AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Shastra: ఇంట్లో వంటగది, టాయిలెట్ ఇలా ఉంటే కొంప మునిగినట్లేనా?.. దరిద్రాన్ని దూరం చేసే పవర్‌ఫుల్ ట్రిక్స్!

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఒక ఇంట్లోని 'వంటగది' టాయిలెట్ అనేవి ఆ ఇల్లాలు, ఇంటి యజమాని ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితిని శాసించే అత్యంత కీలకమైన విభాగాలు. వంటగది అగ్ని మూలకానికి ప్రతీక అయితే, టాయిలెట్ అనేది జల వ్యర్థాల మూలకానికి ప్రతీక. ప్రస్తుత ఆధునిక అపార్ట్‌మెంట్ సంస్కృతిలో స్థలభావన వల్ల చాలా ఇళ్లలో వంటగది పక్కనే లేదా దానికి ఎదురుగానే టాయిలెట్లు నిర్మిస్తున్నారు.

Vastu Shastra: ఇంట్లో వంటగది, టాయిలెట్ ఇలా ఉంటే కొంప మునిగినట్లేనా?.. దరిద్రాన్ని దూరం చేసే పవర్‌ఫుల్ ట్రిక్స్!
Kitchen And Toilet Vastu Defects
Bhavani
|

Updated on: Jul 09, 2026 | 4:30 PM

Share

వాస్తు ప్రకారం ఇంట్లో టాయిలెట్, వంటగది ఒకే దగ్గర ఉంటే ఇది అత్యంత తీవ్రమైన దోషంగా పరిగణించబడుతుంది. దీనివల్ల ఇంట్లో ఎప్పుడూ అనారోగ్యాలు, గొడవలు తీవ్రమైన ధన నష్టం సంభవిస్తుంటాయి. మరి ఇల్లు కూల్చకుండానే, కేవలం కొన్ని చిన్న చిన్న మార్పులు పరిహారాల ద్వారా ఈ వాస్తు దోషాల నుండి ఎలా విముక్తి పొందాలో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం.

1. వంటగది, టాయిలెట్ ఒకే గోడను పంచుకుంటే

చాలా ఇళ్లలో కిచెన్ ప్లాట్‌ఫారమ్ ఉన్న గోడకు అవతలి వైపునే టాయిలెట్ కమోడ్ లేదా బాత్రూమ్ ఉంటుంది. ఇది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని విపరీతంగా పెంచుతుంది.

పరిహారం: ఈ రెండు గదుల మధ్య ఉన్న ఉమ్మడి గోడకు కిచెన్ వైపు ఒక అద్దాన్ని లేదా రాగితో చేసిన వాస్తు వైర్ లేదా పిరమిడ్‌ను అమర్చడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ వంటగదిలోకి రాకుండా అడ్డుకోవచ్చు.

2. కిచెన్‌కు ఎదురుగా టాయిలెట్ ద్వారం ఉంటే

వంటగది తలుపుకు నేరుగా టాయిలెట్ తలుపు ఎదురుపడటం వల్ల వండే ఆహారంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

పరిహారం: టాయిలెట్ తలుపును ఎల్లప్పుడూ మూసి ఉంచాలి. సాధ్యమైతే ఆ తలుపుపై దట్టమైన తెరను వేయాలి. అలాగే టాయిలెట్ లోపల ఒక చిన్న గాజు గిన్నెలో ‘రాళ్ల ఉప్పు’ వేసి ఉంచాలి. ఈ ఉప్పు అక్కడి నెగిటివిటీని పీల్చుకుంటుంది. ఈ ఉప్పును వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి.

3. తప్పుడు దిశలో వంటగది ఉంటే

వంటగది ఎప్పుడూ ఆగ్నేయ మూలలో ఉండాలి. ఒకవేళ నైరుతి లేదా ఉత్తర దిశలో ఉంటే అది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దెబ్బతీస్తుంది.

పరిహారం: ఒకవేళ వంటగది తప్పుడు దిశలో ఉంటే, కిచెన్ ఆగ్నేయ మూలలో ఒక చిన్న ఎరుపు రంగు బల్బును రాత్రంతా వెలిగేలా ఉంచడం ద్వారా అగ్ని మూలకాన్ని బ్యాలెన్స్ చేయవచ్చు.

