Horoscope Today (19 April 2023)
Horoscope Today in Telugu: భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. దీనికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్య విధానాన్ని ఎక్కువగా విశ్వసిస్తారు. బుధవారం (19 ఏప్రిల్ 2023)నాడు 12 రాశుల వారికి రాశిఫలాలు ఎలా ఉంటుందో తెలుసుకోండి. ప్రముఖ జ్యోతిష్య ప్రముఖులు కౌశిక్ అందించే రాశి ఫలాలు ఇలా..
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు వెళుతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రోజు సాఫీగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది లేదు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేసి అందుతుంది. విద్యార్థులకు అన్ని విధాలా బాగుంటుంది. హామీలు ఉండవద్దు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆర్థిక సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. హామీలు ఇవ్వడం, వాగ్దానాలు చేయడం ప్రస్తుతానికి మంచిది కాదు. ఉద్యోగ పరంగా కొంత మేలు జరుగుతుంది. వ్యాపార పరిస్థితి బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా ప్రయాణం చేయాల్సి వస్తుంది. వ్యాపారం నిలకడగా సాగుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. కుటుంబ విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో శుభవార్త వింటారు.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆర్థిక పరిస్థితి చాలా వరకు బాగానే ఉంటుంది. ముఖ్యమైన పనులలో బంధుమిత్రుల సహాయం ఉంటుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన చేస్తారు. విద్యార్థులు ఆశించిన స్థాయిలో రాణించడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సంతోషంగా ముందుకు వెళతాయి.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఉద్యోగంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అధికారులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. బంధువుల నుంచి సహాయం అందుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాపారంలో భాగస్వాములు కలసి వస్తారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఆశించినంతగా అనుకూలించవు.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. చిన్నపాటి అదృష్టం పట్టే అవకాశం ఉంది. బాగా దగ్గర వారికి సహాయం చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. జీవిత భాగస్వామితో మాట పట్టింపు వస్తుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు వెళతాయి.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వ్యాపార పరంగా అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది.మంచి పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఒకరిద్దరు సన్నిహితులు ఇరకాట పరిస్థితులు సృష్టించే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. బంధువులు మీ సహాయ సహకారాలు ఆశిస్తారు. ఆరోగ్యంఅనుకూలి స్తుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. స్నేహితురాలికి కానుకలు కొనిస్తారు.
- వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ): ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ అవసరాలకు మించి ఖర్చు చేయాల్సి వస్తుంది. మానసికంగా బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో సహచరుల నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. జీవిత భాగస్వామికి విలువైన వస్తువులు కొనిస్తారు. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగువేస్తారు.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు. ఆస్తుల విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు వస్తాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సంతోషంగా గడిచిపోతాయి.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో మీ ప్రాభవం పెరుగుతుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు సాగిస్తారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. వృత్తి నిపుణులకు బాగానే ఉంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. స్నేహితురాలి మీద బాగా ఖర్చు చేస్తారు.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగ వాతా వరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులుసాను కూలంగా ఉంటాయి. ఇతరులకు సహాయం చేసే విషయంలో హామీలు ఉండవద్దు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. ఉద్యోగరీత్యా ప్రయా ణాలు చేయాల్సి వస్తుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు బాగుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సఫలం అవుతారు.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..