Makara Rasi | Ugadi Horoscope 2023: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఫలితాలు ఇలా..

Makara Rasi Ugadi Rasi Phalalu 2023: తెలుగువారి నూతన సంవత్సర కాలంలో మకర రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నది ఇక్కడ పరిశీలిద్దాం.

Makara Rasi | Ugadi Horoscope 2023: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఫలితాలు ఇలా..
Makara Rasi Ugadi Rasi Phalalu 2023Image Credit source: TV9 Telugu
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 22, 2023 | 6:42 AM

తెలుగువారి కొత్స సంవత్సరాదినే ఉగాది అని అంటారు.  శ్రీ శోభకృత్ నామ సంవత్సరం బుధవారం (మార్చి 22) నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 23 నుంచి గురుగ్రహం మేషరాశిలో సంచారం ప్రారంభిస్తుంది. అదేవిధంగా, అక్టోబర్ 24న మీనరాశిలో రాహు సంచారం కన్యారాశిలో కేతువు సంచారం ప్రారంభం అవుతుంది. శని గ్రహం ఈ ఏడాదంతా కుంభ రాశిలో కొనసాగుతుంది.  మిగిలిన గ్రహాలు సుమారుగా నెలరోజులు చొప్పున వివిధ రాశుల్లో సంచరించడం జరుగుతుంది. గ్రహాల సంచారం ఆధారంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర కాలంలో మకర రాశి వారికి జ్యోతిష్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నది ఇక్కడ పరిశీలిద్దాం.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2,)

ఆదాయం 11, వ్యయం 5 | రాజపూజ్యం 5, అవమానం 6
ధనస్థానంలో శనీశ్వరుడు, సుఖస్థానంలో గురు రాహులు దశమ స్థానంలో కేతువు సంచరిస్తున్నందు వల్ల ఈ రాశి వారు ఈ ఏడాది కొన్ని వ్యక్తిగత సమస్య నుంచి ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. ఒకటి రెండు కుటుంబ సమస్యలు కూడా పరిష్కారమై మనశ్శాంతి ఏర్పడుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగపరంగా పని భారం పెరిగినప్పటికీ ఉద్యోగ జీవితం సంతృప్తి కరంగా సాగిపోతుంది.
ఏలినాటి శనిలో ఉన్నప్పటికీ ఆర్థిక ప్రయత్నాల వల్ల ప్రయోజనం ఉంటుంది. కుటుంబ వృద్ధి ఉంటుంది. ఇల్లు కొనడానికి ప్రణాళిక వేసుకుంటే అది త్వరలోనే కార్యరూపం ధరిస్తుంది. తోబుట్టు వులతో కలిసి తీర్థయాత్ర గానీ, విహారయాత్ర గానీ చేసే అవకాశం ఉంది. బంధువులు మీ సలహాలు,  సూచనలకు విలువనిస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడటం జరుగు తుంది. ఎక్కువమందికి మేలు జరిగే పనులు చేస్తారు. మితిమీరిన ఔదార్యంతో వ్యవహ రిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకు వెళతారు.
త్వరలో మంచి ఉద్యోగం
మంచి ఉద్యోగానికి మారే అవకాశం కూడా ఉంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఎంత కష్టపడితే అంత ప్రయోజనం ఉంటుంది. కొద్దిగా శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగి పోతుంది. పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.
మార్చి నుంచి మంచి రోజులు
మార్చి నెల చివరి వారం నుంచి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. కొందరు స్నేహితులను గుడ్డిగా నమ్మటం వల్ల సమస్యలు చిక్కుకునే ప్రమాదం ఉంది. వాహన ప్రమాదాలతో జాగ్రత్త.
శివ పూజ అవసరం
ఉత్తరాషాడ, శ్రవణం నక్షత్రాల వారు మరింతగా శుభ ఫలితాలను అనుభవిస్తారు. నమ్మకద్రోహం చేసేవారు ఉంటారని అర్థం చేసుకోవడం మంచిది. ఎక్కువగా శివుడిని ధ్యానించడం వల్ల కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కష్టే ఫలీ అనే సూత్రాన్ని నమ్ముకుని ఉండండి.

(Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..)

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?
ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?
బలగం బ్యూటీ కిల్లర్ లుక్స్..
బలగం బ్యూటీ కిల్లర్ లుక్స్..
ఇంట్లో నుంచే ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలకు రూ. 50 వేలు పక్కా.!
ఇంట్లో నుంచే ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలకు రూ. 50 వేలు పక్కా.!
ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్ చూశారా? గూస్ బంప్స్ అంతే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్ చూశారా? గూస్ బంప్స్ అంతే!
పాము గుడ్లను కోడి గుడ్లలా తినే దేశాలు.. సైన్స్ ఏమి చెబుతుందంటే..
పాము గుడ్లను కోడి గుడ్లలా తినే దేశాలు.. సైన్స్ ఏమి చెబుతుందంటే..
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్