Shukra Gochar: మకర రాశిలోకి శుక్రుడు.. ఆర్థిక విషయాల్లో వారికి మిశ్రమ ఫలితాలు..!

డిసెంబర్ 2 నుంచి శుక్రుడు మకర రాశిలో సంచారం సాగించడం వల్ల కొన్ని రాశులకు అత్యధికంగా శుభ యోగాలు కలిగే అవకాశం ఉన్నప్పటికీ, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. శుక్రుడు సాధారణంగా ప్రతికూల ఫలితాలను, అశుభ ఫలితాలను ఇవ్వడం జరగదు. ఆర్థిక విషయాల్లో ఒక్కో రాశికి ఒక్కో రకమైన మిశ్ర ఫలితాలు ఉండనున్నాయి.

Shukra Gochar: మకర రాశిలోకి శుక్రుడు.. ఆర్థిక విషయాల్లో వారికి మిశ్రమ ఫలితాలు..!
Money Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 29, 2024 | 1:53 PM

డిసెంబర్ 2 నుంచి శుక్రుడు మకర రాశిలో సంచారం సాగించడం వల్ల కొన్ని రాశులకు అత్యధికంగా శుభ యోగాలు కలిగే అవకాశం ఉన్నప్పటికీ, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. శుక్రుడు సాధారణంగా ప్రతికూల ఫలితాలను, అశుభ ఫలితాలను ఇవ్వడం జరగదు. శుక్రుడు ఏదో విధంగా సుఖపెట్టడమే జరుగుతుంది తప్ప కష్టపెట్టడం ఉండదు. ఈ నెల 28 వరకు మకర రాశిలో సంచారం చేసే శుక్రుడు మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, కుంభం, మీన రాశులకు మిశ్రమ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. మీరీ ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఒక్కో రాశి వారు ఒక్కో రకమైన ఫలితాలను పొందనున్నారు.

  1. మిథునం: ఈ రాశికి అష్టమ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. మాటకు విలువ పెరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ ఆశించిన ఫలితాలనిస్తాయి. కుటుంబంలో సంతోషాలు వృద్ధి చెందుతాయి. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. అయితే, అనవసర స్నేహాల వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. అనాలోచితంగా డబ్బును ఖర్చు చేయడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలకు కాస్తంత దూరంగా ఉండడం మంచిది.
  2. కర్కాటకం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్ర సంచారం వల్ల జీవిత భాగస్వామితో సానుకూలతలు, అన్యోన్యత బాగా పెరుగుతాయి. విలాస జీవితం అలవడుతుంది. ఉద్యోగంలో హోదా పెరగడంతో పాటు, పని భారం నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అప్రయత్న ధన లాభం ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అయితే, అనవసర పరిచయాలు, అక్రమ సంబంధాలు ఏర్పడవచ్చు. కొందరు మిత్రులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో సమస్యలు తలెత్తుతాయి.
  3. సింహం: ఈ రాశికి ఆరవ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగి పోతుంది. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు అందుతాయి. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. అయితే, కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అయ్యే అవకాశం ఉంది. కొందరు బంధువులతో అకారణ విభేదాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల్లో చిక్కులు కలుగుతాయి.
  4. వృశ్చికం: ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా ఫలి స్తాయి. అయితే, ఆత్మవిశ్వాసం బాగా తగ్గే అవకాశం ఉంది. బంధువర్గంలో ఒకటి రెండు అవమానాలను, అపజయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గృహ ప్రయత్నాలకు ఆటంకాలు కలుగుతాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. కుంభం: ఈ రాశికి వ్యయ స్థానంలో శుక్ర సంచారం వల్ల దాంపత్య జీవితంలోని సమస్యలు తొలగిపోయి, అన్యోన్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని భారం, ఒత్తిడి నుంచి దాదాపు పూర్తిగా ఉపశమనం కలుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొందరు బంధుమిత్రులతో మనస్పర్థలు కలుగుతాయి. ఒకటి రెండు దుర్వార్తలు వినాల్సివస్తుంది.
  7. మీనం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర సంచారం వల్ల ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడ తాయి. కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అయితే, అనారోగ్యాలు ఇబ్బంది కలిగిస్తాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు లభించకపోవచ్చు. ఉద్యోగంలో సమస్యలు తలెత్తుతాయి.