావచ్చు. ప్రభుత్వ పరంగా లబ్ధి పొందడం కూడా జరుగుతుంది. ఆదాయం పెరగడం వల్ల కుటుంబ సభ్యుల మీద భారీగా ఖర్చు చేస్తారు. కుటుంబపరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత సమస్య లకు పరిష్కారం లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగినప్పటికీ, సానుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆహార విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

శుభ గ్రహాల స్థితిగతులు అనుకూలంగా ఉండడం వల్ల ఈ వారమంతా రాజయోగంగా గడిచి పోతుంది. ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది. అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉండడంతో ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మనసులోని కోరికలు నెర వేరుతాయి. బంధుమిత్రుల నుంచి కావలసిన సహాయం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయటపడతారు. ఉద్యోగంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. లాభాల విష యంలో వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. గౌరవనీయ వ్యక్తులతో పరిచయాలు విస్తరి స్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది. విదేశాల నుంచి ఆహ్వానాలు అందే సూచనలు న్నాయి.

వృ‌శ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ, పంచమ స్థానంలో శుక్రుడు ఉచ్ఛలో ఉండడం వల్ల వార మంతా చాలావరకు ప్రశాంతంగా సాగిపోతుంది. ముఖ్యంగా అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు, శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా ముందుకు దూసుకుపోతాయి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇతరులకు వాగ్దానాలు చేయడానికి, హామీలు ఉండడానికి ఇది సమయం కాదు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశముంది. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితిని అనుకూలం చేసుకుంటారు. రావలసిన డబ్బును, బాకీలను వసూలు చేసుకోవడం వల్ల ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. కీలక విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలను కూడా తీసుకోవడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

శుభ గ్రహాలతో పాటు, శనీశ్వరుడి అనుగ్రహం కూడా కలిసి వచ్చినందువల్ల వారమంతా చీకూ చింతా లేకుండా గడిచిపోతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. విదేశాల నుంచి కూడా సానుకూల సమాచారం అందుకుంటారు. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. బంధుమిత్రుల్లో కొందరికి సహాయం చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశముంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

శని, శుక్రుల అనుకూలతల కారణంగా ఆర్థిక పరిస్థితి బాగా చక్కబడుతుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. అధికారులకు అండగా నిలబడతారు. ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అయ్యే సూచనలున్నాయి. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు, ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలను విస్తరించుకోవడంపై దృష్టి పెడతారు. ఇష్టమైన బంధుమిత్రులతో ఒక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్య క్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉంది. కొందరు స్నేహితుల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆశించిన శుభ వార్తలు వినడం జరుగుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఏలిన్నాటి శని కారణంగా వృత్తి, ఉద్యోగాల్లోనూ, కుటుంబంలోనూ బరువు బాధ్యతలు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు తగ్గట్టుగానే రాబడి కూడా పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయట పడతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సామాజిక సహాయ కార్యక్రమాల్లో పాల్గొం టారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశముంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. గౌరవ మర్యాదలు, పలుకుబడి పెరుగుతాయి. కుటుంబసమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. ఇష్టమైన బంధుమిత్రుల రాకపోకలుంటాయి. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రాశిలో శుక్రుడు ఉచ్ఛపట్టడం, ధన స్థానంలో రాశ్యధిపతి గురువుతో ఉచ్ఛ రవి యుతి చెందడం వంటి పరిణామాల వల్ల వారమంతా వైభవంగా గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అన్ని విధాలు గానూ ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అంది వస్తాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయ త్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

Latest Articles
టీ 20 ప్రపంచకప్.. టీమిండియాకు బిగ్ షాక్.. కింగ్ కోహ్లీకి గాయం!
టీ 20 ప్రపంచకప్.. టీమిండియాకు బిగ్ షాక్.. కింగ్ కోహ్లీకి గాయం!
లో బడ్జెట్ హీరోను పెట్టి.. ఓ హై బడ్జెట్ సినిమా తీయ్యోచు..
లో బడ్జెట్ హీరోను పెట్టి.. ఓ హై బడ్జెట్ సినిమా తీయ్యోచు..
పొట్ట గుట్టలా మారిందని బాధపడుతున్నారా..? ఈ సింపుల్ టిప్స్‌తో..
పొట్ట గుట్టలా మారిందని బాధపడుతున్నారా..? ఈ సింపుల్ టిప్స్‌తో..
మంచుకొండల్లో ముద్దగుమ్మ..
మంచుకొండల్లో ముద్దగుమ్మ..
ప్రయాణికుడి లంచ్‌బాక్స్‌లో ఆహారాన్ని చూసి షాక్‌.. రూ.5 లక్షల ఫైన్
ప్రయాణికుడి లంచ్‌బాక్స్‌లో ఆహారాన్ని చూసి షాక్‌.. రూ.5 లక్షల ఫైన్
ఉత్తరాది ఓటర్లను ప్రభావితం చేసేందుకే అమిత్ షా వ్యాఖ్యలు: సజ్జల
ఉత్తరాది ఓటర్లను ప్రభావితం చేసేందుకే అమిత్ షా వ్యాఖ్యలు: సజ్జల
ఏ విటమిన్‌ లోపిస్తే మానసిక సమస్యలు తలెత్తుతాయో తెలుసా?
ఏ విటమిన్‌ లోపిస్తే మానసిక సమస్యలు తలెత్తుతాయో తెలుసా?
ఓటీటీలో దూసుకెళ్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ..ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలో దూసుకెళ్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ..ఎక్కడ చూడొచ్చంటే?
తరచూ అలసటగా, తలతిరుగుతున్నట్లు అనిపిస్తుందా?
తరచూ అలసటగా, తలతిరుగుతున్నట్లు అనిపిస్తుందా?
అందుకే సోనియాను ఆహ్వానించాం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
అందుకే సోనియాను ఆహ్వానించాం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కావ్య మారన్ కన్నీళ్లు చూసి బిగ్ బీ ఆవేదన!
కావ్య మారన్ కన్నీళ్లు చూసి బిగ్ బీ ఆవేదన!
విశ్వక్ అండగా బాలయ్య ఉండగా భయమెలా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్.
విశ్వక్ అండగా బాలయ్య ఉండగా భయమెలా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్.
గుండెలదిరే విక్టోరియా ఫాల్స్‌లో మహిళా వీడియో వైరల్‌.!
గుండెలదిరే విక్టోరియా ఫాల్స్‌లో మహిళా వీడియో వైరల్‌.!
బ్రహ్మంగారు చెప్పినట్టే.. వేపచెట్టుకు మామిడికాయలు.. వీడియో.
బ్రహ్మంగారు చెప్పినట్టే.. వేపచెట్టుకు మామిడికాయలు.. వీడియో.
ఓటు వేసేందుకు రక్షణ కావాలని ఎన్నికల సంఘానికి ఓ కుటుంబం విజ్ఞప్తి.
ఓటు వేసేందుకు రక్షణ కావాలని ఎన్నికల సంఘానికి ఓ కుటుంబం విజ్ఞప్తి.
మహేష్‌బాబు పుత్రోత్సాహం.. విదేశాల్లో గౌతమ్ ఉన్నత విద్యాభ్యాసం.
మహేష్‌బాబు పుత్రోత్సాహం.. విదేశాల్లో గౌతమ్ ఉన్నత విద్యాభ్యాసం.
మోదీ వచ్చారు,హోటల్ లో బస చేసి వెళ్లారు,మరి బిల్లు ఎప్పుడు కడతారు?
మోదీ వచ్చారు,హోటల్ లో బస చేసి వెళ్లారు,మరి బిల్లు ఎప్పుడు కడతారు?
అధిక వడ్డీ ఆశ చూపి.. రూ.2 కోట్లతో ఉడాయించిన పూజారి..
అధిక వడ్డీ ఆశ చూపి.. రూ.2 కోట్లతో ఉడాయించిన పూజారి..
ఏ శక్తీ తమను ఆపలేదన్న ఇజ్రాయెల్.. ఇజ్రాయెల్‌కు ఐసీజే ఆదేశం.
ఏ శక్తీ తమను ఆపలేదన్న ఇజ్రాయెల్.. ఇజ్రాయెల్‌కు ఐసీజే ఆదేశం.
పోలీస్‌ స్టేషన్‌ లలో సీసీ కెమెరాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..
పోలీస్‌ స్టేషన్‌ లలో సీసీ కెమెరాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..