Rahu Transit 2024
కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి ఆరు రాశుల వారికి రాహువు కారణంగా యోగాలు పెరగబోతున్నాయి. ఎక్కువగా ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. ధనపరంగా అనుకోని, ఏమాత్రం ఊహించని అదృష్టాలు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్న రాహువు వచ్చే ఏడాదంతా ఇదే రాశిలో కొనసాగడం జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, కుంభరాశివారికి ఆర్థికంగా తప్పకుండా దశ తిరిగే అవకాశం ఉంది. వక్ర గ్రహమైన రాహువు సాధారణంగా సవ్యమైన మార్గాలతో పాటు, అపసవ్య, అక్రమ మార్గాలలో కూడా సంపద, సంపాదన పెంచే అవకాశం ఉంటుంది.
- వృషభం: ఈ రాశివారికి గత అక్టోబర్ నుంచి లాభ స్థానంలో సంచరిస్తున్న రాహువు కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో సంపాదన, వ్యాపారాల్లో లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరగడం జరుగుతుంది. ప్రభుత్వ విభాగాల్లోనే కాక, కొన్ని ప్రైవేట్ రంగ వ్యాపార సంస్థల్లో కూడా అదనపు ఆదాయానికి అవకాశం ఉంటుంది. ఆర్థికపరంగా మనసులో ఉన్న ఒకటి రెండు ప్రధాన కోరికలు తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు రాబడికి అవకాశం ఉన్న సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
- మిథునం: దశమ స్థానంలో రాహువు సంచారం వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు బాగా పెర గడం జరుగుతుంది. బాగా రాబడి ఉన్న ఉద్యోగాలకు మారే అవకాశం కూడా ఉంటుంది. మొత్తం మీద ఆకస్మిక ధన లాభానికి, అప్రయత్న ధన ప్రాప్తికి అవకాశం ఉంది. కొత్త సంవత్సరంలో వీరి ఆదాయం బాగా పెరిగి, గృహ, వాహన సౌకర్యాలు పెరగడంతో పాటు, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగా వృద్ధి చెందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలించే సూచనలు కూడా ఉన్నాయి.
- కర్కాటకం: ఈ రాశివారికి నవమ స్థానంలో రాహువు సంచారం వల్ల విదేశీ ధనాన్ని అనుభవించే యోగం పడుతుంది. విదేశాల్లో ఆశించిన జీతభత్యాలతో ఉద్యోగం సంపాదించడం, తల్లితండ్రుల నుంచి ఆస్తి కలిసి రావడం, పెద్ద మొత్తంలో బకాయిలు అందడం వంటివి జరిగే అవకాశం ఉంది. అనుకోని మార్గాలలో డబ్బు లభించడం, రావలసిన డబ్బు చేతికి అందడం, మొండి బాకీలు వసూలు కావడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది. లాటరీలు, జూదాలు వంటివి కూడా కలిసి రావచ్చు.
- తుల: ఈ రాశికి షష్ట స్థానంలో రాహువు సంచారం ప్రారంభించడం నిజంగా ఒక అదృష్ట యోగమే. జీతభత్యాలు ఆశించిన స్థాయిలో పెరగడం జరుగుతుంది. అదనపు రాబడి కూడా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతాయి. ఆర్థిక సమ స్యలు పూర్తిగా పరిష్కారం కావడంతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగా పెరుగుతుంది. ఇత రులకు భారీగా సహాయం చేసే స్థాయికి చేరుకుంటారు. గృహ, వాహన సౌకర్యాలు పెరుగుతాయి.
- మకరం: ఈ రాశికి ‘వృద్ధి’ స్థానమైన తృతీయ స్థానంలో రాహువు సంచారం ప్రారంభించడం వల్ల రుణ భారం నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి రాబడి బాగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు అదనపు రాబడికి అవకాశం ఉన్న ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా మనసులోని కోరికలు నెరవేరుతాయి.
- కుంభం: ఈ రాశివారికి ధన స్థానంలో రాహువు సంచారం వల్ల అనేక విధాలుగా ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలితాయి. అదనపు రాబడికి మార్గాలు ఏర్పడతాయి. ప్రభుత్వోద్యోగుల్లో చాలామందికి ధన స్థానంలోకి రాహువు రావడం ఒక అదృష్టమనే చెప్పాలి. వృత్తి, వ్యాపారాల్లో కూడా వారి సంపాదన అంచనాలకు మించి పురోగతి చెందుతుంది. ఈ రాశివారికి ఈ ఏడాది ఆర్థిక సమస్యలు దాదాపు అదృశ్యం అయ్యే అవకాశం ఉంది.