4. టాయిలెట్ ఈశాన్యంలో ఉంటే

ఇంటి ఈశాన్య మూల దైవ మూల. అక్కడ టాయిలెట్ ఉండటం అత్యంత ప్రమాదకరమైన వాస్తు దోషం. ఇది వంశ వృద్ధిని మరియు ఆర్థిక ఎదుగుదలను పూర్తిగా దెబ్బతీస్తుంది.

పరిహారం: ఈశాన్య మూలలో ఉన్న బాత్రూమ్‌ను వీలైనంత వరకు తక్కువగా వాడాలి. అందులో సహజసిద్ధమైన కర్పూరం బిళ్లలను ఒక గిన్నెలో ఉంచాలి. ఇది నెగిటివ్ ఎనర్జీని అణచివేస్తుంది. బాత్రూమ్ లోపల ఇండోర్ ప్లాంట్స్ (స్పైడర్ ప్లాంట్ లేదా స్నేక్ ప్లాంట్) ఉంచడం ద్వారా కూడా కొంతవరకు దోష తీవ్రతను తగ్గించవచ్చు.

ఇల్లు లేదా ఫ్లాట్‌ను మార్చలేని వారు ఈ చిన్న చిన్న నియమాలు పరిహారాలను పాటించడం ద్వారా ఇంట్లోని వాస్తు దోషాలను తొలగించుకుని, సకల ఐశ్వర్యాలను, ప్రశాంతతను పొందవచ్చు.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. పైన పేర్కొన్న వివరాలు సాంప్రదాయ వాస్తు గ్రంథాలు వాస్తు పండితుల నమ్మకాలు, విశ్లేషణల ప్రాతిపదికన అందించబడ్డాయి, దీనికి సంస్థ ఎలాంటి బాధ్యత వహించదు

Follow Us
దేశవ్యాప్తంగా విస్తరించిన రుతుపవనాలు.. తెలంగాణ వెదర్ రిపోర్ట్
దేశవ్యాప్తంగా విస్తరించిన రుతుపవనాలు.. తెలంగాణ వెదర్ రిపోర్ట్
ఇంట్లో ఈ వాస్తు దోషాలు ఉంటే ఎంత సంపాదించినా రూపాయి మిగలదు..
ఇంట్లో ఈ వాస్తు దోషాలు ఉంటే ఎంత సంపాదించినా రూపాయి మిగలదు..
కింగ్ కోబ్రాకు మేకోవర్ చేసిన హెయిర్ స్టైలిస్ట్
కింగ్ కోబ్రాకు మేకోవర్ చేసిన హెయిర్ స్టైలిస్ట్
మద్యం సేవించొద్దన్నందుకు..అర్ధరాత్రి పోలీస్‌ని చితకబాదిన NRI బాబు
మద్యం సేవించొద్దన్నందుకు..అర్ధరాత్రి పోలీస్‌ని చితకబాదిన NRI బాబు
భారీగా కుప్పకూలిన వెండి ధరలు.. ఒకేసారి ఎంతో తెలుసా..?
భారీగా కుప్పకూలిన వెండి ధరలు.. ఒకేసారి ఎంతో తెలుసా..?
ఆ హీరోయిన్ రోజూ మద్యం తాగేది.. చివరకు అలా చనిపోయింది
ఆ హీరోయిన్ రోజూ మద్యం తాగేది.. చివరకు అలా చనిపోయింది
ఇల్లు తుడిచే నీటిలో ఇదొక్కటి కలిపితే చాలు.. క్రిమికీటకాలు పరార్
ఇల్లు తుడిచే నీటిలో ఇదొక్కటి కలిపితే చాలు.. క్రిమికీటకాలు పరార్
ఏలినాటి శని ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. అసలు ఏం జరుగుతుందంటే?
ఏలినాటి శని ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. అసలు ఏం జరుగుతుందంటే?
టీ తాగుతున్నారా?.. జాగ్రత్త ఈ 6 విషయాలు తెలుసుకోకపోతే.. అంతే!
టీ తాగుతున్నారా?.. జాగ్రత్త ఈ 6 విషయాలు తెలుసుకోకపోతే.. అంతే!
సంజూ శాంసన్ కంబ్యాక్‌కు సిద్ధం.. జట్టులో చోటు దక్కేది ఎవరికో?
సంజూ శాంసన్ కంబ్యాక్‌కు సిద్ధం.. జట్టులో చోటు దక్కేది ఎవరికో?