శుభ గ్రహంగా మారుతున్న పాపగ్రహం.. వారికి ఆకస్మిక ధనలాభానికి ఛాన్స్!
జ్యోతిషశాస్త్రంలో అత్యంత పాప గ్రహంగా రాహవుకు పేరుంది. రాహువు మే 18 నుంచి కుంభ రాశిలోకి మారి.. ఈ రాశిలో దాదాపు ఏడాదిన్నర పాటు సంచారం చేస్తాడు. ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న రాహువుకు ఈ నెల 28 నుంచి తన గురువైన శుక్రుడు తోడవుతున్నందువల్ల శుభ గ్రహంగా మారిపోయే అవకాశం ఉంది. దీంతో ఏప్రిల్ మొదటి వారం వరకూ కొన్ని రాశులకు కలలో కూడా ఊహించని శుభ యోగాలను రాహువు కలిగించే అవకాశం ఉంది.

Rahu Gochar 2025
జ్యోతిషశాస్త్రంలో అత్యంత పాప గ్రహంగా పేరున్న రాహవు మే 18 నుంచి కుంభ రాశిలోకి మారడం జరుగుతోంది. కుంభ రాశిలో రాహువు ఏడాదిన్నర పాటు సంచారం చేస్తాడు. ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న రాహువుకు ఈ నెల 28 నుంచి తన గురువైన శుక్రుడు తోడవుతున్నందువల్ల శుభ గ్రహంగా మారిపోయే అవకాశం ఉంది. ఏప్రిల్ మొదటి వారం వరకూ రాహువు వృషభం, మిథునం, తుల, వృశ్చికం, మకర రాశులకు కలలో కూడా ఊహించని శుభ యోగాలను కలిగించే అవకాశం ఉంది. ఏ రాశికైనా రాహువు అనుకూలంగా ఉన్న పక్షంలో అనారోగ్యాల ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. విదేశీ సంపాదనకు, ఆకస్మిక ధన లాభానికి, షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల ఆదాయానికి అవకాశం ఉంటుంది.
- వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు ఇబ్బడిముబ్బడిగా ఆదాయాన్ని పెంచే అవకాశం ఉంది. జీవితంలో ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సాధారణ వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంది. జీవనశైలిలో మార్పు జరుగుతుంది. అనేక మార్గాల్లో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ది చెందడం వంటివి జరుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడంతో పాటు, డిమాండ్ బాగా పెర గడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరగడం తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా తరచూ విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు నెలకొంటాయి. పెళ్లి ప్రయత్నాలు, ప్రేమ వ్యవహారాల్లో తప్పకుండా విజయాలు సాధిస్తారు.
- తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు ఈ నెల 28న శుక్రుడితో యుతి పొందిన క్షణం నుంచి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందడం జరుగుతుంది. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్యల నుంచి కూడా బయటపడడం జరుగుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. మిత్రుల నుంచి రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్రుడితో కలిసిన రాహువు వల్ల మనసులోని కొన్ని కోరికలు, ఆశలు తప్పకుండా నెరవేరుతాయి. ఆదాయ వృద్ధికి సంబంధించిన ప్రతి ప్రయత్నమూ నెరవేరు తుంది. రావలసిన సొమ్మంతా వసూలవుతుంది. విదేశీ సంపాదనను అనుభవించే యోగం కలు గుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు, సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. నిరుద్యోగులకు భారీ జీతాలతో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్ర రాహువులు కలవడం వల్ల ధన, అధికార, ఆరోగ్య, ఆస్తి లాభాలు కలుగుతాయి. కొద్ది ప్రయత్నంతో అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రయా ణాల వల్ల కూడా లాభాలు కలుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఘన విజయాలు సాధిస్తారు. నిరుద్యోగుల విదేశీ ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సొంత ఇంటికల కూడా తప్పకుండా నెరవేరుతుంది.