ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ హనుమాన్ ఆలయంలో నాలుగు రోజులుగా ఓ కుక్క హనుమాన్ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ భక్తులను ఆశ్చర్యపరుస్తోంది. ఆలయం తెరిచిన వెంటనే కుక్క అక్కడికి చేరుకుని క్రమం తప్పకుండా ప్రదక్షిణలు చేయడంతో స్థానికులు, భక్తులు దీనిని ఆంజనేయ స్వామి లీలగా భావిస్తున్నారు. ఈ అద్భుత ఘటన చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించి, సోషల్ మీడియాలో వైరల్గా మారింది.