AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మే 1 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగాల్లో శుభవార్తలు.. 12 రాశుల వారికి ఇలా..

మే 1, 2026 శుక్రవారానికి సంబంధించిన రాశిఫలాల్లో చాలా రాశుల వారికి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదాయ వృద్ధి, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార పురోగతి వంటి అంశాల్లో శుభ ఫలితాలు ఉండగా, కొన్ని రాశుల వారు ఒత్తిడి, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మొత్తంగా చూస్తే చాలా మందికి ఈ రోజు సానుకూలంగా, ప్రయోజనకరంగా సాగనుంది.

మే 1 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగాల్లో శుభవార్తలు.. 12 రాశుల వారికి ఇలా..
Rashifal In Telugu 01 May 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 01, 2026 | 5:45 AM

Share

దిన ఫలాలు (మే 1, 2026): మేష రాశి వారికి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితంలో శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. మిథున రాశి వారికి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉండవచ్చు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ముఖ్యమైన పనుల్ని కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో వేగం, ఉత్సాహం పెరుగుతాయి. వృత్తి జీవితం లాభదాయకంగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చాలావరకు చక్కబెడతారు. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగ జీవితంలో శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక ప్రయత్నాలు చేపట్టడం మంచిది. ముఖ్యమైన పనులు అనుకున్నవి అనుకున్నట్టుగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉండవచ్చు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మీద భారీగా ఖర్చు చేస్తారు. జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో నష్టాలు తగ్గుముఖం పడతాయి. ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. పెండింగ్ పనులను పూర్తి చేయడం మంచిది. ఇతరులకు సంబంధించిన బాధ్యతలను తలకెత్తుకోవడం వల్ల ఇబ్బంది పడతారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు బాగా నిదానంగా పురోగమిస్తాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలకు అవకాశం ఉంది. అనవసర వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. స్నేహితుల సహాయ సహకారాలతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు సంతృప్తికరంగా పరిష్కారమవుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. స్నేహితులతో ఇబ్బందులు తలెత్త వచ్చు. ఎవరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. కొన్ని పనుల్ని పూర్తిచేయడంలో శ్రమాధిక్యత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కోపతాపాలను తగ్గించుకోవడం మంచిది. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

లాభ స్థానంలో ఉన్న శనీశ్వరుడి అనుగ్రహం వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయటా మీ మాటకు తిరుగుండదు. తలపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధు మిత్రులకు అండగా నిలబడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ జీవితం బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, సంతృప్తికరంగానే సాగిపోతుంది వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. రావలసిన డబ్బు అనుకోకుండా అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

థనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుకు ప్రాధాన్యం పెరుగుతుంది. కెరీర్ పరంగా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలోనే కాక, బంధుమిత్రుల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనులు తేలికగా పూర్తవుతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఉన్నతస్థాయి వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. చిన్న నాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. జీవిత భాగ స్వామితో కలిసి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఒక శుభ కార్యంలో దూరపు బంధువుల్ని కలుసుకుంటారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. సోదరులతో కొన్ని వివాదాలు, విభేదాలు పరిష్కారం అవుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదరణ, ప్రోత్సాహాలు పెరుగుతాయి. కానీ, బరువు బాధ్యతలు మీద పడతాయి. వ్యాపారాల్లో కొద్ది లాభాలతో తృప్తిపడాల్సి వస్తుంది. ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కానీ, అనవ సర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఆహార, విహారాల్లో, ప్రయాణాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం సాపీగా, హ్యాపీగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో కొత్త బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాలను చక్కదిద్దడం మీద దృష్టి పెడతారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కొంత ఆలస్యంగానైనా ముఖ్య మైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆఫర్లు అందివస్తాయి. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య శాస్త్ర నిపుణుల విశ్లేషణలు గ్రహగతుల ఆధారంగా రూపొందించబడింది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత జాతకచక్రాలను బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు. సంబంధాలలో సమస్యలు తలెత్తినప్పుడు ఒకరినొకరు చర్చించుకోవడం ద్వారా పరిష్కరించుకోవడమే శ్రేయస్కరం.

Follow Us