Lord Shani Dev: ఆ రాశుల వారికి శనీశ్వరుడు అనుకూలం.. ప్రత్యేక యోగం కోసం చేయాల్సిన పరిహారాలు ఇవే..!

ప్రస్తుతం శని, రవులు కుంభ రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ రెండు గ్రహాలూ శతభిషం నక్షత్రం లోనే, అంటే ఒకే డిగ్రీలో సంచారం చేస్తున్నందువల్ల శని అస్తంగతుడు (మాడిపోవడం) జరుగుతుంది. ఇప్పటికే శని దోషం అనుభవిస్తున్న ఆరు రాశుల వారికి శని అస్తంగత్వ దోషం శుభ యోగం కలిగిస్తుందా లేక అవయోగం కలిగిస్తుందా అన్నది పరిశీలించాల్సి ఉంటుంది.

Lord Shani Dev: ఆ రాశుల వారికి శనీశ్వరుడు అనుకూలం.. ప్రత్యేక యోగం కోసం చేయాల్సిన పరిహారాలు ఇవే..!
Lord Shani Dev
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 26, 2024 | 6:37 PM

ప్రస్తుతం శని, రవులు కుంభ రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ రెండు గ్రహాలూ శతభిషం నక్షత్రం లోనే, అంటే ఒకే డిగ్రీలో సంచారం చేస్తున్నందువల్ల శని అస్తంగతుడు (మాడిపోవడం) జరుగుతుంది. ఇప్పటికే శని దోషం అనుభవిస్తున్న ఆరు రాశుల వారికి శని అస్తంగత్వ దోషం శుభ యోగం కలిగిస్తుందా లేక అవయోగం కలిగిస్తుందా అన్నది పరిశీలించాల్సి ఉంటుంది. శని తన స్వస్థానంలో అస్తంగత్వం చెందుతున్నందువల్ల ఎక్కువగా చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉండదు. సాధారణంగా మిశ్రమ ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో రాశికి ఒక్కో విధమైన యోగాలు, అవయోగాలు కలగజేస్తాడు. ఈ ఆరు రాశులుః కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం, మీనం. ఈ పరిస్థితి మరో నెల రోజుల పాటు కొనసాగుతుంది.

  1. కర్కాటకం: ఈ రాశివారికి అష్టమ శని నడుస్తున్నందువల్ల శని అస్తంగత్వ దోష ప్రభావం బాగా తగ్గే అవకాశం ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా దానికి దీటుగా పెరగడం జరు గుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల నుంచి రావలసిన బకాయిలు వసూలవుతాయి. మొండి బాకీలు కూడా చేతికి అందుతాయి. పెన్షన్, బీమా వంటివి పరిష్కారం అవుతాయి. అయితే, వాహన ప్రమాదాలు, విద్యుదాఘాతాలతో జాగ్రత్తగా ఉండడం మంచిది.
  2. సింహం: ఈ రాశికి సప్తమంలో సంచరిస్తున్న శని ప్రస్తుతం అస్తంగతుడైనందువల్ల శ్రమ, ఒత్తిడి బాగా తగ్గు ముఖం పడతాయి. పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. రాజకీయ సంబంధాలు బాగా పెరుగు తాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఈ రాశివారి ఆధిపత్యం పెరుగు తుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. బాగా డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంటుంది.
  3. వృశ్చికం: ఈ రాశివారికి ప్రస్తుతం అర్ధాష్టమి జరుగుతోంది. అయితే, ఈ శని అస్తంగతుడు అవడం వల్ల పెండింగులో ఉన్న పదోన్నతులకు మార్గం సుగమం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అధికార యోగం పడుతుంది. తల్లి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. గృహ, వాహన యోగాలకు అవకాశముంటుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. అయితే, కుటుంబ వ్యవహారాల కారణంగా మనశ్శాంతి తగ్గుతుంది. జీవిత భాగస్వామితో అపార్థాలు తలెత్తవచ్చు.
  4. మకరం: ఈ రాశివారికి ప్రస్తుతం ఏలిన్నాటి శని నడుస్తోంది. అందువల్ల అస్తంగత్వ దోషం లాభిస్తుందే తప్ప ఎక్కువయ్యే అవకాశం లేదు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ధనపరంగా శుభ వార్తలు వింటారు. మాటకు విలువ ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. అయితే, వ్యక్తిగత సమస్యల ఒత్తిడి ఉంటుంది. డబ్బుపరంగా నష్టపోవడం లేదా మోసపోవడం జరుగుతుంది.
  5. కుంభం: ప్రస్తుతం ఏలిన్నాటి శనిలో ఉన్న ఈ రాశివారికి అస్తంగత్వ దోషం వల్ల పేరు ప్రఖ్యాతులు పెరుగు తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం వృద్ధి చెందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవు తాయి. ప్రతి పనీ ఆలస్యం కాకుండా పూర్తవుతుంది. ఉన్నత స్థాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. అయితే, వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడతారు. మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది. స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశముంది.
  6. మీనం: ప్రస్తుతం ఈ రాశివారికి ఏలిన్నాటి శని జరుగుతోంది. శని వ్యయ స్థానంలో సంచరిస్తూ అస్తం గతుడు అయినందువల్ల దూర ప్రాంతాల్లో ఉద్యోగం రావడం, దూర ప్రాంతానికి బదిలీ కావడం వంటివి జరుగుతాయి. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారికి శుభవార్తలు అందు తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. అయితే, అనారోగ్యాలకు, వైద్య ఖర్చులు పెరగడానికి అవకాశముంది. రహస్య శత్రువులు, పోటీదార్ల వల్ల ఇబ్బంది పడతారు.

ముఖ్యమైన పరిహారాలు: ఏలిన్నాటి దోషం బాగా తగ్గు స్థాయిలో ఉండాలన్నా, అస్తంగత్వ దోషం నుంచి బయటపడాలన్నా ప్రతి శనివారం శని గ్రహానికి దీపం వెలిగించడం గానీ, రోజూ శివార్చన చేయడం గానీ, తరచూ శివాలయానికి వెళ్లడం గానీ చేయడం చాలా మంచిది. కుల దైవాన్ని, ఇష్ట దైవాన్ని మరింత శ్రద్ధతో ప్రార్థించడం వల్ల ఉత్తమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఎక్కువగా నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించడం వల్ల కూడా శని పాప ప్రభావం తగ్గుతుంది.

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో