AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budh Gochar 2026: వృషభ రాశిలో బుధుడు.. ఆ రాశుల వారికి పండుగే పండుగ!

Mercury Transit in Taurus: వృషభ రాశిలో బుధుడి అనుకూల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. ముఖ్యంగా వృషభం, కర్కాటకం, సింహం, కన్య, మకరం, కుంభ రాశుల వారికి ఆదాయం పెరగడం, కుటుంబ సమస్యలు పరిష్కారం కావడం, శుభ వార్తలు వినిపించడం వంటి సానుకూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Budh Gochar 2026: వృషభ రాశిలో బుధుడు.. ఆ రాశుల వారికి పండుగే పండుగ!
Budh Gochar
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 08, 2026 | 6:49 PM

Share

ఉచ్ఛ, స్వక్షేత్రాల తర్వాత బుధుడికి ఎంతో ఇష్టమైన రాశి వృషభం. ఈ రాశిలో బుధుడు ఎంతో అనుకూలంగా సంచారం చేయడంతో పాటు స్వేచ్ఛగా ఫలితాలనిస్తాడు. శుభ పరిణామాలకు, శుభ వార్తలకు కారకుడైన బుధుడు ఈ రాశిలో ఉన్నంత కాలం కొన్ని రాశులవారి జీవితంలో ఏదో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వృషభ రాశిలో బుధుడి సంచారం వల్ల ఆదాయానికి, కుటుంబానికి, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం పెరుగుతుంది. వృషభం, కర్కాటకం, సింహం, కన్య, మకరం, కుంభ రాశుల వారి జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది.

  1. వృషభం: ఈ రాశికి ధన, పంచమ స్థానాధిపతి అయిన బుధుడు ఈ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి రాజపూజ్యాలు కలుగుతాయి. రాజయోగాలు, ధన యోగాలు పడతాయి. వీరి ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల పరంగానే కాకుండా, సామాజికంగా కూడా మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. అధికారులకు మీ సలహాలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా పిల్లలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
  2. కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో బుధుడి సంచారం వల్ల తోబుట్టువులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలను మించి లాభిస్తాయి. ప్రయాణాలు విజయవంతమవుతాయి. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకోవడం, శుభవార్తలు వినడం జరుగుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా సత్ఫలితాలుంటాయి. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది.
  3. సింహం: ఈ రాశివారికి దశమ స్థానంలో ధన, లాభాధిపతి బుధుడి సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. అనేక ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. ఆస్తి కలిసి వస్తుంది. కుటుంబ స్థాయి పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి ఆస్కారముంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది.
  4. కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో రాశ్యధిపతి బుధుడు ప్రవేశించడం వల్ల ఈ రాశికి చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అత్యధికంగా అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు ఎక్కువగా వెళ్లే అవకాశం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యో గంలో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. విలాస జీవితం అనుభవిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు బాగా విస్తృతం అవుతాయి. రాజకీయంగా అధికార యోగం పడుతుంది.
  5. మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో భాగ్య స్థానాధిపతి బుధుడు బలంగా సంచరించడం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. విదేశాల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి రావడం జరుగుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు చదువుల్లో బాగా రాణిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.
  6. కుంభం: ఈ రాశికి పంచమాధిపతి అయిన బుధుడు చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల రాజ యోగం పడుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. అకస్మాత్తుగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంపన్నుల కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us