గరుడ పురాణాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా? మరణం తర్వాతే చదవాలా? అసలు నిజం ఇదే!
09 July 2026
Rajashekher
అష్టాదశ పురాణాల్లో ఒకటైన గరుడ పురాణాన్ని వ్యాస మహర్షి రచించారు. శ్రీమహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతునికి బోధించిన వైష్ణవ పురాణంగా దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో సుమారు 18,000 శ్లోకాలు ఉన్నాయి.
గరుడ పురాణం విశిష్టత
మనిషి పుట్టుక నుంచి మరణం వరకు చేయాల్సిన కర్మలు, మరణానంతరం ఆత్మ ప్రయాణం, పాప–పుణ్యాల ఫలితాలు వంటి విషయాలను గరుడ పురాణం వివరంగా వివరిస్తుంది.
మరణం నుంచి మోక్షం వరకు వివరణ
ఇంట్లో ఎవరైనా మరణించిన తర్వాత 13 రోజుల పాటు గరుడ పురాణం పారాయణం చేసే ఆచారం ఉంది. అయితే అందుకే ఈ పురాణాన్ని ఆ సమయంలోనే చదవాలనే నియమం లేదని పండితులు చెబుతున్నారు.
మరణానంతరం మాత్రమే చదవాలనే..
గరుడ పురాణాన్ని ఇంట్లో ఉంచుకోవడం అశుభం అనే నమ్మకానికి శాస్త్రాధారం లేదని ఆధ్యాత్మిక పండితులు స్పష్టం చేస్తున్నారు. ఇతర పురాణాల మాదిరిగానే దీనిని కూడా ఇంట్లో ఉంచుకుని చదవవచ్చు.
ఇంట్లో ఉంచుకోవచ్చా?
బ్రహ్మహత్య, గోహత్య, శిశుహత్య, స్త్రీహత్య, గురువులను, దేవతలను అవమానించడం, దొంగతనం, మోసం వంటి అనేక పాపకర్మలకు తీవ్రమైన ఫలితాలు ఉంటాయని గరుడ పురాణం చెబుతుంది.
పాపకర్మలపై హెచ్చరికలు
తల్లిదండ్రులను, గురువులను అవమానించడం, దానం విషయంలో మోసం చేయడం, పరుల ఆస్తి ఆక్రమించడం, పశుహత్య వంటి పాపాలు చేసినవారు యమలోకంలోని వైతరణి నదిని దాటి నరకబాధలు అనుభవించాల్సిందేనని పేర్కొంటుంది.
వైతరణి నది ప్రస్తావన
అబద్ధపు సాక్ష్యం చెప్పడం, వంచనతో ధనం సంపాదించడం, పచ్చని చెట్లు నరికివేయడం, పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారికి ఆటంకం కలిగించడం వంటి పనులు కూడా పాపాలేనని గరుడ పురాణం హెచ్చరిస్తుంది.
నిత్యజీవితంలో పాటించాల్సిన నీతి
గరుడ పురాణం ఉద్దేశం ప్రజలను భయపెట్టడం కాదు. పాప–పుణ్యాల ఫలితాలను తెలియజేసి మనిషిని సత్యం, ధర్మం, నైతిక విలువల మార్గంలో నడిపించడమే దీని ప్రధాన సందేశం.
భయం కాదు... ధర్మబోధ
ఏది తప్పు, ఏది ఒప్పు అనే విషయాలను తెలుసుకుని సన్మార్గంలో జీవించేందుకు గరుడ పురాణం ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే దీనిని ప్రతి ఒక్కరూ నిరభ్యంతరంగా చదవాలని, ఇంట్లో ఉంచుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు.