Job Astrology: అరుదైన యోగం..ఆ రాశుల వారికి జీతాల పెంపు, పదోన్నతికి ఛాన్స్..!

గురు, రవులు ఒకరికొకరు కేంద్ర స్థానాల్లో ఉండడం అనేది జ్యోతిషశాస్త్రంలో ఒక అరుదైన యోగం. అందులోనూ ఈ రెండు గ్రహాల మధ్య సమ సప్తకం ఏర్పడడం, అంటే ఒకరికొకరు సప్తమ కేంద్రంలో ఉండడం మరింత యోగదాయం అవుతుంది. ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న గురువుతో ఈ నెల 17న వృశ్చిక రాశిలో ప్రవేశిస్తున్న రవితో సమ సప్తకం ఏర్పడుతోంది.

Job Astrology: అరుదైన యోగం..ఆ రాశుల వారికి జీతాల పెంపు, పదోన్నతికి ఛాన్స్..!
Job Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 10, 2024 | 6:04 PM

గురు, రవులు ఒకరికొకరు కేంద్ర స్థానాల్లో ఉండడం అనేది జ్యోతిషశాస్త్రంలో ఒక అరుదైన యోగం. అందులోనూ ఈ రెండు గ్రహాల మధ్య సమ సప్తకం ఏర్పడడం, అంటే ఒకరికొకరు సప్తమ కేంద్రంలో ఉండడం మరింత యోగదాయం అవుతుంది. ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న గురువుతో ఈ నెల 17న వృశ్చిక రాశిలో ప్రవేశిస్తున్న రవితో సమ సప్తకం ఏర్పడుతోంది. ఈ రెండు గ్రహాలు మంచి మిత్ర గ్రహాలైనందువల్ల వీటి పరస్పర వీక్షణ తప్పకుండా అధికార యోగాన్ని, ధన యోగాల్ని, ప్రభుత్వమూలక గుర్తింపును, కీర్తి ప్రతిష్ఠలను ఇవ్వడం జరుగుతుంది. వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారికి తప్పకుండా భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతి కలుగుతుంది.

  1. వృషభం: ఈ రాశిలో సంచారం చేస్తున్న గురువుతో రవికి పరస్పర దృష్టి ఏర్పడినందువల్ల ఒక నెల రోజుల పాటు జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో పదవీ యోగం పడుతుంది. ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. గురువు ధన కారకుడైనందువల్ల ఆదా యం కూడా బాగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొనసాగుతాయి.
  2. కర్కాటకం: ఈ రాశికి లాభస్థానంలో ఉన్న గురువుతో పంచమ స్థానంలోని రవికి పరస్పర వీక్షణ ఏర్పడినం దువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సత్ఫలితాలనిస్తుంది. ప్రతిభాపాటవాలకు గుర్తింపు లభిస్తుంది. గౌరవ మర్యాదలు, పలుకుబడి వృద్ధి చెందుతాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వ్యక్తిగత, ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. అనేక శుభవార్తలు వింటారు.
  3. సింహం: రాశినాథుడైన రవి చతుర్థంలో ఉండడం ఒక విశేషం కాగా, దాని మీద గురువు పూర్ణ దృష్టి ఏర్పడడం మరో విశేషం. ఈ రాశివారికి చాలావరకు శుభ ఫలితాలే అనుభవానికి వస్తాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లేదా పదోన్నతికి అవకాశం ఉంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. సామాజిక హోదా కూడా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది.
  4. వృశ్చికం: ఈ రాశిలో ఉన్న దశమాధిపతి రవి మీద ధన, పంచమాధిపతి గురువు దృష్టి పడినందువల్ల ఉద్యోగపరంగా జీతభత్యాలు, ఆదాయం బాగా వృద్ధి చెందుతాయి. సమర్థతకు, ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలోనే కాక, సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. నిరు ద్యోగుల కల సాకారం అవుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. గృహ యోగం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి.
  5. మకరం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న రవి మీద పంచమ స్థానం నుంచి గురువు దృష్టి పడినందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెంది, ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య, వ్యక్తిగత సమస్యల నుంచి కూడా చాలావరకు విముక్తి లభిస్తుంది. లాభదాయక పరిచ యాలు ఏర్పడతాయి. ప్రభుత్వమూలక ధన లాభం కలుగుతుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు కూడా లభిస్తుంది. రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
  6. కుంభం: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉన్న గురువుతో దశమంలో ఉన్న రవికి సమ సప్తక దృష్టి ఏర్పడినందువల్ల ఉద్యోగంలో తప్పకుండా హోదా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మరికొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగు తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుం డదు. శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుంది.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!