AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Jayanti: 300 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. శని దేవుడి ఆశీస్సులతో ఈ 4 రాశులకు ఇక తిరుగులేదు!

ప్రతి ఏటా జ్యేష్ఠ బహుళ అమావాస్య నాడు జరుపుకునే శని జయంతికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే, ఈ ఏడాది రాబోయే శని జయంతి అత్యంత శక్తివంతమైనదిగా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, మున్నూరు సంవత్సరాల తర్వాత ఒకేసారి 'శస మహాపురుష యోగం', 'గజకేసరి యోగం', 'బుధాదిత్య యోగం' , 'సౌభాగ్య యోగం' వంటి మహా శుభ యోగాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ అరుదైన గ్రహాల కలయిక వల్ల 4 రాశుల వారికి శనిదేవుడి ఆశీస్సులు లభించి, ఊహించని ధనలాభం కలగబోతోంది.

Shani Jayanti: 300 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. శని దేవుడి ఆశీస్సులతో ఈ 4 రాశులకు ఇక తిరుగులేదు!
Shani Jayanti Horoscope Results
Bhavani
|

Updated on: May 16, 2026 | 4:02 PM

Share

శని దేవుడు ఎప్పుడూ కష్టపడే వారిని, ధర్మ మార్గంలో నడిచే వారిని త్వరగా అనుగ్రహిస్తాడు. ఈ అరుదైన గ్రహ సంయోగం వల్ల మేషం, మిథునం, సింహం కుంభ రాశుల వారి అదృష్టం శిఖరానికి చేరనుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి కావడమే కాకుండా, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మరి శని దేవుడి ప్రత్యేక కృపకు పాత్రులైన ఆ 4 రాశుల వారి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, శని జయంతి రోజున ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1. మేష రాశి – ఆర్థిక వృద్ధి: మేష రాశి వారికి ఈ సమయం బంగారు కాలం లాంటిది. చాలా కాలంగా నిలిచిపోయిన మొండి బకాయిలు వసూలవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి , సమాజంలో గౌరవం లభిస్తాయి. ఇల్లు లేదా వాహనం కొనాలనే మీ కల నెరవేరుతుంది.

2. మిథున రాశి – కెరీర్‌లో కొత్త శిఖరాలు: వ్యాపార రంగంలో ఉన్న వారికి అద్భుతమైన కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. విదేశీ వ్యాపారాల ద్వారా భారీగా లాభాలు గడిస్తారు. మీ కెరీర్‌లో ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయి జీవితం విలాసవంతంగా మారుతుంది.

3. సింహ రాశి – అడ్డంకులు అన్నీ దూరం: సింహ రాశి వారికి ఈ శని జయంతి ఒక లైఫ్ చేంజింగ్ పీరియడ్ కానుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త అందుతుంది. పూర్వీకుల ఆస్తి వివాదాలు సులభంగా పరిష్కారమవుతాయి.

4. కుంభ రాశి – ధన లాభం: శని దేవుడు తన స్వంత రాశి అయిన కుంభంలోనే సంచరిస్తుండటం వల్ల ఈ రాశి వారికి ‘శస మహాపురుష యోగం’ పట్టింది. పాత పెట్టుబడుల నుండి ఊహించని రీతిలో రెట్టింపు లాభాలు వస్తాయి. రుణాల భారం తగ్గుతుంది. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.

శని జయంతి నాడు ఏం చేయాలి? శని దేవుని ఆగ్రహం తగ్గుముఖం పట్టి, అనుగ్రహం కలగాలంటే ఈ పనులు చేయండి:

ఉదయాన్నే నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించి శని స్తోత్రాలు పఠించాలి.

పేదలకు మినుములు, నల్లటి వస్త్రాలు లేదా అన్నదానం చేయడం వల్ల శని దోషాల తీవ్రత తగ్గుతుంది.

Follow Us