Lunar Eclipse Horoscope: పాక్షిక చంద్ర గ్రహణంతో ఆ రాశుల వారికి శుభ యోగం! మీ రాశికి ఎలా ఉందంటే..?
ఈ నెల 25, 26 తేదీల్లో మీన రాశిలో ఉన్న రవితో రాహువు కలవడం, కన్యారాశిలో ఉన్న చంద్రుడితో కేతువు కలవడం వల్ల కొద్దిపాటి గ్రహణ ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది. ఈ పాక్షిక గ్రహణం వల్ల కొన్ని రాశులకు నష్టం, మరికొన్ని రాశులకు లాభం చేకూరే సూచనలున్నాయి. నష్టమంటే మానసిక అలజడి, ఆందోళన, పిరికితనం, ఆత్మస్థయిర్యం లోపించడం, ఏ ప్రయత్నం తలపెట్టినా విఫలం కావడం వంటివి.
ఈ నెల 25, 26 తేదీల్లో మీన రాశిలో ఉన్న రవితో రాహువు కలవడం, కన్యారాశిలో ఉన్న చంద్రుడితో కేతువు కలవడం వల్ల కొద్దిపాటి గ్రహణ ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది. ఈ పాక్షిక గ్రహణం వల్ల కొన్ని రాశులకు నష్టం, మరికొన్ని రాశులకు లాభం చేకూరే సూచనలున్నాయి. నష్టమంటే మానసిక అలజడి, ఆందోళన, పిరికితనం, ఆత్మస్థయిర్యం లోపించడం, ఏ ప్రయత్నం తలపెట్టినా విఫలం కావడం వంటివి. ఈ సమయంలో కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడం, కొత్త ప్రయత్నాలు తలపెట్టకపోవడం, ఒప్పందాలు కుదర్చుకోకపోవడం మంచిది. లాభమంటే, ఆకస్మిక ధన లాభం, ఆకస్మిక శుభ పరిణామాలు, సమస్యల పరిష్కారం కావడం వంటివి. గ్రహణం పట్టేది 25 వ తేదీనే అయినప్పటికీ దీని ప్రభావం మాత్రం 24, 25, 26 తేదీల్లో మూడు రోజుల పాటు ఉంటుంది. లాభం కలిగే రాశులివిః మేషం, వృషభం, మిథునం, తుల, వృశ్చికం, మకరం.
- మేషం: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. శత్రువుల నుంచి కూడా లబ్ధి పొందడం జరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఈ మూడు రోజుల సమ యంలో తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఖర్చులు తగ్గిపోతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయ త్నాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలు తొలగి పోతాయి.
- వృషభం: ఈ రాశికి గ్రహణం బాగా అనుకూలంగా ఉండబోతోంది. ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయిపోయి, లాభాల బాటపడతాయి. ఉద్యోగాల్లో జీతభత్యాలే కాకుండా, అదనపు రాబడి కూడా బాగా పెరిగే సూచనలున్నాయి. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబపరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తల్లితండ్రుల నుంచి లేదా జ్యేష్ట సోదరుల నుంచి బాగా కలిసి వస్తుంది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.
- మిథునం: ఈ రాశివారి మీద కూడా గ్రహణ ప్రభావం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదాతో పాటు ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయి, ఆర్థి కంగా ఆశించిన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యో గులు మంచి ఉద్యోగంలో చేరతారు. మరింత మంచి ఉద్యోగంలోకి ఉద్యోగులు మారే అవకాశం ఉంది.
- తుల: ఈ రాశికి గ్రహణ ప్రభావం వల్ల విపరీత రాజయోగం పడుతుంది. రాజకీయ ప్రముఖులతో పరి చయాలు విస్తరిస్తాయి. రాజకీయాల్లో లేదా ప్రజా సంబంధమైన వృత్తుల్లో ఉన్నవారికి ప్రాభవం పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. సంపద వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమ స్యల నుంచి, దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి చాలవరకు విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఈ రాశివారికి మాటకు, చేతకు తిరుగుండదు.
- వృశ్చికం: ఈ రాశివారి ప్రతిభా పాటవాలు బాగా రాణిస్తాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రతి ప్రయత్నమూ కలిసి వస్తుంది. ప్రముఖులతో స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాల నుంచి బయటపడి, లాభాల బాట పట్టడం జరుగుతుంది. ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా మారుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీలో ఆశించిన ఉద్యోగం లభి స్తుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
- మకరం: ఈ రాశికి గ్రహణ ప్రభావం వల్ల రాజయోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశముంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అంది వస్తాయి. ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేసేవారికి సమయం అనుకూలంగా ఉంది. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.