
జ్యోతిషశాస్త్రంలో శనిని క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు.అయితే అది నిజం కాదు. శనీశ్వరుడు న్యాయ దేవుడు. ఎల్లప్పుడూ మనిషి చేసిన కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. మనం ఏ పనులు చేసినా, అది మంచిదైనా, చెడుదైనా.. వాటికి అనుగుణంగా ఫలితాలను శని ద్వారానే పొందుతాము. అయితే ఈ రోజు శనీశ్వరుడు మీనరాసిలో తిరోగమనంలో ఉండనున్నాడు. ఈ నేపధ్యంలో కొన్ని రాశులు ఈ సమయంలో విజయం సాధిస్తాయి. కొన్ని రాశులవారు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
శనీశ్వరుడు తిరోగమనం ఎలా ఉంటుంది?
జూలై 13 నుంచి 138 రోజుల పాటు శనీశ్వరుడు తిరోగమనంలో ఉండబోతున్నాడు. అన్ని గ్రహాలు సంచరిస్తాయి. అయితే శనీశ్వర సంచరించినప్పుడు మాత్రం మనిషి జీవన విధానాన్ని, ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. జీవితపు విధిని, వర్తమానాన్ని ప్రతి ఒక్కరూ పునరాలోచించుకోవాల్సిన సమయం ఇది. ఇది స్వీయ అవగాహన సమయం. కనుక శనీశ్వర దృష్టి నుంచి నివారణలు, లేదా శనీశ్వరుడు అంటే భయపడటం కంటే, ప్రతి ఒక్కరూ అంతర్గత ధ్యానం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది మనసుని శుద్ధి చేసుకునే సమయం.
శనీశ్వరుడు తిరోగమనంలోకి మారినప్పుడు ఏమి జరుగుతుందంటే
జ్యోతిషశాస్త్రంలో శనీశ్వరుడు కఠినమైన గ్రహంగా పరిగణిస్తారు ఎందుకంటే శనీశ్వరుడు క్రమశిక్షణ, అంకితభావం, కృషి, కర్మ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాడు. శనీశ్వరుడు స్థితి అంటే మన జీవితాన్ని దాని నిజమైన రూపంలో గుర్తించాలి.
శనీశ్వరుడు మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మీన రాశి చివరి రాశిగా పరిగణించబడుతుంది. ఇది ఆధ్యాత్మికత, అంకితభావానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. మీన రాశిని బృహస్పతి పాలిస్తాడు. మీనం భావోద్వేగ అనుబంధానికి సంకేతం. మన చర్యల ఫలితాలను మనకు వివరించే గురువు. ఈ సమయంలో మీ చర్యలకు తగిన ఫలితాలు వేగవంతం అవుతాయి. మీ పనులు మంచిగా ఉంటే మీకు అదే ఫలితం లభిస్తుంది. మీ పనులలో ఏవైనా తప్పులు ఉంటే దాని ఫలితాన్ని పొందుతారు.
ఏలినాటి శని, ధైయా, శని దశ లేదా మహాదశ
ఏలినాటి శని, ధైయ, దశ లేదా మహాదశ వంటి వాటితో ఇబ్బంది పడే వ్యక్తులు ఈ సమయంలో తమ కర్మల ప్రభావాలను త్వరగా, వేగంగా అందుకుంటారు. ఎవరి జాతకంలోనైనా శనీశ్వరుడు తిరోగమనంలో ఉంటే, వారు తమ కర్మలను చేయడానికి ఇది సమయం. కనుక ఎవరైనా కష్టపడి, అంకితభావంతో పనిచేస్తే.. అప్పుడు పెండింగ్ పనిని కూడా పూర్తి చేయవచ్చు.
తులా రాశి:
తుల రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో తుల రాశి వారు ఏ పని మొదలు పెట్టినా విజయం లభిస్తుంది, పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కావచ్చు లేదా ధన ప్రయోజనాలు పొందవచ్చు.
మీన రాశి: ఈ రాశికి వారికి సమయం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వీరు కొంచెం జాగ్రత్తగా ఉంటాలి. ఎందుకంటే శనీశ్వర గుణాలు విరుద్ధంగా ఉండే మీన రాశి లక్షణాలతో ఘర్షణ పడతాయి. అటువంటి పరిస్థితిలో వీరి జీవితంలో కొంత గందరగోళం నెలకొంటుంది. వీరి జీవితం ఈ సమయంలో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మానసిక ఒత్తిడి కలగవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.