Zodiac Signs: ఈ 3 రాశులవారు అహంకారులు, ఇతరులతో కఠినంగా వ్యవహరిస్తారు.. ఆ రాశులేంటో తెలుసా.?

| Edited By: Ram Naramaneni

Oct 28, 2021 | 6:24 PM

మనుషుల్లో చాలా రకాలవారు ఉంటారు. కొందరు తమ చుట్టూ ఉన్నవాళ్ళను కలుపుకుని ముందుకుపోతే.. మరికొందరు తామే సుపీరియర్లలా..

Zodiac Signs: ఈ 3 రాశులవారు అహంకారులు, ఇతరులతో కఠినంగా వ్యవహరిస్తారు.. ఆ రాశులేంటో తెలుసా.?
Zodiac Signs
Follow us on

మనుషుల్లో చాలా రకాలవారు ఉంటారు. కొందరు తమ చుట్టూ ఉన్నవాళ్ళను కలుపుకుని ముందుకుపోతే.. మరికొందరు తామే సుపీరియర్లలా ఫీల్ అవుతూ.. మిగిలినవారు తమ చెప్పుచేతల్లోనే ఉండాలనుకునే గర్వం, అహంకార స్వభావం కలిగి ఉంటారు. తాము చెప్పిందే కరెక్ట్ అంటూ.. మిగితావారిని చిన్న చూపు చూస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తెలివిగా తప్పించుకోగలమని ఓవర్ కాన్ఫిడెన్స్.. తాము లేకపోతే ప్రపంచం లేదన్నట్లుగా అహాన్ని ప్రదర్శిస్తూ ఇతరులతో కఠినంగా ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అలాంటివి 3 రాశులు ఉన్నాయి.

మిధునరాశి

ఈ రాశివారు అప్పుడప్పుడూ ఇతరులను అగౌరపరుస్తుంటారు. అయితే ఇది వారి స్వీయ లక్షణం కాకపోయినప్పటికీ.. తమ మానసిక పరిస్థితి సరిగ్గా లేనప్పుడు మాత్రం ఇలాంటి చర్య జరుగుతుంటుంది. పరిస్థితి అనుకూలించకపోతే, ఈ రాశివారు ముందు వెనుక ఆలోచించకుండా కటువుగా మాట్లాడేస్తారు.

తులారాశి

తులారాశివారు కొన్నిసార్లు నీచంగా, మరికొన్నిసార్లు అహంతో ప్రవర్తిస్తారు. ఏదైనా పనిని వారు సాధించలేకపోయినప్పుడు.. ఆ నిరాశను ఎదుటివారిపై చూపిస్తారు. వారు మానసికంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు.. దూరంగా ఉండటం మంచిది. లేదా కాస్త చేదు అనుభవాన్ని రుచి చూడాల్సి వస్తుంది.

వృశ్చికరాశి

ఈ రాశివారు తమకు ఇష్టలేని వారి పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తారు. అందుకే ఎప్పుడైనా వృశ్చిక రాశివారు మీతో కోపంగా మాట్లాడతే.. మీ వైబ్(Vibes) అతడితో సరిపోలేదని.. ఇద్దరి మధ్య స్నేహం కుదర్లేదని అర్ధం చేసుకోవాలి. ఈ రాశివారితో మీరు సంబాషణ సాగించాలనుకుంటే ఖచ్చితంగా ఒకటికి రెండుసార్లు లోతుగా అలోచించాల్సిందే.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. కేవలం పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ప్రచురితమైంది.

ఇవి చదవండి:

Viral Video: చెరువులో ఈత కొడుతున్న వ్యక్తి.. అంతలో మొసలి మెరుపు దాడి.. చివర్లో ట్విస్ట్ అదుర్స్.!

Viral: సరదాగా 4 గంటలు పబ్‌లో గడిపారు.. మద్యం సేవించారు.. చివరిగా బిల్లు చూసి నోరెళ్లబెట్టారు!

Garuda Puranam: ఈ 3 అలవాట్లు వెంటనే మానేయాలి.. లేదంటే కష్టాలు తప్పవు.!